Maha Shivaratri Lingodbhava Kalam Timings' లింగోద్భవం అంటే ఏమిటి..? మహా శివరాత్రి లింగోద్భవ సమయం ఎప్పుడంటే..!

శ్రీ క్రోధి సంవత్సరము, ఉత్తరాయణం, శిశిరఋతువు ఋతువు, మాఘ మాసం మాసము, కృష్ణపక్షం బుధవారం అనగా ది.. 26వ తేది ఫిబ్రవరి 2025 తేదీన మహాశివరాత్రి.

మహా శివరాత్రి రోజున శివనామ స్మరణము చేసినా, శివార్చన చేసినా విశేషమైన ఫలితము పొందెదరని శివమహా పురాణము లో సుస్పష్టంగా ప్రస్తావించబడినది. సాధారణంగా మహా శివరాత్రి రోజు అంతా అర్చనా, ఉపవాసాది కార్యక్రమములు చేసి స్వామి వారు మనలను అనుగ్రహించే సమయంలో మాత్రం ఆయనను దర్శనం చేసుకోకుండా కాలయాపన చేసెదము. ఆ సమయమే లింగోద్భవ సమయము.

ఉదయమంతా ఎంతటి ఉపవాసం చేసియున్నా, ఎన్ని శివ కార్యక్రమములలో పాల్గొన్నా మరియు జాగారణలను చేసియున్నా లింగోద్భవ సమయంలో మాత్రం స్వామి వారిని దర్శించక పొతే తద్వారా కలిగే ప్రయోజనం నిష్ఫలితము. సాధారణంగా లింగోద్భవ కాలం మహా శివరాత్రి రోజు రాత్రి 12:03 నుండి 12.52 గంటల మధ్యలో సంభవించును.

లింగోద్భవ కలం సమయాలు – 26/27 ఫిబ్రవరి2025

మహా శివరాత్రి లింగోభవ శివార్చన సమయం – రాత్రి 12:03 నుండి 12.52 గంటల వరకు (12:02 am, 27 ఫిబ్రవరి  నుండి 12:51 am 27 ఫిబ్రవరి 2025 వరకు) వ్యవధి 00 గంటల 48 నిముషములు.

మహా శివరాత్రి శుభ సమయాల జాబితా.

  • మహా శివరాత్రి మొదటి ప్రహార పూజ సమయం – సాయంత్రం 06:19 నుండి 09:26 వరకు ఫిబ్రవరి 26
  • మహా శివరాత్రి రెండవ ప్రహార పూజ సమయం – రాత్రి 09:26 నుండి 12:34 వరకు, ఫిబ్రవరి 27
  • మహా శివరాత్రి మూడవ ప్రహార పూజ సమయం – 12:34 AMనుండి 03:41 AM వరకు, ఫిబ్రవరి 27
  • మహా శివరాత్రి నాల్గవ ప్రహార పూజ సమయం – ఉదయం 03:41 నుండి 06:41 వరకు ఫిబ్రవరి 27
  • మహా శివరాత్రి లింగోభవ శివార్చన సమయం – 12:09 am, ఫిబ్రవరి 27 నుండి 12:59 am 2025 ఫిబ్రవరి 27 వరకు
  • చతుర్దశి తిథి ప్రారంభం – ఫిబ్రవరి 26, 2025న  ఉదయం11:08 AM
  • చతుర్దశి తిథి అంత్యం – ఫిబ్రవరి 27, 2025న ఉదయం 08:54 AM
  • శివరాత్రి పరణ సమయం – 06:48 AM నుండి 08:54 AM వరకు ఫిబ్రవరి 27

లింగోద్భవ సమయంలో శివపూజ ఎందుకు?

ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయిన అనంత పుణ్యఫలితములను ఇచ్చెదను. లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకొన్నంత మాత్రం చేతను 76 జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ మహేశ్వరుడే పార్వతికి చెప్పెనని పురాణాలలో పేర్కొనడం జరిగినది. అందుచేత ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ కావునా ఒక కణము జలము, ఒక్కింత భస్మము మహా శివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయమందు పరమేశ్వరునికి సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుచూ..

Tags: Maha Shivaratri 2025, Maha Shivaratri, Maha sivaraththiri 2025 date and time, Maha Shivaratri PDF book, Shiva, Shiva Stotrams

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS