ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ జన్మరాశియందు వృషభమున రజితమూర్తి అనంతరం అక్టోబరు 18 వరకూ ద్వితీయమున మిధునరాశియందు తామ్రమూర్తి అనంతరం డిశంబరు 5 వరకూ తృతీయమున కర్కాటక రాశియందు లోహమూర్తి, అనంతరం సంవత్సరాంతం వరకూ ద్వితీయమున మిధునరాశియందు సువర్ణమూర్తిగా సంచరించును.
శని ఈ సంవత్సరం అంతయూ లాభస్థానమున మీనరాశియందు సువర్ణమూర్తిగా సంచరించును. రాహు, కేతువులు సంవత్సరాది నుండి మే 18 వరకూ రాహువు లాభస్థానమున మీనరాశియందు కేతువు పంచమ స్థానమున కన్యారాశియందు సువర్ణమూర్తులగాను తదాది సంవత్సరాంతం వరకూ రాహువు దశముమందు కుంభరాశియందు కేతువు అర్ధాష్టమ స్థానమున సింహరాశియందు రజిత మూర్తులుగా సంచరించును.
2025 వృషభ రాశి ఫలితములు
కృత్తిక 2,3,4పా,
రోహిణి 1,2,3,4పా,
మృగశిర 1,2 పా
ఆదాయం 11, వ్యయం 5;
రాజ్యపూజ్యం 1, అవమానం 3
వృషభ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా గతముకంటే అన్ని విధాలా బాగుంటుంది. మనస్సున ఆనందము. కుటుంబ వ్యవహారాదులు యందు మంచి నేర్పుగా వ్యవహరించును. ప్రతీ పనీ వెంటనే పూర్తి అగుట ధనలాభము. గౌరవము. బంధుమిత్రాదులతో స్నేహబాంధవ్యములు పెరుగుట ఉత్సాహం, చేయు వృత్తి, వ్యవహారములయందు లాభములు. మంచి ఆరోగ్యము. దైవకార్యములు, ఉన్నతాధికారుల వలన మంచి ప్రోత్సాహం.
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకొన్నచోటికి బదిలీలు గుర్తింపు. శుభకార్యాలు నిమిత్తమై చేయు ప్రయత్నములు సిద్ధించుట, మంచి వాక్పటిత. ఎటువంటి వారినైనా సరైన ముందుచూపుతో మంచి మాటలతో వశం చేసుకొంటారు. బంధువులతో మంచి సంబంధాలు, ఇంటియందు వాస్తు మార్పులు, నూతన గృహప్రయత్నాలు కలిసి వచ్చును. స్థిరాస్తి వృద్ధి. వాహన లాభము. మంచి విలువైన భూములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. విదేశములకు వెళ్ళుట,
రాజకీయ నాయకులకు పదవులు వర్తిస్తాయి. పూర్వము నుంచి తొలగని కోర్టు సమస్యలు తొలుగుట. సంఘమున నాయకత్వము, ఆరోగ్యము బాగుంటుంది. మీ ధైర్యమే మీకు అండ, పుణ్యనదీ స్నానములు, తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయుట.
విద్యార్థులకు మంచి కాలము. పట్టుదల ఏమైనా సాధించాలి అని ఉంటే అది ఏమైనా సాధించగలరు. సమయం మీదే వృధా చేయకండి. గ్రూప్స్ లేక ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసినా విజయం వరిస్తుంది. మెడిసిన్, లా, ఇంజనీరింగ్, ఇతర దేశములలో చదువులు అన్ని కలిసి వచ్చును. స్నేహితులతో కలహములు మంచిది కాదు. గుర్తింపు పొందుదురు. విద్యార్థినులు మంచి స్థానం సంపాదించగలరు.
భార్య మూలన ఆస్తులు కలిసి వచ్చుట. విదేశాలలో ఉన్నవారు ఆర్థికంగా వృద్ధి, స్థిరాస్తులు వృద్ధి, అధికారులకు రాజకీయ నాయకులు యొక్క అండ దండలూ కలుగును. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగును.
వివాహం కాని వారికి ఈ సం॥రం వివాహ యోగం. రాజకీయ నాయకులకు ఉన్నత పదవీయోగం. సంఘమున గౌరవం. మధ్యమధ్యలో చిన్న అవాంతరములు ఉన్ననూ చివరికి జయం మీదే. అన్నదమ్ముల మధ్య ద్వేషములు, పట్టింపులు, కష్టములు, నిరుద్యోగులకు ఉద్యోగము పర్మినెంటు కాని వారిని పర్మినెంటు అవుట. ప్రయివేటుగా ఉద్యోగము చేయువారికి మంచి చేయూత. ఉద్యోగము వచ్చుట, వైద్య, సినిమా, విద్యాసంస్థలు.
అన్ని రకములు వ్యాపారస్తులకు మంచికాలము. ఆదాయం పెరుగును. కానీ పోటీ అధికము. కిరాణా, ఫ్యాన్సీ, కలప, బొగ్గు, సిమెంటు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు అత్యధిక లాభములు, కాంట్రాక్టుదారులకు బిల్లులు సమయానికి కాక పెట్టుబడులు, అధికము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట మంచిలాభము, వెండి, బంగారం, ధాన్యం, రైస్ మిల్లర్స్, కొబ్బరి, నిల్వ చేయు వ్యాపారులు, చెరువులు, పౌల్ట్రీ, వస్త్రము, రియల్ ఎస్టేట్స్, గృహ నిర్మాణదారులు వంటి వారికి మంచి గుర్తింపు. మంచి ధనాదాయం. స్థిరాస్తులు, యంత్ర పరిశ్రమ, మందులు తయారీ వ్యాపారస్తులకు, తలచిన పనులు వెంటనే పూర్తికాక చిన్న చిన్న ఇబ్బందులు. ఆరోగ్యమునందు జాగ్రత్త అవసరము,
స్త్రీలకు ఈ సం||రం యోగదాయకం. విద్యార్థినులకు త్వరితముగా ఉద్యోగము గుర్తింపు, ఉద్యోగములో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ అనుకొన్న చోటికి బదిలీలు, మీపై అధికారులు వలన మంచి గుర్తింపు. వివాహం కాని వారికి మంచి సంబంధించిన వారితో వివాహము, చికాకులు, రాజకీయముగా ఉన్నవారికి కేంద్ర, రాష్ట్ర స్థాయి గుర్తింపు. సంతానంలేని వారికి సంతానయోగం. కుటుంబమున మీకు మంచి గుర్తింపు. మీ సలహాలు ఇంట, బయట నమ్మకం, మంచికాలము.
keywords : 2025 vrushabharashi phalitalu , 2025 rashi phalalu, 2025 panchangam,