మిథున రాశి వారి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Mithuna Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Mithuna Rasi 2025-2026 మిథున రాశి ఫలితాలు

మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

“కా, కి, కూ, ఖం, జ్ఞ, చ్ఛా, కే, కో, హా” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథునరాశికి చెందినవారు.

ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3

మిధునరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగాఈ విశ్వావసు నామ సంవత్సరమం తయూ శుభా శుభ మిశ్రమ ఫలితములతో నుండును. అధిక ధనవ్యయమగుటచే ధనార్జన లేక ఇబ్బందులు పడుదురు. మనో ధైర్యము తగ్గి ప్రతి చిన్న విషయమునకు అధైర్యమునకు లోనగుదురు. మానసిక సమస్యలు తలెత్తును. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగముల యందు వ్యతిరేకత ఏర్పడును. తరచు కలహములతో మనశ్శాంతి కోల్పోవుదురు. వృత్తి మార్పులు కలుగును. స్వస్థాన చలనము ప్రయాణ విఘ్నములు తరచూ కలుగుచుండును. బంధు మిత్రాదుల వలన సమస్యలు తలెత్తును. పోలిసు కోర్టు కేసులను ఎదుర్కోనవలసి వచ్చును. భూ, గృహనిర్మాణాది కార్యములు ఆగిపోవును. శతృవృద్ధి కలుగును. ఉద్యోగపీడ ఉద్యోగభంగము కలుగును. వివాహది శభకార్యములు వాయిదాపడును.

సంవత్సర ప్రారంభమున అధిక ధనవ్యయము వివాహది శుభకార్యచారణ చేయుటచే అపరిమిత ధనవ్యయము కలిగి ఋణ బాధ కలుగును. ప్రభుత్వ పరమైన అనుమతులు సరి అయిన సమయమునకు రాక ఇబ్బందులు పడుదురు. ఫైనులు కట్టవలసివచ్చును. ప్రభుత్వ అధికారులతో కలహములు కలుగును. పోలీసు కోర్టుకేసులు యందు వ్యతిరేకత వ్యక్తమ గును. తలచిన కార్యములన్నియు వాయిదాపడును. కీర్తిహాని, మర్యాదహాని కలుగును.

వ్యాకులము కలుగును. సరిఅయిన సమయమునకు తగిన సహాయము లేకుండుటచే నష్టముల

పాలగుదురు. ఉద్యోగులకు విఘ్నములు కలుగును. సస్పెన్షన్లను, దూరప్రాంత అయిష్ట బదిలీలు కలుగును.ఎ.సి.బి/సీ.బి.ఐ వంటిసంస్థలచే సమస్యలు ఎదురగును చేయువృత్తి, వ్యాపారాదులలో నష్టముచవిచూచెదరు. వాణిజ్య సంస్థలు మూత పడును పరిశ్రమలకు విఘాతములు కలుగును. పరిశ్రమలు మూసివేసి ఇతర ప్రాంతములకు వెళ్ళవలసిన పరిస్థితి ఎదురగును. సమయమునకు తగిన ఆహరము లేకుండును. బలము, తేజస్సు తగ్గును.

సంవత్సర మధ్యమమునందు కొంత శాంతి ఏర్పడును బంధు మిత్రాదులవలన కొన్ని పనులు నెరవేరగలవు వివాహాది శుభకార్యములు అతికష్టము మీద నెరవేరును భూగృహా నిర్మాణాది కార్యములు మందకొడిగా సాగును, శరీర బలము పెరుగును, ధర్మకార్యముల చేయుదురు. కీర్తిప్రతిష్టలు కొంతమేర పెరుగును. భార్య/భర్త/ సంతానము మధ్య అపోహలు దూరమగును. విడిపోయినవారు తిరిగి కలుసుకునే అవకాశము కలదు. వైద్య శాల దర్శనము, ఔషధసేవనము తప్పనిసరి, ధైర్యము వీడక సమస్యలతో పోరాడుటకు సిద్ధపడుదురు. కొన్ని పోలీసు, కోర్టు కేసులయందు తాత్కాలిక ఉపశమనము కలుగును.

సంవత్సరాంతమున సర్వులతో కలహములు, ధనాదాయము తగ్గి ఋణ బాధలు పెరు గును. మాట నిల బెట్టుకొనుట కష్టమగును. మర్యాద హానికలుగును. కృషి నష్టము కలుగును దూరదేశములకు వలస వెళ్ళవలసివచ్చును. ఉద్యోగభంగములు ఉండును. అధికారులతో మాటపట్టింపులు కలుగును ఉన్నతాధికారులవలన సమస్యలు ఎదుర్కొందురు. నమ్మినవారి వలన మోసములు ఎదురగును ఆర్థిక కష్టములు పెరుగును. బ్యాంకులావాదేవీల యందు సమస్యలు ఏర్పడును. వ్యాపార వాణిజ్య పరిశ్రమలు మూతపడును సొదరులతో ద్వేషము కలుగును. కుటుంబసమస్యలు కొర్టువరకు వెళ్ళును. స్త్రీల వలన సమస్యలు పెరుగును. ప్రయాణ విఘ్నములు, వాహనములు మొరాయించుట, వెనుకకు వచ్చుట వంటి సమస్యలతో ఇబ్బందులు పడుదురు. పశునష్టములు కలుగును. రైతులకు క్రిమి కీటకాల వలన ఆర్థిక నష్టములకు గురి అయ్యెదరు. శరీర బలము తగ్గును. పదవీ గండములు ఉండును.

విద్యార్దులకు పూర్తి వ్యతిరేకకాలము, అత్తెసరు మార్కులతో గట్టెక్కెదరు. మనోదైర్యము తగ్గును. అనారోగ్యసమస్యలు వేధించును. నిరుద్యోగులకు అనుకూలము లేదు మరి కొంత కాలము వేచిచూడక తప్పదు, తాత్కాలిక ఉద్యోగములకు సైతము ఆఫర్లు రాక ఇబ్బంది. పడుదురు. ఉద్యోగులకు కత్తిమీద సామువలెనుండును. పైఅధికారుల వలన సమస్యలు ఏర్పడును. సస్పెన్షన్లు ఎదుర్కొనకతప్పదు, అయిష్ట బదిలీలు జరుగును. వ్యాపారులకు కఠినమైనకాలము వ్యాపారసంస్థలు నష్టములు చవిచూడ వలసి వచ్చును కొన్ని వ్యాపార,పరిశ్రమలు మూతపడును. కార్మికులకు శ్రమ పెరుగును గుర్తింపు తగ్గును. చేసిన పనికి తగిన వేతనము లభించక ఇబ్బంది పడెదరు. వ్యావసాయదారులకు పూర్తి వ్యతిరేకకాలము పంటలు చీడ పీడల లోనగును. ప్రకృతి వైపరీత్యములకు గురి అయ్యెదరు ఆక్వాకల్చర్ వారికి అత్యంత గడ్డుకాలము ఆర్థిక నష్టములు కలుగును దైర్యము తగ్గును కవులు, కళాకారులు సంఘ గౌరవము తగ్గును. మర్యాదహాని కలుగును. అవమానము ఎదుర్కోనక తప్పదు. సినిమారంగం వారికి తిరోగమనము కలుగును. ప్రాజెక్టులు ఆగి పోవును. కొత్త ప్రాజెక్టులకు విఘాతము కలుగును. గుర్తింపు తగ్గిపోయి ప్లాపులతో ఆర్థిక నష్టములతో, కష్టములను ఎదుర్కొనవచ్చును. రాజకీయనాయకులకు మర్యాదకు హాని కలుగును. ప్రజా వ్యతిరేకత కలుగును. పరుల చెప్పిన మాటలు విని, చేసిన పనుల వలన అపకీర్తి పాలగుదురు. పదవీచ్యుతికి లోనగుదురు. కేసుల వలన కొంత నిరాశ పడుదురు.

NRI లకు ఉద్యోగభంములు ఉండును భరతదేశముకు రిక్తహస్తములతో వెనుతిరిగెదరు. ఋణ బాధలు పెరుగును. సెక్యువేషన్ లాభించదు.

గ్రహశాంతి : ఈ సంవత్సరమంతయు కుజ, రవి, రాహు, శని, గురు, కేతు గ్రహశాంతి ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.

అదృష్ట సంఖ్య : ‘5' 5,14,23 తేదీలు బుధవారములతో కలసివచ్చిన యోగం 1,3,4,6,8,9, ఆది, మంగళ, గురు, శుక్రవారములు శుభం.

అదృష్ట రత్నం : మృగశిర వారు పగడం, ఆరుద్రవారు గోమేధికం, పునర్వసు వారు కనకపుష్యరాగం ధరించవలెను.

రుద్రాక్ష ధారణం : చతుర్ముఖి, త్రయోదశముఖి, నవదశముఖి

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS