2025 కుంభరాశి ఫలితములు Aquarius Kumbharashi Phalitalu

కుంభరాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ చతుర్థమున వృషభ రాశియందు లోహమూర్తిగాను, అనంతరం అక్టోబరు 18 వరకూ పంచమమున మిధునరాశియందు తామ్రమూర్తిగాను అనంతరం డిశంబరు 5 వరకూ షష్టమమున కర్కాటకరాశియందు తామ్రమూర్తిగాను అనంతరం సంవత్సరాంతం వరకూ పంచమమున మిధునరాశియందు లోహమూర్తిగా సంచరించును. 

శని ఈ సంవత్సరం అంతయూ ద్వితీయమున ఏలినాటి శనిగా మీనరాశియందు రజతమూర్తిగా సంచరించును. రాహుకేతువులు మే 18 వరకూ రాహు ద్వితీయమున మీనరాశియందు కేతువు. అష్టమమున కన్యరాశియందు లోహమూర్తులుగాను అనంతరం సంవత్సరాతం వరకు రాహువు జన్మమందు కుంభరాశియందు కేతువు సప్తమమున సింహరాశియందు లోహమూర్తులుగా సంచరించును.

2025 కుంభరాశి ఫలితములు

2025 కుంభరాశి ఫలితములు

ధనిష్ట 3,4పా, 

శతభిషం 1,2,3,4పా. 

పూర్వాభాద్ర 1,2,3పా. 

ఆదాయం - 8, వ్యయం - 14, 

రాజ్యపూజ్యం 7, అవమానం - 5.


కుంభరాశి రాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ఏలినాటి శనిప్రభావము. రాహు కేతువులు ప్రభావము వలన ఈ సంవత్సరం సామాన్యం. ఆదాయం తక్కువ, ఖర్చు అదికము. వాహనముల యందు జాగ్రత్త అవసరం. మిత్రులే శ్రతువులుగా పయనించుట శ్రమబాధ. ఏ పని తలపెట్టినా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనుకకు వెళ్ళుట. ప్రతీ పనియందు నిరుత్సాహము. ఋణములు పెరుగుట, తరచూ మానసిక శరీర అలసట. అనారోగ్యములు తినినది అరగకుండుట. వాహనప్రమాదములు. అందరితో విరోధములు, భార్యాబిడ్డలతో విరోధములు. తరచూ ప్రయాణములు. అనారోగ్యముచే బాధపడుట. కష్టములు, ధననష్టము మనస్సు తరచూ విచారము. పై అధికారులతో ఇబ్బందులు, ఇన్కమ్ టాక్స్ ఇబ్బందులు. ఆకస్మిక తనిఖీలు. ప్రతీవారికి భయపడుతూ ఉండటం, వ్యసనములు అధికమగుట. నరములు బలహీనత. స్త్రీ మూలక సమస్యలు. వాస్తు మార్పులు. ఎవరూ ఏమి చెప్పినా నమ్ముట. తరువాత ఇబ్బందిపడుట, మాటలుయందు, క్రూరమైన మాటలు ఆపి ఇబ్బంది కొని తెచ్చుకొనుట. మౌనంగా ఉండటు మేలు. 

కాలము బాగోలేప్పుడు మాటలు చేతలు ఆచితూచి వ్యవహరించండి. ప్రతీ విషయమున దుఃఖించుట. కీళ్ళ నొప్పులు, ప్రేగులు సంబంధించిత అనారోగ్యముల కీర్తి, గౌరవము తగ్గుట. చేయు వృత్తి వ్యాపార, ఉద్యోగములందు విరోధములు. నిమిషానికి ఒక ఆలోచన అన్నట్లుగా ఉండును. ధనము కొరకై ప్రాకులాట శుభకార్యములు జరగకుండుట లేక సమయానికి ధనము చేతికి అందకపోవుట నిదురలేకుండుట. పీడకలలు, అనవసరపు విషయాలలో తలదూర్చుట మంచిదికాదు. స్థిరాస్తులు అమ్మివేయుట ఉద్యోగస్తులు ప్రమోషన్స్ ఆగిపోవుట. సాటి ఉద్యోగస్తులతో విరోధములు అనుకోని ఇబ్బందికర ప్రదేశాలకు బదిలీలు, ఎక్కువ రోజులు జాబు చేయకుండుట. 

రాజకీయనాయలకులకు వర్గ పోరులో అనుకోని విధముగా కేసులు, పదవులు చేజారుట, విద్యార్థులకు ఉత్తీర్ణతా శాతం తగ్గుట. చెడు వ్యసనాలు, తేజస్సు తగ్గుట. నూతన పరిచయాలు వలన, ఇబ్బందులు, కళారంగం వారికి అత్యధిక పెట్టుబడులు మంచిదికాదు. గుర్తింపు రాకుండుట. ఇనుము, నూనె, కలప, నిల్వ చేయు వస్తువులు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. 

నిరుద్యోగులకు స్వల్పజీతంగల ఉద్యోగములు వచ్చుట. ప్రైవేటు సంస్థలలో పనిచేయువారికి అపనిందలు, ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే బాధతో ఉద్యోగం చేయుట, కోళ్ళు, చెరువులు, ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యాపారస్తులకు దొంగల భయం. ఆకస్మిక ధన నష్టము, మెడికల్, వైద్యము, ఉన్నవారికి అనుకూలం గృహమునందు శుభకార్యములు. టి.వి. సినిమా, రైల్వే, టెలిఫోన్ ఉద్యోగస్తులు తమ జాగ్రత్తలు తీసుకోవాలి. 

వ్యవసాయదారులకు అనుకూలం. ఋణముల చేయకుండా వ్యవసాయం చేయుదురు. పూలు, పండ్లు, అరటి పంటలు వారికి స్వల్పనష్టములు. స్త్రీలకు శుభశుభ మిశ్రమముగా ఉంటుంది. మంచి సంబంధము కుదిరి వివాహం జరుగును. వివాహం అయిన స్త్రీలకు, భార్యాభర్తల మధ్య, అన్యోన్యత, ఉద్యోగములలో ఉన్నవారికి పై అధికారుల వలన ఇబ్బందులు, ఎవరికి మధ్య వ్యక్తిత్వము చేయకపోవుట మంచిది. గుట్టుగా ఉండుట మేలు. సంసార విషయములు అయినా ఇతర విషయములు అయినా లేకపోతే ఇబ్బంది.

keywords : 2025 kumbharashi phalitalu, 2025 aquarius horoscope, 2025 panchangam,

1 Comments

  1. Sir what remedies need to for kumbha rasi people

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS