ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ ద్వాదశ మందు వృషభరాశియందు లోహమూర్తి అనంతరం అక్టోబరు 18 వరకూ జన్మరాశి మిధునమందు సువర్ణమూర్తి అనంతరం డిశంబరు 5 వరకూ ద్వితీయమున కర్కాటకరాశియందు తామ్రమూర్తి అనంతరం సంవత్సరాంతం వరకూ జన్మరాశి మిధునరాశియందు లోహమూర్తిగా సంచరించును. శని సంవత్సరం అంతయూ దశమమున మీనరాశియందు తామ్రమూర్తిగా సంచరించును. రాహు, కేతువులు సంవత్సరాది నుండి మే 18 వరకూ రాహువు దశమమందు మీనరాశియందు కేతువు అర్ధాష్టమమున కన్యారాశియందు లోహమూర్తులుగాను అనంతరం సంవత్సరాంతం వరకూ భాగ్యమున కుంభరాశియందు రాహువు, తృతీయమున సింహరాశియందు కేతువు లోహమూర్తులుగా సంచరించును.
2025 మిధునరాశి ఫలితములు
మృగశిర 3, 4 పా,
ఆర్ద్ర 1, 2, 3, 4 పా.,
పునర్వసు 1, 2, 3 పా
ఆదాయం - 14, వ్యయం - 2;
రాజ్యపూజ్యం - 4, అవమానం - 3.
మిధున రాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం మంచికాలము కాదు. నిరాశవద్దు. ఏదో విధముగా ఖర్చు అధికము. ఋణములు చేసి మరీ ఖర్చు చేయుదురు. శుభకార్యాలు నిమిత్తం కూడా అనుకొన్నదానికంటే రెట్టింపు ఖర్చు అగుట. ఇతరులను నమ్మి మోసపోవుట. స్థానచలనము, ధనము నిల్వకుండుట, రావలసినవి రాకుండుట. ఇవ్వవలచినవి ఇవ్వకుండుట వలన మాటలు పడుట. పై అధికారులు లేక మన పైవారు లేక మన పెద్దవారితో మాటలు పడుట. కీర్తి ప్రతిష్టలు భంగపాటు. ఉద్యోగము లేక వ్యవహారములు యందు సాటివారితో విరోధములు. జ్ఞాపకశక్తి మందగించుట. బుద్ధి పనిచేయకుండుట.
సమయానికి తగిన సలహా లేక ఇబ్బందులు ప్రతీ పనియందు బద్ధకము ధన హాని, భయము ఏదో జరుగుతుంది అనే భయము ఎవరిని నమ్మలేకపోవుట. మిత్రులే శ్రతువులుగా మారుట. గృహమునందు ప్రతీ విషయాన కలహాలు. భార్య బిడ్డలతో ఇబ్బందులు. తరచూ అనారోగ్య సమస్యలు. పిల్లలకు ఉద్యోగము లేక వివాహములు జరగకుండుట. మానసిక ఒత్తిడి, మత్తు పానీయాలు లేక చెడు వ్యసనాల యందు మనస్సు మారుట. ఏ పని చేయకుండుట, చేయు ఉద్యోగము ఊడిపోవుట. చేయువృత్తి. వ్యాపారములు యందు విఘాతము ఏర్పడుట. మనస్సు నిలకడగా ఉండకపోవుట. వాత రోగములు, నొప్పులు, విచారము, బి.పి., షుగర్ ఇబ్బంది. శస్త్ర చికిత్సలు. ప్రయాణమందు విఘ్నములు. స్త్రీ మూలక భయము లేక అన్యస్త్రీ పరిచయం వలన ఇబ్బందులు. స్త్రీలకు అయితే స్నేహితులు లేక సాటివారితో ఇబ్బందులు. మొత్తముగా ఈ రాశివారికి జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలయందు, ఇతర ఆర్థిక విషయములు యందు చోర భయము. ధననష్టము సూచనలు అధికము.
ఉద్యోగస్తులకు అనుకోనిచోటికి బదిలీలు. గుర్తింపు తగ్గుట. ప్రభుత్వ రంగములో పనిచేయువారిని సస్సెండ్ అవుట లేక పై అధికారులతో చివాట్లు ప్రయివేటు సంస్థలలో పనిచేయువారికి జీతము సరిగా రాకుండుట లేక తరచూ మానివేయుట. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినా ఆశించినరీతిన లేకుండుట. అనారోగ్య సమస్యలు, యంత్ర పరిశ్రమ లేక ఫ్యాక్టరీలు యందు చేయువారికి చిన్న చిన్న గాయాలు రాజకీయరంగములో ఉన్నవారు ఎంత కష్టపడినా ఫలితం లేకుండుట, శతృబాధలు. మనక్రింద వారే మనకు శత్రువులుగా మారుట. ధన నష్టమును పూడ్చలేకపోవుట. పనిచేయుట లేక వ్యాపారము చేసుకొనుటకు మంచిదా అని ద్వంద్వ వైఖరిగా మారుట. అన్నిరంగాల వ్యాపారస్తులకు అధిక ధనవ్యయం.
పెట్టబడులు అధికం. ప్రతీ విషయాన ఏదో ఒక సమస్య కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు, కేసులు, పోలీసు వారితో ఇబ్బందులు. నూతన వ్యాపారాల యందు ఉత్సుకత అధికం. తరువాత ఇబ్బందులు, హోల్సేల్ వ్యాపారులకు కొంత అనుకూలము. జాయింట్స్ వ్యాపారస్తులకు అర్ధలాభం, అపనిందలు, బంగారం, వెండి, మత్తు పానీయాలు, ఇటుక బట్టీలు, చెరువులు వ్యాపారస్తులకు అంత అనుకూలము కాదు. దేవదాయశాఖ, పోలీస్, కోర్టు, క్రీడాకారులకు, మంచి మంచి అవకాశాలు వచ్చి చేజారిపోవుట, విద్యార్థులకు గడ్డుకాలము. బాగా కష్టపడి చదివితే కానీ ఉత్తీర్ణత కష్టము.
స్త్రీలకు : ఈ సం॥రం ప్రతీ విషయాన అనుమానం, అవమానం, ఉద్యోగం చేయువారికి కష్టము. అధికము ఫలితం శూన్యం. వివాహం కాని వారికి ఈ సం||ము ఆలస్యముగాను మారును. మొత్తముగా ఈ రాశివారు తగిన పరిహారాలు చేయుట మంచిది.
keywords : 2025 midhunarashi phalitalu, 2025 rashi phalalu, 2025 panchangam,