వృశ్చిక రాశి వారి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Vruschika Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Vruschika Rasi 2025-2026 వృశ్చిక రాశి

వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు

“తో, నా, నీ, నూ, నే, నో, య, యా, యూ” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు వృశ్చికరాశికి చెందినవారు.

ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2

వృశ్చికరాశి వారిఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసునామ సంవత్సరమంతయూ శుభా శుభ మిశ్రమ ఫలితములతో నుండగలదు. ప్రతిపని యందు ఆటంకములు శతృపీడ రోగభయము ఇంటా బయట కలహములతో చికాకుగా నుండును. మానసిక అస్ధిరతతో ఇబ్బందులు పడుదురు. మనోరధము సిద్ధించక వేదనతో నుందురు. తరచు అనారోగ్య సమస్యలు కలుగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు ఆటంకములు కలుగును. భార్య/భర్త సంతానము మధ్య కలహ వాతావరణముతో మనఃశ్శాంతి కరువగును. ఆర్ధిక అనిశ్చితి కలుగును. భూ గృహ నిర్మాణాది కార్యములు, ఇంటియందు శుభకార్యములు వాయిదా పడును. శతృపీడ పెరుగును. సాంకేతిక సమస్యలు ఎక్కువగును. పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకత వ్యక్తమగును. మధ్య మధ్య కొంత ఆయాచిత ధనలబ్ధి కలుగును.

అధిక ప్రయత్నముచే కార్యములు సిద్ధించగలవు. నూతన కార్యములు మందకొడిగా సాగును. బంధుమిత్ర సహకారము కలుగును. గురుదేవతా దర్శనము చేయుదురు.

సంవత్సర ప్రారంభమున అన్నింటియందు శుభ ఫలితములు కలుగును. అత్యంత భోగలాలస కలుగును. ద్రవ్యము మంచి నీళ్ళవలె ఖర్చు చేసెదరు. ఆర్భాట ఆడంబరములకు విలువ నిచ్చెదరు. దాన ధర్మాది కార్యములు లెక్కకు మిక్కిలి చేయుదురు. ఆరోగ్యము కలుగును. రాజదర్శనము కలుగును. శరీరము సత్తువ కలుగును. అందచందములకు ప్రాధాన్యత ఇచ్చెదరు. ఇష్ట కార్యసిద్ధి అప్రయత్న ధనలాభము కలుగును. సంఘ గౌరవం కలుగును.

సంవత్సర మధ్య కాలమునందు హఠాత్తుగా పరిస్థితులు మారి అన్నింటా అపజయము లతో అపకీర్తితో మనో ధృఢత్వము కోల్పోవుదురు. రోగభయము పెరుగును. శరీరమునందు వ్యాధి ప్రవేశించును. వైద్యశాలాదర్శనము, ఔషధ సేవనము నిత్య కృత్యమగును. ఇష్ట బంధు, మిత్రులతో కలహము కలుగును. కుటుంబ వ్యవహారములు వ్యతిరేకముగానుండును. భార్య/భర్త/సంతానము మధ్య సఖ్యత లోపించి కలహములతో మానసిక ప్రశాంతత కోల్పోవుదురు. మీరు చేయు వృత్తి వ్యాపార, ఉద్యోగకార్యముల యందు వ్యతిరేకత వ్యక్తమగును. అన్నింటా ఆటంకము కలుగును. శుభకార్యములకు ఆటంకము ఏర్పడును.

సంవత్సరాంతమున కొంత ఊరట కలుగును. అప్రయత్నముగా ధనవృద్ధి కాగలదు. బంధు మిత్రాదులు సహకరించెదరు. క్షేత్రవృద్ధి, పశులాభము, గోలాభము కలుగును. సుఖ భోజన ప్రాప్తి, నూతనవస్త్రలాభము, సంఘగౌరవము కలుగును. మనస్సుఉల్లాసముగా నుండును. మనో ధైర్యము పెరిగి అన్నింటా శక్తి వంచన లేక కృషి చేయుదురు. కృషి వాణిజ్య ఉద్యోగాది వ్యవహరములయందు గుర్తింపు లభించును. ఆధ్యాత్మిక విషయముల పట్ల ఆకర్షితులగుదురు. గురు దేవతాదర్శనము చేయుదురు. మనోభీష్టములు నెరవేరును. ద్రవ్యలాభము కలుగును. ఆరోగ్యము కుదుటపడును. ఆగిపోయిన కార్యములు ఆలస్యము మీద ప్రారంభ మగును. అభీష్ట సిద్ధి కలుగును. కొన్ని కార్యముల యందు ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూడక తప్పదు. దొంగల భయము అగ్నిభయము కలుగును. విలువైన వస్తువులు పొగొట్టు కొందురు. సాంకేతిక సమస్యలతో కొన్ని సమస్యలు ఏర్పడును. శతృ పీడ కలుగును.

విద్యార్ధులకు అనుకూలకాలము కాదు, అత్తెసరు మార్కులతో గట్టెక్కుదురు. రెండు ఛాన్సు లయందు వ్యతిరేకత వ్యక్తమగును. మంద బుద్ధితో సమస్యల నెదుర్కొందురు. నిరుద్యోగులకు నిరాశ కలుగును. అవకాశములు వచ్చినట్లే వచ్చి ముఖం చాటు వేయును కొంతకాలం తప్పదు, మనఃశ్శాంతి కోల్పోవుదురు. ఆర్ధికమోసములకు గురి అగుదురు. ఉద్యోగులకు కష్టకాలము చేసిన పనికి తగిన గుర్తింపు లభించక వేదన పడెదరు. అవకాశములు కొరకు ఎదురుచూడక తప్పదు ప్రమోషన్లు నిలిచి పోవును అభివృద్ధికి ఆటంకము కలుగును. నమ్మిన వారి వలన మోసములు ఎదురగును. వ్యాపారులకు వ్యతిరేకకాలము అన్నింటా ఆటంకములు ఎదురగును. నష్టములతో ఇబ్బంది పడెదరు మిత్ర బేధము కలుగును. వ్యాపారము రెండు ముక్కలగును. నూతన కార్యములు ఆగిపోవును. కార్మికులకు నిరాశ ఎదురుకాగలదు. కష్టమునకు తగిన ప్రతిఫలము లేదు, మాట పడవలసి వచ్చును యజమానులను సంతృప్తి పరచుట కష్టమగును. కుటుంబ పోషణ కష్టసాధ్యమగును. వ్యవసాయదారులకు చీడపీడల సమస్యలతో నష్టములు ఎదుర్కొందురు. స్థిరాస్తులు కరిగి పోవును. అప్పుల మిగులును. కార్మికులతో సమస్యల నెదుర్కొందురు. ఆక్వాకల్చర్ వారికి అభివృద్ధి తగ్గును. ఆచితూచి అడుగువేయవలెను. హఠాత్తుగా నష్టముల నెదుర్కొందురు. మనోబలము తగ్గును. ఋణములు తీరక ఇబ్బంది పడెదరు కొన్ని కార్యములు వాయిదా పడును. కవులు, కళాకారులకు నిరాశాకాలము ఆదరణ తగ్గును సంఘ గౌరవం క్షీణించును. శతృపీడ కలుగును. ఆర్ధిక వ్యవహారములు తల్లక్రిందులగును. కష్టమునకు తగిన ప్రతిఫలము దక్కక విచారింతురు. సినిమారంగము నిరాశాజనకముగా నుండ గలదు కొత్త ప్రాజెక్టులకు ఆటంకములు ఏర్పడును. ఆర్ధిక పరిస్ధితి విషమించును. రాజకీయ నాయకులకు అభివృద్ధి మందగించును ప్రజా,ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమగును. శతృబాధ ఎక్కువగును. NRI లకు పూర్తి వ్యతిరేకత వ్యక్తమగును. నిరాశ ఎదురగును. వెనుకకు రాక తప్పదు. స్పెక్యులేషన్ లాభించదు.

గ్రహశాంతి : ఈ సంవత్సరమంతయూ శని, బుధ, రాహు, కుజ, రవి, గురు శాంతి జరిపించవలయును. నవగ్రహ శాంతి క్రమం పరిశీలించండి.

అదృష్ట సంఖ్య : '9' 1,2,3,4,7 మిత్ర సంఖ్యలు. ప్రతినెల 9,18,27 తేదీలు ఆది, సోమ, మంగళ, గురువారములు అదృష్టప్రదము.

అదృష్టరత్నం : విశాఖ-పుష్యరాగము, అనూరాధ-నీలము, జ్యేష్ట-పచ్చ ధరించవలెను

రుద్రాక్ష ధారణం : షణ్ముఖి, సప్తముఖి, పంచదశముఖి, షష్టదశముఖి, గౌరిశంకర

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS