Meena Rasi 2025-2026 మీన రాశి ఫలితాలు
మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర 1, 2, 3 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు
“ది,దు,శ్యం,ఝా,దా,దే,దో,చా,చి” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందినవారు.
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1
మీనరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు నామ సంవత్సరమంతయు కష్టనష్టములతో అనారోగ్య సమస్యలతో సతమతమగుదురు. సర్వకార్యములు నిలబాటు కలిగి ఉండును. ఏలినాటి శని ప్రభావముచే శరీర పీడ కలుగును. తలచిన కార్యములన్నియూ వాయిదా పడును. అనారోగ్య సమస్యలతో సంవత్సరమంతయూ ఔషద సేవనం చేయవలసి వచ్చును. ఇంటా బయట కలహములతో ఆర్ధిక నష్టములతో మానసిక అశాంతికి లోనగుదురు.
శారీరక శ్రమ పెరిగి తేజస్సు తగ్గును. ముఖ కవళికలు మారిపోవును. ముఖము నల్లగా మారును. ఆకలి మందగించును. వేళాతిక్రమణ భోజనము కలుగును. అనవసరముగా దేశ సంచారము త్రిప్పుట కలుగును. సర్వ సంఘ పరిత్యాగము చేయవలెనన్న తలంపు వచ్చును. వాహన ప్రమాదములు జరుగు సూచనలున్నవి. భార్య/భర్త/సంతానము మధ్య కలహములతో సమస్యలు అధికమగును. అపనమ్మకము అమర్యాద కలుగును.
సంవత్సర ప్రారంభమున కొంత మిశ్రమ ఫలితములు కలుగును. కొన్ని పనులు ఆలస్యము మీద నెరవేరును. శరీరములో శక్తి క్షీణించును. ఎంతప్రయత్నించిన కార్యసాధన కానరాకుండును. బ్యాంకు లావాదేవీలు ఆర్ధిక విషయముల పట్ల సాంకేతిక సమస్యలు ఎదురగును. పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకత వ్యక్తమగును. శుభకార్యములు వాయిదా పడును. అపోహలు పెరిగిపోవును. భూగృహ నిర్మాణాది కార్యములలో ప్రభుత్వ అధికారులతో మాట పట్టింపుల వలన ముందుకు సాగక అశాంతిగా నుందురు. అమర్యాద అగౌరవము స్థాన చలనములతో ఇబ్బందు పడుదురు. వేధింపులకు గురి అగుదురు.
సంవత్సర మధ్యమంబున కొంత ఊరట కలుగును. నూతన మిత్రుల కలయికతో కొన్నిపనులు ఆలస్యముగా నెరవేరును. సమయమునకు ఋణ ద్రవ్యము లభించగలదు. ఆరోగ్యము మెరుగుపడును. దైవభక్తి కలుగును. శుభకార్య నిర్వహణలో ముందడుగు పడును. స్థిరచరాస్తులు విషయమై రాజీ మార్గము అవలంబించెదరు. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు సానుకూల ధోరణి వ్యక్తమగును. నమ్మినవారి వలన మోసములు ఎదురగును. అభిప్రాయ భేదములు కలుగును. సాముదాయకముగా పురోగతి లభించగలదు.
సంవత్సరాంతమున మరింత గడ్డుకాలము ఎదురగును. సర్వ విషయములయందు మందగమనము కలుగును. దేశాంతర ప్రయాణములు చేసి ఆర్థిక నష్టములను మూటగట్టు కొందురు. శరీరము నందు నీరసం నిస్పత్తువ, అలసట కలుగును. పనివారలతో కలహములు కలుగును. హఠాత్తుగా స్థాన చలనముండును. స్థిరాస్తులు కరిగి పోవును. శత్రువుల వలన కొత్త సమస్యలు వచ్చును. మనస్సు వికలమగును. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టును. జంతు, అగ్ని భయము కలుగును. ఇష్ట బంధు మిత్రాదులు దూరమగుదురు. పదవీ గండములు కలుగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు నిరసనలు ఎదుర్కొనవలసి వచ్చును. ఏ.సి.బి. సి.బి.ఐ వంటి సంస్థల దాడులకు గురి అగుదురు. సస్పెన్షను ఎదుర్కొందురు. చర స్థిరాస్తులకు రక్షణ కరువగును. మతిమరుపు కలుగును. వారసత్వ ఆస్తులకు పొగొట్టుకొందురు. అగ్ని విష కీటక భయము కలుగును.
