కన్యా రాశి వారి శ్రీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Kanya Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Kanya Rasi 2025-2026 కన్యా రాశి ఫలితాలు

కన్య రాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

“టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కన్యారాశికి చెందినవారు.

ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6

కన్యారాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు నామ సంవత్సర మంతయూ శుభాశుభా మిశ్రమ ఫలితములతో నుండును. ఆర్ధిక విషయములు మందకొడిగా సాగును. దుర్య్వయము పెరుగును. శతృ కలహములు మెండుగా నుండును. సర్వత్ర వ్యతిరేక ధోరణి వ్యక్తమగును. ఆరోగ్య లోపములుండును. బంధు మిత్ర కలహములుతో సమస్యలు పెరుగును. భార్య/భర్త/సంతానముల కలహములతో మనశాంతి కోల్పోవుదురు కోర్టుల వరకు వెళ్ళును. వివాహాది శుభాకార్యములు అతికష్టము మీద నెరవేరును. భూగృహ నిర్మాణాది కార్యములు మధ్యలో ఆటంకములతో ఆగిపోయి ఆర్థిక మోసములకు గురి అగుదురు. సాంకేతిక సమస్యలతో వివిధ కార్యక్రమమలు వాయిదా పడును. ప్రయాణ ఆటంకము కలుగును. దొంగల భయము. విలువైన వస్తు సామాగ్రి కోల్పోవుట జరుగును.

సంవత్సర ప్రారంభమున అన్నింటా జయము కలుగును. అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభము కలుగును. బంధుమిత్ర సమాగమముచే స్నేహలాభము కలుగును. కీర్తి, సన్మాన సత్కారములు గుర్తింపు రాజకీయ పదవీ యోగము కలుగును. మృష్టాన్న భోజనప్రాప్తి గృహ లాభము తప్పక కలుగును. ప్రయాణముల యందు అనుకూలత నూతన వస్త్ర, వాహన ప్రాప్తి, విదేశీ ప్రయాణ లాభము కలుగును. భార్య/భర్త/సంతానము అభిప్రాయ బేధములు సమసి పోవును. విజయము వరించును. వృత్తి వ్యాపార, ఉద్యోగ లాభము సంతాన వృద్ధి క్షేమము,సౌఖ్యము కలుగును. ఆరోగ్యము సహకరించును. క్షేత్రవృద్ధి, పశువృద్ధి కలుగును.

సంవత్సర మధ్యమంబున కొంత వ్యతిరేకత వ్యక్తమగును. అనారోగ్య లోపములు కలుగును. ఇంటా బయట సమస్యలు కలుగును. భార్య/భర్త/సంతానముల మధ్య అనుమాన ములు, అపవాదులు పొడచూపును. అకారణ కలహములతో మనో వైకల్యము కలుగును. మిత్రులు శతృవులవలె బాధించెదరు. వృధా సంచారము చేయుదురు. ఇంటి నుండి వెడలిపో వుట వంటి సమస్యలు కలుగును. ప్రయాణములలో ఇబ్బందులు తలెత్తును. చేయు వృత్తి వ్యాపార, వ్యవసాయ ఉద్యోగముల యందు వ్యతిరేకత వ్యక్తమగును. చేయుపనిలేక ఇంటియందు ఉండవలసి వచ్చును. పోలీసు, కోర్టుకేసుల యందు వ్యతిరేకత వ్యక్తమగును.

సంవత్సరాంతమున కొంత ఊరట లభించును. ఆర్ధిక వ్యవహారములు చక్కబడును. శరీరమునకు బలము కలుగును. మనస్సు కుదుట పడును. మిత్రులు సహకరించెదరు శతృవుల మిన్నకుండెదరు. ఆర్ధికముగా బలము కలిగి ముందుకు సాగుదురు. పోలీసు కోర్టు కేసులయందు నిలబాటు కలుగును. ఆగిపోయిన కొన్ని కార్యములు పూర్తి చేయుదురు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగము యందు కొంత ఊరట కలుగును. మానసిక తృప్తి కలుగును. భార్య/భర్త సంతాన సమస్యలు కొలిక్కివచ్చును. భూగృహనిర్మాణాది కార్యములు కష్టము మీద కొనసాగును. శుభకార్య నిర్వహణ అతి కష్టము మీద పూర్తి చేయుదురు. బుద్ధి పరాక్రమము కలుగును. దొంగల, జంతు భయము కలుగును. చేతుల, వ్రేళ్ళు కాళ్ళయందు సమస్యలు కలుగును. ఔషధ సేవనముతో సమస్యలు చక్కబడును.

విద్యార్దులకు సామన్యకాలము అత్తెసరు మార్కులతో విజయము సాదించెదరు. విద్యాభివృద్ధి అంతంతమాత్రముగా నుండును. ర్యాంకులు పోగొట్టుకొందురు. స్వల్ప మార్కుల తేడాతో అపజయము నుండి గట్టెక్కుదురు. నిరుద్యోగులకు గడ్డుకాలము చేసిన ప్రయత్నములు ఫలించక సమస్యలు కలుగును. దొడ్డిదారి ప్రయత్నములు బెడిసి కొట్టును. ఆర్ధికమోసములు గురి అగుదురు. మరికొంతకాలము శ్రమచేయక తప్పదు. ఉద్యోగులకు మిశ్రమకాలము చేయు వృత్తి, ఉద్యోగాలయందు అధికారుల వలన సమస్యలు కలుగును. మర్యాద పొగొట్టు కొందురు. అవమానములు ఎదుర్కొనక తప్పదు కష్టమునకు తగిన ప్రతిఫలము లభించదు. అవాంఛనీయ బదిలీలు కలుగును. ప్రమోషన్లు నిలిచి పోవును. వ్యాపారులకు వ్యతిరేక కాలము నూతన ప్రయత్నములు అనుకూలించవు. వ్యాపారములు మూసివేయక తప్పదు. నష్టములబాట పట్టుదురు. ఉద్యోగులతో వ్యతిరేకత వ్యక్తమగును. కార్మికులకు అత్యంత కష్టకాలము చేసిన పనికి గుర్తింపు లభించదు. అగౌరవము కలుగును. వృధాప్రయాస కలుగును. ఆర్ధిక బాధలు పెరుగును. వ్యవసాయదారులకు వ్యతిరేక ఫలితములు కలుగును.

ఆర్ధికముగా నష్టముల బాట పట్టెదరు. చీడపీడల బాధలతో వ్యవసాయము కష్టమగును ఆక్వాకల్చర్ వారికి అత్యంత ధన నష్టముకలుగును. నమ్మిన వారి వలన మోసము కలుగును. కవులు, కళాకారులు వ్యతిరేక కాలము, సంఘగౌరవం తగ్గును, అపవాదులను ఎదుర్కొందురు అవమానము ఎదుర్కోనక తప్పదు. చేసిన పనికి తగిన ప్రతి ఫలము లభించదు. అభివృద్ధి లేదు. సినిమారంగము వారు అత్యంత జాగరూకతతో నుండవలెను. అభివృద్ధి శూన్యము. ఆర్థిక వనరులు క్షీణించును. చేసిన పనులు కలసిరావు. చేయు ప్రయత్నములు ఫలించక నిరాశకు గురి అయ్యెదరు. ఆర్ధికముగా అత్యంత దీనస్థితికి వెళ్ళిపోవుదురు. రాజకీయ నాయకులకు పదవీ గండము లుండును ప్రజా, ప్రభుత్వ గుర్తింపు కోల్పోవుదురు. మనుగడ కష్టమగును. కొర్టు, పోలీసు కేసులతో సతమతమగుదురు. కష్టమునకు తగిన గుర్తింపు లభించక సమస్యలకు లోనగుదురు. NRI లకు పూర్తి వ్యతిరేక కాలము ఉద్యోగములు పొగొట్టుకొని స్వదేశమునకు రాక తప్పదు. స్పెక్యులేషన్ లాభించదు.

గ్రహశాంతి : ఈ సంవత్సరం రవి, కుజ, గురు, శని, రాహు, కేతు శాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి పరిశీలించండి.

అదృష్ట సంఖ్య : '5' 1,4, 6 మిత్ర సంఖ్యలు. 14,23 తేదీలు ఆది, బుధ, శుక్రవారములు

అదృష్ట రత్నం : ఉత్తర-కెంపు, హస్త-ముత్యం, చిత్త-పగడం ధరించవలెను

రుద్రాక్ష ధారణం : చతుర్ముఖి, త్రయోదశముఖి, నవదశముఖి ధరించిన శుభం

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS