కర్కాటకరాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే14 వరకూ లాభస్థానమున వృషభరాశియందు తామ్రమూర్తి అనంతరం అక్టోబరు 18 వరకు ద్వాదశయందు మిధునరాశియందు రజితమూర్తి అనంతరం డిశంబరు 5 వరకూ జన్మరాశియందు కర్కాటకమందు తామ్రమూర్తిగాను అనతరం సంవత్సరాంతం వరకూ ద్వాదశమందు మిధునరాశియందు సువర్ణమూర్తిగా సంచరించును.
శని ఈ సంవత్సరం అంతయూ, భాగ్యమున మీనరాశియందు రజితమూర్తిగా సంచరించును. రాహు, కేతువులు సంవత్సరాది నుండి మే 18 వరకూ రాహువు భాగ్యమున మీనారాశియందు కేతువు తృతీయమున కన్యరాశియందు సువర్ణమూర్తులుగాను అనంతరం సంవత్సరాంతం వరకూ రాహువు అష్టమమందు కుంభరాశియందు కేతువు ద్వితీయ స్థానమున సింహరాశియందు తామ్రమూర్తులుగా సంచరించును.
2025 కర్కాటకరాశి ఫలితములు
పునర్వసు 4పా,
పుష్యమి 1,2,3,4పా.
ఆశ్లేష 1,2,3,4 పా
ఆదాయం - 8, వ్యయం - 2,
రాజ్యపూజ్యం - 7, అవమానం - 3.
కర్కాటకరాశి వారికి గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం శుభాశుభమిశ్రమముగా యుండును. ప్రథమార్థం కీర్తి పెరుగుట, శరీరము తేజస్సు. బలము ఆరోగ్యము. అనుకొన్న ప్రతీ పని త్వరితముగా పూర్తి అగుట. పట్టినదల్లా బంగారమే అన్నట్టుంది. వ్యాపారము లాభించుట, సుఖము, శత్రువు కూడా మీ దరికి రాకుండుట.
పెద్దల అనుగ్రహము కలుగుట. భార్యబిడ్డలతో ఏదో ఒక సమస్యగా యుంటూ మనశ్శాంతి లేకుండుట. ఇంట్లో ఈగలమోత బయట పల్లకీ మోత అన్న చందాన యుంటుంది. ప్రతీ పనియందు అత్యుత్సాహము చూపుట. మాటలు చెప్పుట. పనులు చేయలేకుండుట వలన కూడా అవమానములు, ఆపనిందలు, భూమి, గృహము గురించి మీరు చేసిన పనులు వలన ఇబ్బందులు పడుట, అవసరానికి ఏదో విధముగా ధనము చేతికందును. ముందు చూపులేక మీరు చేయు సంకల్పాలు మిమ్మల్ని యిక్కట్లో పెట్టుట.
సొంత అన్న, అక్క, చెల్లి వారితో ఇబ్బందులు. కలహాలు, ద్వేషములు, పెరుగుట, ఇంటబయటా మర్యాద హాని, ద్వితీయార్థము మనస్సు విచారము, ఏ పని కలసిరాకుండుట, వాస్తు మార్పులు. ఆదాయం తగ్గుట. ఖర్చు అధికమగుట. ఉద్యోగం లేక వ్యాపారం కోసం అధికంగా ధనము ఖర్చు అప్పు చేసి మరీ మందు వెళ్ళుట. మనస్సు గందరగోళంగా తయారు అవుట రోజులు గడ్డుగా గడుచుట. పాత మిత్రులు కూడా కలసి రాకుండుట. భార్య తరపువారితో విరోధములు, దేవాలయ దర్శనములు చేయుట మంచిది. నూతనపనులు శ్రీకారము చేయుట. కోపము అధికమగుట. ఏదో తెలియని ఆందోళన చేయు వృత్తి, వ్యాపార ఉద్యోగములు యందు విరోధములు. స్థానచలనములు ప్రతీ పనియందు తొందరపాటు తనము. లేనిపోని వ్యవహారములు యందు తలదూర్చుట.
మాటల యందు దురుసుతనము, వాహన ప్రయాణములు యందు జాగ్రత్త అవసరము. క్రింద పనిచేయువారిని నమ్మి మోసపోవుట. విలువవైన వస్తువులు దొంగిలించబడుట. భార్యాబిడ్డలతో తరచూ వాగ్వివాదములు, కీళ్ళనొప్పులు వ్యవసనములకు లోనగుట. గ్యాస్ ట్రబుల్స్, శిరోసంబంధిత నరాల బలహీనత అకాల భోజనము రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు ఊడుట. చివరి నాలుగు మాసములు కొంత వెసులుబాటు. బంధు మిత్రాదులు ద్వారా చేయూత. నూతన వ్యాపారములు స్వల్పముగా లాభించుట. ఆరోగ్యం. నూతన వ్యక్తుల పరిచయాలు కలిసి వచ్చుట. ప్రయత్నించిన కార్యములు నెమ్మదిగా నెరవేరుట. దూరదేశములయందు యుండుట. ధనము నిల్వ చేయుట, ఇష్టములు సిద్ధించుట, గృహమున శుభకార్యాలు. వివాహం కాని వారికి వివాహం జరుగుట, ఇంటియందు సంతానప్రాప్తి, స్త్రీ సంతానం ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుట,
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు మంచికాలము. ఆంగ్లము, గణితము యందు శ్రద్ధ పెట్టాలి. విద్య పూర్తి అయినవారికి మంచి కంపెనీలో ఉద్యోగం ప్రయివేటు రంగములో పనిచేయువారికి మంచి అవకాశములు. పర్మినెంటు అవ్వనివారికి పర్మినెంటు ఉద్యోగ విరమణ చేయువారిని మంచి గుర్తింపు.
రాజకీయనాయకులకు ప్రభుత్వం అండదండలు, నామినేటెడ్ పదవువులు,
కళాకారులు, టి.వి. సినిమా, గాయనీ గాయకులకు మంచి గుర్తింపు, మంచి మంచి అవకాశాలు, స్థిరాస్తులు అన్నిరంగాల క్రీడాకారులకు మంచి గుర్తింపు, చేయు వృత్తి చేయువారికి ధనాదాయం పెరుగును. రైల్వే, కోర్టు, ఇన్సూరెన్స్, మెడిసిన్, రెవెన్యూ దేవాదాయ, కాంట్రాక్టుదారులకి ధనవృద్ధి. ఇతర వ్యాపారస్తులకు అనుకూలము. వ్యవసాయదారులకు కష్టమునకు తగిన ఫలితం.
ఉపాధ్యాయ, కవులు, గాయకులు, గణిత శాస్త్ర కోవిదులకు, నూతన వ్యవసాయం చేయువారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు.
స్త్రీలకు : గత రెండు సంవత్సరములు కంటే బాగుటుంది. మీ ఓర్పే మీకు రక్షణ. కుటుంబమున మంచి గుర్తింపు. పిల్లలని బాగా తీర్చిదిద్దిన మంచి ఫలితం చూచెదరు. మీ భర్త మీ యొక్క ఆలోచనలు, సలహాలను గుర్తించెదరు. ఉద్యోగం లేని వారిని సంవత్సరమున చివరన ఉద్యోగం వచ్చును.
keywords : 2025 rashi phalalu,2025 panchangam, 2025 horoscope, 2025 rashiphalalu,