తులా రాశి వారి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Tula Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Tula Rasi 2025-2026 తులా రాశి ఫలితాలు

తుల రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

“రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు తులారాశికి చెందినవారు.

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2

తులరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు నామ సంవత్సరమంతయూ శుభాధిక మిశ్రమ ఫలితములతో ఆనందముగా గడుచును. శతృబాధ నశించును. శతృవుల మిత్రులవలె ప్రవర్తించెదరు. ఆరోగ్యము పూర్తిగా సహకరించును. అప్రయత్న కార్యసిద్ధి కలుగును. భృత్యులు అనుకూలముగా నుందురు. ఆదాయము మాత్రమ కొంత ఆటు పోట్లకు గురి అగును. అయినను తలచిన కార్యములు సత్వరము నెరవేర్చగలరు. ఋణములు తీరిపోవును. బంధు మిత్రాదులు సహకరించెదరు. నూతన వ్యక్తుల పరిచయముతో అన్నింటా అనుకూలము కలుగును. వివాహది శుభకార్య ప్రయత్నములు నెరవేరును. భూగృహ నిర్మాణాది కార్యములు నెరవేరగలవు. భూ లాభము కలుగును. మృష్టాన్నభోజన ప్రాప్తి కలుగును. పోలీసు కోర్టు కేసులయందు అనుకూలముగా నుండును. నేత్రబాధ కలుగును.

సంవత్సర ప్రారంభమున అనారోగ్యము కలుగును. ఇంటిలోని పెద్ద వ్యక్తుల ఆరోగ్య భంగములతో కలత చెందుదురు. మానసిక శాంతి నశించును. విపరీతమైన ధనవ్యయము కలుగును. ఋణ వృద్ధి కలుగును. ఆదాయమునకు మించిన వ్యయము కలుగును. గురు పండిత వ్యతిరేకత కలుగును. మనోబలము పెరుగును. దూరదేశము నుండి ఆహ్వనము కలుగును. వీదేశీ ప్రయాణములు అనుకూలించును. దైవదర్శనము చేయుదురు. పండిత గురు దర్శనము కలుగును. తీర్ధయాత్రలు చేయుదురు. అపూర్వ వస్తు లాభము కలుగును. వివాహాది శుభాకార్యము ప్రయత్నములు ఫలించును. నూతన గృహలాభము కలుగును. పోలీసు కోర్టు కేసుల యందు రాజీధోరణితో అనుకూలమగును.

సంవత్సర మధ్యమంబున సర్వత్ర విజయము కలుగును. తలచినదే తడవుగా కార్య సాధన చేయుదురు. శతృబాధ తొలగి పోవును. ధనాదాయము బాగుండును. ఋణములు తీరిపోవును. ఇంటియందు శుభకార్యములు కలుగును. పుత్రసంతాన యోగ్యత కలుగును. భార్య/భర్త/సంతాన సమస్యలు తొలగును. చేయువృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు వృద్ధి కలుగును. గృహలాభము సిద్ధించును. మృష్టాన్న భోజన ప్రాప్తి, ఇష్ట బంధుమిత్రుల సౌఖ్యము కలుగును. సర్వదా సఖులతో సల్లాపములతో ఆనందముగా నుందురు.

సంవత్సరాంతమున కొంత మిశ్రమ ఫలితము కలుగును. శుభాధిక ఫలితములతో ఉత్సాహముగా నుందురు. కీర్తియు, ప్రతాపము, ఆరోగ్యము, మహరాజాశ్రయము దేవతా స్థాపనాధి శుభకార్యములు చేయుదురు. సత్కధా శ్రవణము, భార్య/భర్త /సంతాన వృద్ధి కలుగును. శతృ భయము లేకుండును. అప్రయత్నముగా కార్యము చక్కబడును. రాజమూల కముగా విశేషసౌఖ్యము అపూర్వ వస్తులాభము పుత్ర,పుత్రిక వివాహ సంభవము, విచిత్ర గృహ లాభము. ధనధాన్య వృద్ధియు కలుగును. మధ్య మధ్య కొంత ఆరోగ్య భంగముండును. మోసకారుల పట్ల జాగరూకతతో నుండవలెను. మనోబలము తగ్గినా ధైర్యముతో ముందుకు పోగలరు. భూలాభము, పశువృద్ధి కలుగును. కొన్ని వస్తువులు పాడగును. వాహనములు మొరాయించును. పుత్ర విరోధము కలుగును. అకాల భోజనము, సంఘ గౌరవము పెరుగును.

విద్యార్ధులకు అనుకూలకాలము పరీక్షలలో విజయము సాధించెదరు. అవార్డు రివార్డులు పొందగలరు. అభివృద్ధి బాట పట్టెదరు. నిరుద్యోగులకు శుభ పరిణామము జరుగును. ఎదురుచూచుచున్న ఉద్యోగ ప్రాప్తి కలుగును. ధనవృద్ధి కలుగును. చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించును. ఉద్యోగులకు అత్యంత అభివృద్ధి కరముగా నుండగలదు. పై అధికారుల గుర్తింపు పొంది అభివృద్ధి లోనికి వచ్చెదరు. ప్రమోషన్లు లభించును. కోరిన ప్రాంతమునకు బదలీలుపొందగలరు. వ్యాపారులకు అత్యంత అనుకూలమైన కాలము నూతన వ్యాపారముల కు వ్యాపార అభివృద్ధికి అన్ని విధములా తోడ్పాటు కలుగును. లాభర్ణానతో నూతన వ్యాపారములు ప్రారంభించెదరు. కార్మికులకు శ్రమ తగ్గును. గుర్తింపు పొందెదరు చేసిన పనికి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. గౌరవ మర్యాదలు కలుగును. నూతన ప్రయత్నములు ముందుకు సాగగలవు. వ్యవసాయదారులకు క్షేత్రాభివృద్ధి కలుగును. పంటల విశేషముగా ఫలించును. సమాజములో గౌరవ మర్యాదలు పొందెదరు. నూతన ప్రయత్నములు ఫలించును. నూతన వస్తు వాహనములు సమకూర్చుకుందురు. ఆక్వాకల్చర్ వారికి అనుకూలం ధనయోగము కలుగును. అపరిమితమైన ధన యోగము సిద్ధించును. అప్రయత్న ధనలాభముతో ఆనందముగా నుందురు. కవులు, కళాకారులకు విశేషమైన గుర్తింపు లభించును. సంఘగౌరవము పెరుగును. సన్మాన సత్కారములు పొందగలరు. మీమాటకు ఎదురు లేకుండును. విశేషమైన ధనప్రాప్తి పొందగలరు. నూతన వస్త్ర భూషణ లాభము కలుగును. సినిమారంగము వారికి నల్లేరు మీద నడకలా ఉండును. చేసిన ప్రయత్నము సత్వరమే ఫలించి గుర్తింపు లభించును. ధనాదాయము బాగుండును. బంధుమిత్రాదులు సహకరించెదరు. అభివృద్ధి బాటలో నడిచెదరు. రాజకీయ నాయకులకు నూతన పదవీయోగము లభించును. ప్రజా ప్రభుత్వ మద్దతులు లభించును. సంఘ గౌరవము పెరిగి నూతన పదవులు చేపట్టగలరు. చేపట్టిన పదవికి గౌరవము తీసుకొని వచ్చెదరు. భవిష్యత్తుకు పునాది ఏర్పాటు చేసుకొనగలరు. NRIలకు అనుకూల కాలము విదేశీ ప్రయణము ఫలించును అపూర్వమైన ప్యాకేజిలతో ఉత్సాహముగా నుందురు. సెక్యులేషన్ లాభించును.

గ్రహశాంతి : ఈ సంవత్సరము రవి, శుక్ర, రాహు, కేతు, కుజ శాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి పరిశీలించండి.

అదృష్ట సంఖ్య : ‘6' 5,8 మిత్ర సంఖ్యలు. 15,24 తేదీలు శుక్ర, బుధ, శనివారములు కలిసిన మరింత యోగము.

అదృష్టరత్నం : చిత్త-పగడము, స్వాతి-గోమేధికం, విశాఖ-పుష్యరాగం ధరించవలెను.

అదృష్ట రుద్రాక్ష : పంచముఖి, చతుర్దశముఖి, ఏకవింశతిముఖి రుద్రాక్షధారణ శుభము.

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS