Makara Rasi 2025-2026 మకర రాశి ఫలితాలు
మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు
“బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మకరరాశికి చెందినవారు.
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5
మకరరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు నామ సంవత్సరమంతయూ శుభాధిక మిశ్రమ ఫలితములతో నుండును. ఏలినాటి శని తొలగుటచే పట్టినదల్లా బంగారం అగును. అరోగ్యము సిద్ధించును. బంధుమిత్రాదులు సహకరించెదరు. శక్తికి మించిన పనులు చేసి శభాష్ అనిపించుకొందురు. అభివృద్ధికి తగిన బాటలు వేసుకొందురు. క్షేత్ర వృద్ధి ధనవృద్ధి కలుగును. శతృవులు నశించెదరు. సర్వ సౌఖ్యములు కలుగును. శుభకార్యాచరణ చేయుదురు. మనోల్లాసముతో నుందురు. గృహ నిర్మాణాది కార్యములు సఫలీకృతమగును. భార్య/భర్త/సంతానము మధ్య చక్కటి అవగాహన కలుగును. ధాన ధర్మములకు ఎక్కువగా వెచ్చించెదరు. శతృనాశనము కొరకు ధనవ్యయము చేసి విజయము సాధించెదరు. ఋణములు తీరిపోవును. మధ్య మధ్య స్వల్ప అనారోగ్య లోపములు కలిగినను ఔషదసేవనముతో స్వాంతన కలుగును. సంతానము వలన కొన్ని సమస్యలు కలుగు సూచనలున్నవి.
సంవత్సర ప్రారంభమున సకల కార్య జయము సౌఖ్యము ధన కనక, వస్తు, వాహన ప్రాప్తి, మనోల్లాసము కలుగును. చేయు వృత్తి, వ్వాపార కృషి ఉద్యోగాదులయందు అభివృద్ధి కలుగును. క్షేత్రాభివృద్ధి, పశు, భూ, గో లాభము పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. వివాహాది శుభకార్య ప్రాప్తి సంతాన వృద్ధి కలుగును. ఆత్మ విశ్వాసముతో సకల కార్యముల యందు విజయము సాధించగలరు. సకల జనావళికి ఆదర్శప్రాయులగుదురు. దూరదేశ విదేశీ ప్రయాణములు చేసి విజయము సాధించగలరు. గురు దేవతా సందర్శనం చేయుదురు. అన్నదాన విభవము సముద్రస్నాన ఫలము, నూతన దేవాలయ నిర్మాణాధికారము, యజ్ఞ కర్మాదికారము సిద్ధించును. విదేవీ వస్తు సేకరణ చేయుదురు.
సంవత్సర మధ్యకాలము యందు అపరిమిత ధనవ్యయము చేయుదురు. దాన ధర్మములకు చర స్థిరాస్తులు కరిగిపోవును. భార్య/భర్త/సంతానము మధ్య చికాకులు కలుగును. దొంగల భయము వలన విలువైన వస్తువులు పొగొట్టుకొందురు. అగ్ని భయము కలుగును. ప్రభుత్వపరమైన అనుమతులు నిలచిపోవును. పోలీసు కొర్టు కేసుల యందు వ్యతిరేకత వ్యక్తమగును. జంతు, కీటక భయము కలుగును. శరీర బాధ కలుగును.
సంవత్సరాంతమున సర్వకార్యముల యందు వెసులుబాటు కలుగును. మనోనిబ్బరము పెరిగి అన్నింటా విజయము సాధించెదరు. మానసిక శారీరక సౌఖ్యము కలుగును. భార్య/భర్త/సంతానము మధ్య అన్యోన్యత కలుగును. స్వబుద్ధిచే ప్రయత్నించిన సర్వ కార్యములు సఫలీకృతమగుటచే ఉత్సాహముగా నుందురు. పొగొట్టుకున్న చర స్థిరాస్తులు తిరిగి మీ పరమగును. స్వస్థల ప్రాప్తి కలుగును. గో, భూ, క్షేత్ర లాభము కలుగును. ఇంటియందు మంగళ ప్రదమైన శుభకార్యాచరణ చేయుదురు. విశేష ద్రవ్య లాభము కలుగును. కీర్తి ప్రతిష్టలు కలుగును. సంఘ గౌరవము పెరిగి నూతన రాజకీయ పదవి లభించును. వాక్పరుషము కలుగును. విందు వినోదములతో సంతోషముగా నుందురు.
విద్యార్దులకు పూర్తిగా అనుకూల కాలము. మంచి మార్కులతో విజయము సాధించ గలరు. అవార్డులు రివార్డులు పొందగలరు. స్టేట్ ర్యాంకులు పొందుటకు అనుకూల కాలము. అనూహ్యముగా అందలం ఎక్కెదరు. నిరుద్యోగులకు ఆశావహ కాలము. చేసిన కృషికి తగిన ఫలితము దక్కును. అవకాశములు ముందుకు వచ్చును. నిరాశలు ఫలించి మంచి ఉద్యోగము పొందుదురు. ఉద్యోగులకు అభివృద్ధికరమైన కాలము. పై అధికారులు మీ మాటకు విలువనిచ్చి మీకు అనుకూలముగా నిర్ణయములు చేయుదురు. ప్రమోషన్లు అనుకున్న ప్రాంతములకు బదిలీలు జరుగును. స్నేహ వాతావరణములో ఆనందముగా నుందురు. వ్యాపారులకు ధనాదాయము బాగుండును. వ్యాపారము ప్రోత్సాహకరముగా నుండగలదు. నూతన వ్యాపారములకు భీజములు వేయుదురు. వ్యాపార అభివృద్ధి జరిగి ఉత్తేజకరముగా నుండగలరు. కార్మికులకు శ్రమ తగ్గును. గుర్తింపు లభించగలదు. శరీర ధారుడ్యము పెరుగును. కృషికి తగిన ఆదాయము లభించును. అభివృద్ధి బాటలో నడిచెదరు. కుటుంబ జీవనము ఆనందకరముగా నుండగలదు. వ్యవసాయదారులకు క్షేత్రాభివృద్ధి కలుగును. చీడపీడల బాధ తప్పును. లాభార్జన చేయగలరు. నూతన క్షేత్రములు అభివృద్ధి పరచగలరు. కృషికి తగిన ప్రోత్సాహము, ఫలితము లభించగలదు. ఆక్వాకల్చర్ వారికి ధనాదాయము రెండురెట్లు కలుగు అవకాశమున్నది. శారీరక మానసిక సౌఖ్యము కలుగును. దొంగల భయము కలుగు సూచనలున్నవి. ధనవృద్ధిచే నూతన కార్యసాధనలో సఫలీకృతము కాగలరు. కవులు, కళాకారులు సన్మాన సత్కారములు కలుగును. సంఘ గౌరవము పెరుగును. నూతన ఆవిష్కరణలు చేయుదురు. మానసికొల్లాసముతో నుందురు. కుటుంబ జీవనము సాఫల్యము కాగలదు. ప్రజా ప్రభుత్వ గుర్తింపు పొందగలరు. సినిమారంగము వారికి నక్కను తొక్కి వచ్చినట్లుండును. తక్కువ బడ్జెట్తో ప్రారంభించిన వారు సైతము అనూహ్యముగా మిలియనీర్లు కాగలరు. దేశ, ప్రపంచ వ్యాప్త అవార్డులు పొందగలరు. గుర్తింపు లభించును రాజకీయ నాయకులకు మిక్కిలి గౌరవ మర్యాదలు పొందుదురు. ప్రజా, ప్రభుత్వ గుర్తింపుతో నూతన రాజకీయ పదవీయోగం సిద్ధించును. ధనాదాయము బాగుండును. అభివృద్ధి కలుగును. NRI లకు అనుకూల కాలము. స్పెక్యులేషన్ లాభించును.
గ్రహశాంతి : ఈ సంవత్సరం రవి, బుధ, రాహు, కేతు, గురు గ్రహశాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
అదృష్ట సంఖ్య : ‘8' 5,6 మిత్ర సంఖ్యలు. ప్రతినెలా 8,17,26 తేదీలు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత శుభము.
అదృష్టరత్నం : ఉత్తరాషాడ-కెంపు, శ్రవణం-ముత్యం, ధనిష్ట-పగడం
రుద్రాక్షధారణం : అష్టముఖి, నవముఖి, సప్తదశముఖి, షష్టదశముఖి, గణేశరుద్రాక్ష
మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.
శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..
- మేషరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు