2025 సింహరాశి ఫలితములు Leo Simharashi Phalitalu

సింహరాశి  స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ రాజ్యమందు వృషభరాశియందు సువర్ణమూర్తి గాను అనంతరం అక్టోబరు 10 వరకూ లాభస్థానమున మిధునరాశియందు లోహమూర్తిగాను అనంతరం డిశంబరు 5 వరకు ద్వాదశ స్థానమున కర్కాటక రాశియందు సువర్ణమూర్తిగాను అనంతరం లాభస్థానమున మిదునరాశియందు సంవత్సరాంతం వరకూ తామ్రమూర్తిగా సంచరించును. 

శని ఈ సంవత్సరం అంతయూ అష్టమస్థానమున మీనరాశియందు లోహమూర్తిగా సంచరించును. రాహు, కేతువులు మే 18 వరకు రాహువు అష్టమ స్థానమున మిధున రాశి యందు, కేతువు ద్వితీయస్థానం కన్యారాశియందు తామ్రమూర్తులుగాను అనంతరం సంవత్సరాంతం వరకూ సప్తమస్థానమున కుంభరాశియందు రాహువు జన్మస్థానమున సింహరాశియందు కేతువు సువర్ణ మూర్తులుగా సంచరించును.

2025 సింహరాశి ఫలితములు


2025 సింహరాశి ఫలితములు 

మఖ 1,2,3,4పా, 

పుబ్బ 1,2,3,4పా. 

ఉత్తర1పా.

ఆదాయం - 11, వ్యయం - 11

రాజ్యపూజ్యం: 3, అవమానం - 6.


సింహరాశి రాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం శుభాశుభమిశ్రమ ఫలము. గురుడు, శని, రాహువు, శుభకారకులు కాదు. ఏ పని అయిననూ ఒకటికి పదిసార్లు తిరిగితే కానీ పని జరగదు. ఒకరి మీద పని అప్పచెప్పి కూర్చుంటే మాత్రం. పనిజరగదు. ఈ సంవత్సరం నూతన భారీ వ్యాపార, వ్యవహారములకు శ్రీకారము చేయుట మంచిదికాదు. 

గృహనిర్మాణములు మందకొడిగా సాగును. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగితే తప్ప. పని జరగడం కష్టసాధ్యము. ప్రతీ విషయాన కోపము, చిరాకు, మంచిదికాదు, ఇంట్లో ఉన్నవారితో ప్రతీ పని చెప్పి వారి ఆలోచన మేరకు సాగుట మంచిది, ప్రతివిషయాన్ని బంధువర్గంతో చెప్పుట మంచిదికాదు. బంధువుల రీత్యా ఏదో ఒక ఇబ్బంది. తరచూ కలహములు చాపక్రింద నీరు వలె శత్రు శేషము పెరుగును. స్త్రీ మూలక ఇబ్బందులు, అనవసరపు ఆలోచనలు సొంత యింట్లో వారితో యిబ్బందులు. కలహములు బయట వారి యందు గౌరవము. 

మీకు నరదృష్టి అధికము అనారోగ్యములు, ఏదో తెలియని భయం. తలచిన ప్రతీ పని అపజయము. ధనవ్యయం, వాహన ప్రమాదులు, శరీరమున నొప్పులు అగౌరవము. జ్ఞాపకశక్తి మందగింపు. రాత్రియందు నిద్రలేమి. ఎంత కష్టపడినా ఫలితం లేకపోగా అపనిందలు. అవమానములు, ఊహించని ఫలితములు ఎదురగుట, వ్యాపారములు యందు పెటుటబడులు అధికము. గృహ వాస్తు మార్పులు, అపకీర్తి, చేయు వృత్తి వ్యాపారములు యందు నష్టములు దుఃఖ పూరితమైన మాటలు తినుట. కోర్టు తగాదాలు, మిత్రులే శత్రువులుగా మారుట. 

వివాహాది శుభకార్యాలు కలసిరాకుండుట. ఏ వృత్తి, వ్యాపార, వ్యవసాయ, వ్యవహారములు అయినా అభివృద్ధి లేకపోవుట. గృహనిర్మాణాలు ఆగిపోవుట. బంధుమిత్రులు తల్లితో విరోధములు. కారణము లేకుండా విరోధాలు. పెద్దస్థాయిలో వ్యాపారాలు చేయువారిని సి.బి.ఐ. మరియు సాటి వ్యాపారులతో ఇబ్బందులు. అనవసరపు ప్రయాణాలు, తరచూ విసుగు చెందుట, అలసట అనవసరపు విషయాలయందు తలదూర్చి నిందవేసుకొనుట, ఇబ్బంది పడుట. దొంగల భయం, జాయింటు వ్యాపారస్తులు మోసగించబడుట. కోర్టు వ్యవహారములు, రాజకీయనాయకులకు గడ్డుకాలము. ఉన్న పదవులతో ఇబ్బందులు అలంకరణ ప్రాయమైన పదవులు, ఖర్చు అధికము. ఆర్థిక ఒడిదుడుకులు. పాత ఋణములు తీరక నూతనముగా ఋణములు చేయుట, 

ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేకపోవుట, ఉన్నత చదువులకు మార్గములు మూతబడుట. కిరాణా, మెడిసిన్, పాలడయిరీ వారికి ఆర్థిక నష్టాలు, షేర్ మార్కెటింగ్, బంగారం, వెండి వ్యానారస్తులు అధిక పెట్టుబడులు పెట్టి చాలా ఇబ్బంది పడుట. క్రీడారంగం. సినిమా రంగంవారిని నమ్మిన వారే మోసముచే యుట, భారీగా ధన నష్టము. అన్ని రకాల వ్యాపారస్తులకు టర్నోవర్స్ స్తంభించుట. భార్య, భర్త, బిడ్డలతో అనారోగ్య సమస్యలు. ఉదర, నడుము, నరములు బలహీనత, మానసిక ఆందోళన, ముఖ్యముగా ఈ రాశివారు మీ జీవిత చక్రము ప్రకారము దశాంతర్దశ బలముగా యుంటే ఇక్కడ వ్రాసిన రాశి ఫలములు పెద్దగా బాధించవు. లేనిచో జాతక చక్రమునందు బాగుండకపోతే తగిన పరిహారములు చేయుట వలన దోష సాంద్రత తగ్గును. వ్యవసాయదారులను ఒక పంట మాత్రమే పనిచేయును. 

విద్యార్థులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. లాంగ్స్టన్ విద్యలు మంచిది. 

స్త్రీలకు అంతంత మాత్రమే, అపనిందలు. మీ తెలివితేటలే మీకు ఇబ్బంది. కావున ప్రతీ విషయాన సలహామేరకు కానీ మౌనం వహించుట మేలు. భార్యభర్తల మధ్య చిన్నపాటి విషయాలు పెద్దవిగా ఉంటాయి. వివాహం కానివారు ఈ సంవత్సరం ఆగుట శుభప్రదము.

keywords : Simharashi Phalitalu, Simharashi 2025 rashi phalalu, 2025 panchangam, 2025 horoscope

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS