Maha Shivaratri 2025: ఈ సంవత్సరం మహా శివరాత్రి ఎప్పుడు? మహాశివరాత్రి రోజున ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

 

శివరాత్రి.. ఎంతో పవిత్రమైన రోజు. హిందూవులు జరుపుకొనే ముఖ్యమైన పండగలలో ఒకటి. నిష్ఠగా పూజిస్తే.. పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివరాత్రికి భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేస్తారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం.

శ్రీ క్రోధి సంవత్సరము, ఉత్తరాయణం, శిశిరఋతువు ఋతువు, మాఘ మాసము, కృష్ణపక్షం బుధవారం అనగా ది.. 26వ తేది ఫిబ్రవరి 2025 తేదీన మహాశివరాత్రి.

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి.

1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

ఏం చేయాలి..

బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే లేవాలి. ధ్యానం చేయడం మంచిది. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెల్ల రంగు దుస్తులను ధరించాలి. అయితే ఉపవాసానికి ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. రోజు ఉండే డైట్ మారుతుంది కదా. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండండి. ఎక్కువసార్లు ఓం నమ:శివాయ అని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి.

ఏం చేయకూడదు

గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుడదు. పొగాకు, మద్యాన్ని సేవించొద్దు. శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. కేతకి పువ్వులకు దూరంగా ఉండాలి. పూజకు ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించేలా చూసుకోండి. స్టీల్ వద్దు. నలుపు రంగు దుస్తులను ధరించకండి. తులసి ఆకులను దేవదేవుడికి సమర్పించకూడదు.

Click here:

> లింగోద్భవం అంటే ఏమిటి..? మహా శివరాత్రి లింగోద్భవ సమయం ఎప్పుడంటే..!

> మహా శివరాత్రి 2025 తేదీ, ముహూర్త సమయం, ఉపవాసం ప్రాముఖ్యత!

మహాశివరాత్రి విశిష్టత పిడిఎఫ్ బుక్ ఉచిత డౌన్లోడ్.

Tags: మహాశివరాత్రి, Maha Shivratri, MahaShivaratri Story, Maha Shivaratri 2024 Date, Maha Sivaratri Story Telugu, Maha Shivaratri Rules Telugu, Maha Shivaratri Niyamalu, Shiva Pooja, Siva Stotras

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS