Karkataka Rasi 2025-2026 కర్కాటక రాశి ఫలితాలు
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
“హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కర్కాటకరాశికి చెందినవారు.
ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3
కర్కాటకరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండును. ధన వ్యయము అపరిమితముగా నుండును. మనోవ్యధ,మనఃశ్చాంచల్యము కలుగును. అన్నికార్యముల యందు మిశ్రమ ఫలితములు కానవచ్చను. వివాహాది శుభకార్యములయందు పురోగతి లభించును. కాని అపరిమిత ధన వ్యయమగును. భూగృహనిర్మాణాది కార్యములు అధిక ధన వ్యయము జరిపిన మీదట | పూర్తి అగును. నూతన ప్రయత్నములు ఫలించును. అనారోగ్య సమస్యలు తరచుగా కలుగును. విదేశీ ప్రయత్నములకు అనుకూల కాలము. నూతన ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృత మగును. మంత్రసిద్ధి, స్త్రీ దేవతారాధనాసక్తి కలుగును. నూతన వ్యాపారములు ఫలించును.
సంవత్సరం ప్రారంభమున విశేష ధనవృద్ధి, కీర్తిలాభము రాజయోగము ఉద్యోగ లాభము, | నూతన పదవీయోగము. వ్యవసాయలాభము, అఖండమైన ధనలాభము నూతన సువర్ణ, రజిత, వస్త, వాహన లాభములు కలుగును. శతృవులు నాశనమగుటచే అధిక సంతోషము. చేయు కార్యము అన్నింటి యందు విజయము ప్రాప్తించుటచే మనస్సంతోషము కలుగును. బంధు పూజ్యత, భోజనప్రాప్తి, నూతన శయ్యాది సౌఖ్యము కలుగును. గురు దేవతాదర్శనము మంత్రసిద్ధి లభించును. పుత్రవృద్ధి తప్పక కలుగును. నూతన క్షేత్రలాభము, పశువృద్ధి వ్యవసాయవృద్ధి తప్పక కలుగును.
సంవత్సర మధ్యమున కొంత మనోవ్యధ కలుగును. అనాలోచిత నిర్ణయములతో బంధుమిత్రాదులయందు అవమానములు కలుగును. పదవీ త్యాగము కలుగును. ఇచ్చినమాట నిలబెట్టు కొనుటకు ధనవ్యయము చేయలవలసివచ్చును. స్థాన చలనము వ్యవసాయ, వ్యాపారనష్టము కలుగును. మాట పట్టింపులు కలుగును. ఆరోగ్యము మందగించెను. సరిఅయిన నిర్ణయము లేకుండుటచే గోటితో పోయేదానిని గోడ్డలిదాకా తెచ్చుకొందురు. భార్య/భర్త/సంతానమూలక సమస్యలు ఎక్కువగును. ధార్మికత తగ్గును. తక్కువ వారి వలన మాటలు పడుదురు. ప్రభుత్వ అధికారులతో మాటపట్టింపులు వచ్చును. స్థిరచరాస్తులు అమ్మవలసి వచ్చును. పశునష్టము కలుగును. ఆర్థిక మోసములకు గురి అగుదురు.
సంవత్సరాంతమున ఆరోగ్యపీడచే వైద్యాశాలా దర్శనము ఔషధసేవనము తప్పనిసరి అగును. మనోవ్యధ, బుద్ధిభ్రంశము, నమ్మిన వారి వలన మోసములు, తరచుగా విలువైన వస్తువులు పొగొట్టు కొనుట వృధా సంచారముచేయుట కలుగును. ప్రయాణ విఘ్నములు వాహన ప్రమాదములు కలుగును. పశుక్షేత్ర నష్టము కలుగును. రూపాయికి 10రూపాయలు ఖర్చుచేసిన మీదటగాని పనులు పూర్తికావు. ఇంటిలోని విలువైన వస్తువులు తరచు రిపేర్లకు గురి అగును. అనవసర ధనవ్యయము జరుగుటచే విసుగు కలుగును. మధ్య మధ్య కొంత దేహ సౌఖ్యము కలుగును. సోదర, సోదరీల విషయములో కొంత వ్యతిరేకత కలుగును. మంత్ర సిద్ధి కలుగును. మానసికముగా బలముగా నున్ననూ శారీరక సౌఖ్యము లేకుండుటచే సమస్యలు కలుగును. బుద్ధి చాంశ్చల్యము మనోవికారము కలుగును.
విద్యార్థులకు అనుకూల కాలము కాదు. పరిశ్రమకు తగిన గుర్తింపు లభించదు. వివిధ కోర్సుల కొరకు ధనవ్యయము చేయదురు. కాని ఫలితము లేకుండును. నిరుద్యోగులకు నిరాశ ఎదురగును. ఉద్యోగ ప్రయత్నములు నిలిచి పోవును. ఆర్ధిక మోసములకు గురి అగుదురు. దొడ్డిదారి కార్యములు ఫలించవు సరికదా సమస్యలు ఎదురగును. ఉద్యోగులకు కష్టకాలము. చేయని తప్పులకు మూల్యము చెల్లించక తప్పదు. అపవాదులు ఎదుర్కొనవలసి వచ్చును. పైఅధికారులు తో మాట పట్టింపులు కలుగును. సస్పెన్షన్లు బదిలీలతో మానసిక ఆందోళనకు గురికాగలరు. వ్యాపారులకు అనుకూలకాలము కాదు. వ్యాపార నష్టములు మనస్సును కలచివేయును. నూతన ప్రయత్నములు ఫలించవు. స్థానచలనము చేయవలసి వచ్చును. కార్మికులకు శ్రమకాలము, పనికితగిన గుర్తింపులేక సతమత మగుదురు. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టును. చేతినిండా పనిలేకుండును కుటుంబ పోషణకు అప్పులు చేయవలసి వచ్చును. వ్యవసాయదారులకు వ్యతిరేక ఫలితము వచ్చును చీడపీడల బాధ ఎక్కువగును. ఋణ బాధలు పెరుగును. కృషి ఫలించక సమస్యలు పాలగుదురు. క్షేత్ర నష్టము, పశునష్టము కలుగును. గిట్టుబాటు ధరలు లేక ప్రకృతి వైపరీత్యములతో విశేషముగా నష్టపోవుదురు. ఆక్వాకల్చర్ వారికి శ్రమకు తగిన ఫలితము లభించదు. నష్టము కలుగును. ఆర్ధిక మోసములకు గురి అయ్యెదరు నమ్మిన వారి వలన మోసము ఎదురగును. కవులు, కళాకారులు గౌరవ మర్యాదలు తగ్గును. ఆర్ధిక వ్యవహారములు మందగించును. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టును తగినప్రోత్సాహములేక సతమతమగుదురు. సినిమారంగము పూర్తిగా నష్టముల బాట పట్టును. ఆర్ధిక లావాదేవీలు మందగించును. ఆర్థిక మోసములతో నష్టములు పాలగుదురు. ఆఫర్లు రాక ఋణములతో నెట్టుకొచ్చెదరు. రాజకీయ నాయకులకు సమస్యల కాలము. ఆర్ధికముగా నష్టపోవుదురు. సంఘపరమైన గుర్తింపు తగ్గును అపఖ్యాతి మూటగట్టుకొందురు. ప్రజా ప్రభుత్వ వ్యతిరేకతతో పదవీ భంగముకలుగును. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుదురు.
NRI లకు పుర్తి వ్యతిరేక కాలము. ప్రయాణములు మద్యలో ఆగిపోవును. చివరి నిమిషములలో ప్రయాణములు రద్దు అయ్యి వెనుకకు వచ్చే అవకాశం కలదు. స్పెక్యులేషన్ లాభించదు.
గ్రహశాంతి : ఈ సంవత్సరమంతయూ గురు, శని, రాహు, కేతు,కుజ గ్రహశాంతులు ఆచరించవలయును. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
అదృష్ట సంఖ్య : ‘2' 1,4,7 మిత్ర సంఖ్యలు ఆది, సోమవారములు కలిసిన శుభం
అదృష్ట రత్నం : పునర్వసు-పుష్యరాగం, పుష్యమి-నీలం, ఆశ్లేష-పచ్చ ధరించవలెను
రుద్రాక్ష ధారణం : ద్విముఖి, ఏకాదశముఖి, గర్భగౌరీ ధరించవలెను.
మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.
శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..
- మేషరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు