తులారాశి రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ అష్టమమున వృషభ రాశియందు లోహమూర్తిగాను, అనంతరం అక్టోబరు 18 వరకు భాగ్యమున మిధునరాశియందు రజితమూర్తిగాను, అనంతరం డిశంబరు 5 వరకూ దశమమందు కర్కాటకరాశియందు సువర్ణమూర్తి గాను అనంతరం సంవత్సరాంతం వరకు నవమ మందు మీనరాశియందు లోహమూర్తిగా సంచరించును. శని ఈ సం|| అంతయు షష్ఠమున మీనరాశియందు సువర్ణమూర్తిగా సంచరించును. రాహుకేతువులు మే 18 వరకూ రాహువు షష్టమమున మీనరాశియందు కేతువు. ద్వాదశమందు కన్యారాశిలో లోహమూర్తులుగాను అనంతరం సంవత్సరాంతం వరకూ రాహువు పంచమమున కుంభరాశియందు కేతువు లాభమయి సింహరాశి యందు లోహమూర్తులుగా సంచరించును.
2025 తులారాశి ఫలితములు
చిత్త 3, 4 పా.
స్వాతి 1, 2, 3, 4 పా.
విశాఖ 1, 2, 3 పా.1
ఆదాయం 11, వ్యయం - 5,
రాజ్యపూజ్యం - 2, అవమానం -2
ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా మొదటి 3 మాసములు వరకూ మనస్సు విచారము. ఏ పని జరుగుకుండుట. ఆర్థిక సమస్యలు. ఆరోగ్య సమస్యలు, తొందరపాటు పనులు మాటలు. చికాకు, తెగింపు, ఎవరి నీ లెక్క చేయకుండుట. ఆందోళన, భయం, దొంగల భయం, వ్యాపారం నందు అవకతవకలు. తేజస్సు తగ్గుట. మాటలయందు గాంభీర్యము లేకపోవుట, క్రూరమైన మాటలు పలుకుట, భార్యాబిడ్డలతో కలహములు. ఏ పనియందు మనస్సు లేకుండుట,
మిగిలిన మాసములు యందు కొద్దికొద్దిగా సమస్యలు తీరుట, దైవమును నమ్మి మంచి ఫలితాలు వచ్చుట. తలచిన ప్రతీ పని ఆలస్యమైనా నెరవేరుట. ఆరోగ్యం కుదుట పడుట. నూతన పనులకు శ్రీకారము మిత్రులు. బంధువులు యొక్క సహాయ సహకారములు అందుట. అత్యధిక శ్రమపడుట వలన మంచి ఫలములు. కీర్తి వృద్ధి, మంచి ఆరోగ్యము ప్రతీ పనియందు కష్టముతో అభివృద్ధి, జయము. భార్యా బిడ్డలతో మంచిగా పుణ్యకర యాత్ర దర్శనములు, గృహమున 2 సంవత్సరముల నుండి అవ్వని శుభకార్యాలు పూర్తి అగుట. కోర్టు, పోలీస్ తీర్థ వ్యవహారములు కలిసి వచ్చుట ఆనందము.
నమ్మినవారే మోసం చేసిన విషయం బయట పడుట. వారిని దూరం చేయడం వలన మేలు. ధన ధాన్యాలు వృద్ధి అగుట. మీ భార్య వలన మంచి సలహాలు. సంతోషకరమైన వాతావరణం ఆమె పేరుతో చేసిన పనులు త్వరితముగా పూర్తి అగుట, గృహ నిర్మాణము చేయుట లేక ఆస్తులు, ఆభరణము కొనుట. వివాహం కాని వారిని వివాహం జరుగును. మీ మాటకు ఎదురు లేకుండుట కానీ ప్రతీ విషయాన్ని గుట్టు చెప్పకుండుట మంచిది. అధిక మాటలు మంచిదికాదు. స్నేహితులకి తగిన గౌరవాదులు మంచిది. రాజకీయమునందు ఆసక్తి పెరుగుట, నాయకత్వ లక్షణములు వలన ప్రభుత్వం గుర్తించి ఉన్నత స్థానం కల్పించుట, ఉద్యోగస్తులకు మంచి అనుకూలము.
గృహమునందు శుభకార్యాలు, అనుకొన్నచోటికి బదిలీలు, అన్ని చోట్ల మంచి ఆదరణ. ఆప్టింగ్ ఉద్యోగస్తులకు స్థిరత్వము. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు మెండు. ఆర్మీ, పోలీస్, టీచర్స్ ఉద్యోగస్తులకు ఉన్నతమైన అధికారములు, సన్మానాదులు, విద్యార్థులకు మంచి గుర్తింపుకాలము. ఉన్నత చదువులకు అవకాశములు. టి.వి., సినిమా, ఆటోగ్రఫీ, ఫైనాన్షియర్, గాయనీ గాయకులకు ఈ సం॥రం అనుకూలము. ఆరోగ్యమునందు జాగ్రత్త అవసరం. మంచి వ్యక్తులతో పరిచయాలు. వారిచేయూత. అన్ని రకములు వ్యాపారాలు వ్యవహారములయందు వర్గములు చీలుచుండుట. క్రింద పనిచేయువారితో యిబ్బందులు, వ్యాపారము లాభములచే సాగిననూ, ఏదో తెలియని ఆందోళన, చికాకులు. ఫైనాన్స్, బొగ్గు గనులు, గ్రానైట్ వ్యాపారస్తులకు మంచి అనుకూలము.
స్త్రీలకు : ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభకాలము. సంఘమున గౌరవ ప్రతిష్టలు, మంచి అనుకూలమైన సంబంధములు కుదిరి వివాహం జరుగును. ఉద్యోగములో యున్నవారిని పై అధికారుల మన్నన పొందుదురు. సంఘసేవకలకు మంచి ప్రోత్సాహకాలము, భర్త యొక్క పూర్తి సహాయ సహకారములు అందును.
keywords : 2025 tulasi phalitalu, hindu temples guide, temples guide,hindu temples guide, 2025 panchangam, 2025 horoscope,