తిరుమల,17 జనవరి 2025:
తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జనవరి 19వ తేదీ చివరి రోజు కోసం జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో పూర్తి అయ్యింది.
జనవరి 20న శ్రీవారి దర్శనం కోరే భక్తులు సర్వ దర్శనం
క్యూ లైన్‌లో చేరుకుని మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో పాటు, ఆదివారం రానుండడంతో భక్తుల రద్దీ అధికం కానుండడంతో జనవరి 20వ తేదీన సర్వదర్శనం భక్తులు క్యూలైన్లు లోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
జనవరి 20 వ తేదీ దర్శనానికి గాను ముందు రోజు అనగా 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయబడవు.
అదేవిధంగా, జనవరి 20న ప్రోటోకాల్ మినహా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఇందువలన ముందు రోజు అనగా 19న విఐపి బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
జనవరి 18వ తేదీ మరియు 19వ తేదీ తిరుమల వెళ్లే భక్తులకు దర్శనం టికెట్స్ ఇక ఇవ్వరు, దర్శనం టికెట్స్ లేకుండా కొండపైకి వెళ్తే దర్శనం ఉండదు గమనించగలరు. ప్రస్తుతం 19వ తేదీ వరకు టికెట్స్ ఇవ్వడం పూర్తీ అయింది కనుక ఇక టికెట్స్ ఇవ్వరు అనే విషయాన్నీ భక్తులు గమనించగలరు.
పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టిటిడికి సహకరించాలని కోరడమైనది.
keywords :
tirumala information, hindu temples guide, tirumala news, tirumala latest information, tirumala darshan updates.
Tirupati vachaka telisindi tickets ipoyayi ani and 20th date varuku darshanam kuda ledu free darshan ani chala duram numdi vacham
ReplyDeleteKanisam free darshan ina unte bagundedi ala kuda ivvaledu chala darunam
ReplyDelete