మకరరాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ పంచమమున వృషభరాశియందు సువర్ణమూర్తిగాను అనంతరం అక్టోబరు 15 వరకూ షష్ఠమున మిధునరాశియందు లోహమూర్తి గాను అనంతరం డిశంబరు 5 వరకూ సప్తమమున కర్కాటకరాశియందు లోహమూర్తిగాను అనంతరం సంవత్సరాంత వరకూ షష్ఠమున మిధునరాశియందు రజితమూర్తిగా సంచరించును.
శని : ఈ సంవత్సరం అంతయూ తృతీయమున మీనరాశియందు తామ్రమూర్తిగా సంచరించును. రాహు కేతువులు మే 18 వరకూ రాహువు తృతీయమున మీనరాశియందు కేతువు నవమమున కన్యారాశియందు రజిత మూర్తులు గాను అనంతరం సంవత్సరాంతం వరకూ రాహువు ద్వితీయమున కుంభరాశియందు కేతువు అష్టమమున సింహరాశియందు సువర్ణమూర్తులుగా సంచరించును.
2025 మకరరాశి ఫలితములు
ఉత్తరాషాఢ 2, 3, 4 పా,
శ్రవణం 1, 2, 3, 4 పా.
ధనిష్ఠ 1, 2 పా
ఆదాయం - 8, వ్యయం - 14,
రాజ్యపూజ్యం - 4, అవమానం - 5.
ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నియు పరిశీనల చేయగా ఈ సంవత్సరం అనుకూలముగా యున్నది. ప్రతీ పని అనుకూలించుట వలన ఆనందము. సంఘమున గౌరవమర్యాదలు పెద్దవారి పరిచయానికి వారి ఆదరణ, ఎటువంటి కార్యమైన తమ చతురతతో పూర్త చేయుట. వ్యవహారములు చేయించురు. నాయకత్వ లక్షణములు ఎల్లప్పడు మీ మాట పదిమింది విని ఆచరించుట పిల్లల యొక్క సహాయ సహకారములు అందుట, సకల కార్యములు సిద్ధించును. అవసరమునకు ఏదోవిధముగా ధనము చేతికి అందుట. పదిమందికి దానధర్మములు చేసి మంచి కీర్తి, ఆలోచనలు మంచికి దారి తీయుట, భూలాభము. గృహలాభము వాహన లాభము.
మంచి ఆరోగ్యము ప్రయాణములు యందు జయము కలుగును. పుణ్యయాత్ర దర్శనములు. యజ్ఞయాగాదులు యందు పాల్గొనుటకు ఆచరించుట మాతృవర్గరీత్యా అనారోగ్యము . శని తృతీయ సంచారము వలన స్త్రీ మూలక పరిచయాలు, విదేశములు వెళ్ళువారికి కార్యము సిద్ధించుట, ఆనందము, స్వదేశము వచ్చేవారు. మంచి వ్యాపారములు అవలంభించి కార్యములు అనుకూలించుట. కేతువు : అష్టమ సంచారము వలన నాలుగు కాళ్ళ జంతువులు వలన ఇబ్బందులు, ప్రమాదములు, శరీరము బాధలు, నొప్పులు, ఎంత బాగుండిననూ ఏదో తెలియని విచారము మనోవేదన, అనవసరపు కోసము. పనులు ఒక్కొక్కసారి అనవసర ప్రయాస. గృహమునందు శుభకార్యాలు వాయిదా పడినా చివరిన జరుగుట. అకాలభోజనములు భార్యను స్వల్ప అనారోగ్య సమస్యలు. బంధువులతో ఎంత స్నేహముగా ఉన్ననూ వారు మాత్రం మిమ్ములను చులకన చేయుట.
భవిష్యత్తు గురించి విపరీత ఆలోచనలు. దంతములు, సంబంధించిన ఇబ్బందులు. ప్రతీరోజు దేవాలయ దర్శనం, అలవాటుగా మారితే శుభములు. విద్యార్థులు అత్యధిక శ్రద్ధ వహించి చదివితే తప్ప ఉత్తీర్ణత కష్టతరము. జ్ఞాపకశక్తి మందము. ప్రతీరోజూ సూర్యోదయమునము ముందుగా 15 ని.లు ఏ ఆలోచనాలేకుండా మౌనంగా కూర్చొని ధ్యానం చేయుట వలన మంచి ఫలితములు. క్రీడాకారులకు, సినీమారంగం విద్యలకు అనుకూలము. ఆర్మీ, నేవీ, యంత్ర పరిశ్రమలు, విద్యలకు మంచి ప్రోత్సాహకాలము. ఉద్యోగస్తులకు మంచికాలము. గతములో ఉన్న ఇబ్బందులు తీరును. సాటి ఉద్యోగులకు సహాయ సహకారములు అందును. నూతన స్త్రీ పరిచయములు మంచిదికాదు.
చిరుద్యోగులకు అతి కష్టము పర్మినెంట్ గాని వారికి ఈ సంవత్సరం నిరుత్సాహము రాజకీయ నాయకులను అనుకూలము. మీ నోరే మీ పెట్టుబడి అంతా మీకు భయపడతారు. నామినేటెట్ పదవికి అనుకూలము. నరదృష్టి అధికము. పిల్లలకు అనారోగ్య సమస్యలు. బి.పి. అధికము, వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే మేలు. నూతన వ్యాపారాలు, ఏజన్సీలు తీసుకొని లాభించగలరు. మూకుమ్మడి, సీజనరీ వ్యాపారాలు అత్యంత అనుకూలము.
స్త్రీలకు : ఈ సంవత్సరం సామాన్యం. కుటుంబమున వ్యతిరేకత భర్త యొక్క అనుకూలము తక్కువ. వివాహప్రయత్నాలు అక్టోబరు నుండి అనుకూలము. ఉద్యోగములో యున్నవారికి సాటివారితోను ఇరుగు పొరుగు వారితోనూ ఇబ్బందులు, అపనిందలు మనస్సున విపరీత ఆలోచనలు.
keywords : rashi phalalu, 2025 makara rashiphalitalu, hindu temples guide, temples guide, makara rashi 2025, Capricorn 2025, Horoscope