విద్యార్దులకు నిరాశజనకముగా నుండగలదు. మందబుద్ధి కలుగును. చదివిన విషయములు సమయమునకు గుర్తుకు రాక ఇబ్బంది పడెదరు. నిరుద్యోగులకు నిరాశ ఎదురుకాక తప్పదు. చేసిన ప్రయత్నములు తృటిలో తప్పిపోవును. అసహనమునకు గురి అయ్యేదరు. శక్తి క్షీణించును. ఆర్థిక మోసములు ఎదురగును. ఉద్యోగులు డిమోషన్లు కలుగును దూరప్రాంతములకు విసరి వేయబడుదురు. పై అధికారులతో సఖ్యత లోపించును. రెండు, మూడు బదిలీలతో విసుగు చెందుదురు. మర్యాద లోపించును. వ్యాపారులకు నిరాశ తప్పదు. వ్యాపారములు మూత పడును. లాకౌట్లుతో పరిశ్రమలు మూతపడును. ఆర్ధిక నష్టములతో సంస్థలు అమ్ముకొనవలసి వచ్చును. పార్టనర్స్ మధ్య విభేదములు పొడచూపును. కార్మికులకు శ్రమ కాఠిన్యము పెరుగును. చేసిన పనికి గుర్తింపు లభించదు. అనవసర కార్యములు మీద పడును. అన్ని విషయముల యందు వ్యతిరేకత వ్యక్తమగును. నీరసము అలసట, నిస్పత్తువ అసహనము కలుగును. వ్యవసాయదారులకు చీడపీడల సమస్యలతో పంట రాకుండును. చివరి నిమిషములో ప్రకృతి వైపరీత్యములో నష్టములు ఎదురగును. పెట్టుబడులు రాకపోవుటచే ఋణములు చేయవలసి వచ్చును. ఆక్వాకల్చర్ సాగు చేయకుండుట మంచిది. ఆర్థిక నష్టములతో సమస్యలు ఎదురగును. ఋణములు తీర్చుటకు శక్తి చాలకుండును. కవులు, కళాకారులు నిరాశాకాలము. సరియైన పనిలేక అలమటించెదరు. ఉన్న పని సానుకూలముగా చేయలేక అవమానములు పాలు అగుదురు. ప్రజా గుర్తింపు లేక ఇబ్బందులు పడుదురు. సినిమారంగము నిరాశాజనకముగా నుండగలదు. విజయములు లేక డీలా పడుదురు. అనవసర ధనవ్యయము చేయుదురు. వృత్తి మార్పులు చేసుకొనవలసి వచ్చును. ఋణములతో కాలము గడుచును. రాజకీయ నాయకులకు అత్యంత దయనీయ కాలము. అపోహలు అవమానములతో రాజీనామాలు చేయవలసి వచ్చును. శతృవర్గ దాడులను తట్టుకొనలేరు.
NRI లకు పూర్తి వ్యతిరేకత కలుగును. మనో ధైర్యం తగ్గును. స్పెక్యులేషన్ లాభించదు.
గ్రహశాంతి: శని, గురు, కుజ, రాహు, కేతు, రవి గ్రహశాంతులు ఆచరించవలెను నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
అదృష్ట సంఖ్య : ‘3' 1,2,4,7,9 మిత్ర సంఖ్యలు. ప్రతినెలా 3,12,21,30 తేదీలు ఆది, సోమ, గురువారములు కలిసిన మరింత శుభము.
అదృష్టరత్నం : పూర్వాభాద్ర-పుష్యరాగం, ఉత్తరాభాద్ర-నీలం,రేవతి-పచ్చ
రుద్రాక్షధారణం : త్రిముఖి, సప్తముఖి, ద్వాదశముఖి, షష్టదశముఖి శుభము.
మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.
శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..
- మేషరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు