శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం డోకిపర్రు Sri Bhoosameta Venkateswara Swamy Vari Devalayam, Dokiparru

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామం లో వేంచేసిఉన్న  శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి ఆలయం వారు హిందూ టెంపుల్స్ గైడ్ తెలియచేసిన విశేషాలు మీకు అందిస్తున్నాము .. 

  అభినవ తిరుమలగా ప్రతిష్ట మొదలు నేటి వరకు అశేష భక్త జనులతో విరాజిలుతు స్వామి వారి కృపా కటాక్షములతో అత్యంత ప్రాముఖ్యము కలిగిన క్షేత్రముగా ఉన్నది.

dokiparru venkateswara swamy temple krishna district

స్వామి వారు తానే మూలమూర్తిగా ఆవిర్భవించి ప్రతి సంవత్సరము విశేష ఉత్సవములు చేయుంచుకొనుచు తిరుమలలో జరుగు అని సేవలు డోకిపర్రు మహాక్షేత్రములో యధావిధిగా మా చే జరిపించుకొనుటము మా పూర్వ జన్మ ఫలితముగా భావించుచున్నాము.


ఈ జన్మలో స్వామి వారి సేవలో తరించి అశేష భక్త జనులకు స్వామి వారి కృపా కటాక్షములు అందించుటకు ప్రయత్నలోపము లేకుండా అని సౌకర్యములు నెలకొలుపుటకు మేము సర్వదా ప్రయత్నించుచున్నాము.



ప్రతిష్ట మొదలు, ఈ మహాక్షేత్రములో వారోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవములు అతి ఘనముగా తిరుమల ప్రమాణముగా వైఖానస ఆగమోక్త విధముగా నిర్వహించుచున్నాము. ప్రతి సంవత్సరము ఒక్కక్రొత్త సేవతో భక్తులకు తిరుమలను గుర్తు చేస్తూ స్వామి కైంకర్యములలో పాల్గొనే సౌలభ్యము కల్పించుచున్నాము.

Sri Bhoosameta Venkateswara Swamy Vari Devalayam, Dokiparru

విశేష సేవలలో తులాభారం సేవ, అష్టదళపాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, పౌర్ణమి గరుడ సేవ, సహస్రదీపాలంకరణ సేవ మొదలైనవి స్వామికైంకర్యములలో భాగములయినవి. భక్తులకు ప్రతిమాసము ఒక్క విశేష సేవతో చదువుకొనే పిల్లలకు విద్యలలో రాణించుటకు సరస్వతి యాగము, భక్తుల కోరికలు తీర్చుకొనుటకు లక్ష్మి యాగము, పిల్లలు కోరి పుత్రకామేష్టియాగం, ఆరోగ్య కాంక్షకు నవగ్రహ హెూమము, సర్వ సౌభాగ్యములకు సుదర్శన హెూమము, శ్రీ వేంకటేశ్వర మహత్య వ్రతము ప్రారంభించినాము. ఈ సేవ కైంకర్యములలో పాల్గొనుటకు మా నిర్వహణ కార్యకర్తలను Cont. No. @7993899999 సంప్రదించగలరు.

Sri Bhoosameta Venkateswara Swamy Vari Devalayam, Dokiparru


శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయములో ధనుర్మాసములో గోదాదేవి కళ్యాణము జరుగును. గోదాదేవిని భూదేవిగా పూజించి పాడి పంటలు ససస్యామలముగా ఉండాలని అమ్మవారిని పూజించి భోగి నాడు గోదాకల్యాణమును చేయదరూ. చైత్రమాసములో త్రేతాయుగం పురుషుడు శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామ కళ్యాణోత్సవం జరుగును. 

Sri Bhoosameta Venkateswara Swamy Vari Devalayam, Dokiparru

జ్యేష్టమాసములో వార్షికోత్సవం సందర్భముగా స్వామివారికి విశేష కళ్యాణోత్సవం జరుగును. వైభవోత్సవములలో భాగముగా స్వామి వారికి కళ్యాణోత్సవం జరిపించబడును. బ్రహ్మోత్సవ వేళ, సర్వ దేవత సమేతుడైన శ్రీ శ్రీనివాస స్వామికి చక్రస్నానంతరం విశేష కళ్యాణోత్సవం జరుగును. భక్త జనులందరికి చెరువుగా ప్రతినెలా చివరి ఆదివారంనాడు శాంతి కళ్యాణోత్సవం జరిపించబడుచునది.





కావున, తామెల్లరు రండి, దర్శించండి, తరించండి, శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రులుకండి.

Address

Sri Bhoosameta Venkateswara Swamy Vari Devalayam

Dokiparru Village, Gudlavalleru Mandalam,

Krishna Dist, Andhra Pradesh,

Pincode: 521332.

website : https://sbvt.net/

Keywords : Sri Venkateswara Swamy Temple, Krishana District Famous Temples, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS