తిరుపతి, 2025, జనవరి 9
జనవరి 10వ తేదీ నుంచి 19 తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం టోకెన్ లు తిరుపతి లో 8 సెంటర్ లలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే, ఈ రోజు ఉదయం 10-11 గంటల మధ్య ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించి మూడు రోజులకు టికెట్స్ అయిపోయాయి. టీటీడీ అనుకున్న ప్రకారం మొదటి మూడు రోజుల టికెట్స్ అనగా 10,11,12 తేదీల టికెట్స్ ఒకేసారి ఇచ్చి ఆ తరువాత నుంచి అనగా 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గల టికెట్స్ ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు
దర్శనం టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి అనుమతి లేదని టీటీడీ తెలియచేసింది. కాబట్టి దర్శనం టికెట్ లేని వారు 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తిరుమల వెళ్లినా దర్శనం మాత్రం కాదు. నడక మార్గం లో ఎటువంటి టికెట్స్ ఇవ్వరు .
ఇక 13వ తేదికి గల టికెట్స్ 12వ తేదీ రాత్రి 2 గంటల నుంచి శ్రీనివాసం , విష్ణు నివాసం , భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇవ్వనున్నారు. శ్రీవారి మెట్ల మార్గం లో టికెట్స్ ఇవ్వడం లేదు.
అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లు 10 రోజుల పాటు రద్దు: టిటిడి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
keywords :
tirumala, tirumala news, tirumala latest updates, tirumala vaikunta ekadashi udpates,