108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు | 7వ దివ్య దేశము | 108 Divya Desam Temples Tirupullam Pudhan Temple Information |

తిరుపుల్లం పూధన్ గుడి


 

👉 స్వామి మలై నుండి 3 km 

@ ప్రధాన దైవం : వల్ల్విల్ రామన్(విష్ణువు) , 

@ ప్రధాన దేవత : హేమఅంబుజవల్లి తయార్ , పోత్రమారైయల్ (లక్ష్మీ)

@గర్భగుడి : శోభన విమానము

@ తీర్థము: జటాయు తీర్థము.


🛎 స్థలపురణము:

👉 శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రములో సీతా వియోగమైన తరువాత జటాయువికి అంతిమ సంస్కారాలు ఇచ్చట జరిపి ఈ స్థలంలో కొంత సేదతీరేను. 

ఈ సేద తీరిన స్థలమే ఈ క్షేత్రమని నానుడి. 

👉 "ఫుల్"  అనగా తమిళంలో గరుడ జాతి పక్షి వంశము, ఆ కారణము చేత ఈ స్థలమునకు "పుళ్ళంపూధన్ "గుడి పేరు వచ్చింది.

 శ్రీరాముడు ఇచ్చట విశ్రమించిన సమయమున ఆ గరుడ జాతి పక్షుల రాజు అయిన గరుత్మంతుడు, శ్రీరాముడి దగ్గరే ఉండి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశారు.

ఆ భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు భుజంగ శయన మూర్తిగా దర్శనమిచ్చి అనుగ్రహించెను. అందుకే ఇక్కడ విగ్రహం శయనమూర్తి.



👉 సీత దేవిని రావణాసురుడు లంకకు గైకొని వెడలినందున ఈ క్షేత్రములో సీతా దేవి విగ్రహం లేదు. 

ప్రత్యేక సన్నిది భూదేవికి మాత్రం కలదు. ఉత్సవ విగ్రహము చతుర్భుజములతో శంఖము, చక్రములతో దర్శనము ఇచ్చును.

👉 ఈ క్షేత్రమునకు 1 కి మీ. దూరములో మండంగుడి అను గ్రామము తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మస్థలము. ఈ గ్రామములొ తొండరిడిప్పోడి ఆలయము, రంగనాధుని క్షేత్రము కలవు.  

అక్కడి రంగనాథ స్వామి కోవిల తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మస్థలము.

👉 ఇది అతి చిన్న కుగ్రామము. ఆలయము నకు రాబడి అతి తక్కువ.  ఇక్కడికి అతి సమీపములో అహోబిల మట్టం బృందావనము ఉన్నది.

 👉 ఈ క్షేత్రము , శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వామిమలైకి  కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కలదు..


🙏 జై శ్రీమన్నారాయణ 🙏



Keywords:108 Divya Desam Temples,Tirupullam Pudhan Temple Information,Tirupullam Pudhan Temple Information in telugu,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS