108 శ్రీవైష్ణవ దివ్యదేశం | 5వ దివ్యదేశం | 108 Divya Desam Temples Karambanoor (Uttamar Koil) Information |

కరంబనూర్(ఉత్తమర్ కోయిల్)



@ ప్రధాన దైవం: పురుషోత్తమ పెరుమాళ్

@ ప్రధాన దేవత: పూర్వాదేవి తాయార్

@ పుష్కరిణి: కదంబ తీర్థము

@ గర్భాలయ విమానం : ఉద్యోగవిమానము


దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని తిరుచిరాపల్లి శివార్లలోని ఉతమర్‌కోయిల్‌లోని ఉత్తమర్ కోవిల్ ( తిరుక్కరంబనూర్ లేదా భిక్షందర్ కోవిల్ అని కూడా పిలుస్తారు ) హిందూ త్రిమూర్తుల విష్ణు , శివుడు మరియు బ్రహ్మకు అంకితం చేయబడింది . 

ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం 6వ-9వ శతాబ్దాల CE నుండి ఆళ్వార్ సాధువుల ప్రారంభ మధ్యయుగ తమిళ శాసనమైన నలయిర దివ్య ప్రబంధంలో కీర్తించబడింది . పురుషోత్తమన్ పెరుమాళ్ ( పురుషోత్తమర్ అని కూడా పిలుస్తారు ) మరియు అతని భార్య లక్ష్మిని పూర్ణవల్లి తాయర్‌గా పూజించే విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి .


🛎 స్థల పురాణం : 

👉 బ్రహ్మదేవునకు ముందు పంచముఖములు ఉండెవి . 

తాను సృష్టికర్త అయి పంచముఖములు కలిగియుండుటతో గర్వ పడెడివాడు . ఒక సందర్భమున ఆగర్వము ఎక్కవ అయి ముక్కంటికి కోపము తెప్పించెను . 

పరమశివునకు కూడ పంచముఖములే , పరమశివుని విరాట్ రూపమున నాలుగు దిక్కులు . ఊర్ధ్వము కలిపి అయిదు ముఖములు . 

👉 శివుడు బ్రహ్మకు తన పంచ ముఖేశ్వర రూపమును చూపించి , సృష్టికర్తకు గర్వముండుట తగదు అని బ్రహ్మ యొక్క ముఖములలో ఒక దానిని తన గోరుతో త్రుంచి వేయగా బ్రహ్మతల శివుని చేతికి అంటుకొని ఉండిపోయినది . శివునికి బ్రహ్మ హత్యా పాతకము తగిలెను . ఎంత ప్రయత్నించిననూ ఆ తల ఊడిరాక శివుని అరచేతి యందు అంటుకొని ఉండిపోయెను . 

👉 బ్రహ్మ హత్యా దోషము వలన శివుని సకల సంపదలు హరించుకొనిపోయి భిక్షాటన చేసుకొన వలసిన పరిస్థితి వచ్చినది . అరచేతిలో ఉన్న బ్రహ్మకపాలమునే భిక్షాపాత్రగా కాలము గడవుచూ పావనిష్కృతికై యోచించుచుండగా తన చేత నున్న కపాలము నిండుగా ఎప్పుడు భిక్షలభించునో , ఆ రోజు పాప నిష్కృతి అయి , ఆ కపాలము విడిపోవును అని శ్రీమన్నారాయణుని అనుగ్రహమున అశరీర వాణి వినిపించెను . 

👉 అందుచేత శివుడు అన్ని ప్రదేశములు , దివ్యదేశ క్షేత్రములు అంతటా భిక్షకై తిరుగుచుండెడి వాడు . ఒక దినమున శ్రీ మహాలక్ష్మి వేసిన భిక్షతో కపాలము నిండి శివుని అరచేతి నుండి విడిపోయి ఆ కపాలము నరనారాయణ క్షేత్రమైన బదరికాశ్రమమందు అలకనంద నది ఒడ్డున పడెను .

 అదే బ్రహ్మకపాల క్షేత్రముగా ఉన్నది . అక్కడ పితృదేవతలకు పిండదానము చేసినచో వారికి ఉత్తమ ఉత్తరగతులు కలుగును . ఒకసారి బ్రహ్మకపాలమున పితృదేవతలకు పిండదానము చేసినచో మరిచేయ నవసరము లేదు అని పురాణము .

👉ఈ దివ్యదేశమున శివునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహమున అశరీర దివ్యవాణి ఆ పాప నిష్కృతి వృత్తాంతమును వినిపించెను .

 కావున ఈ క్షేత్రం ఒక వైష్ణవ దివ్యదేశముగా పరిగణించబడుతున్నది.

👉 ఈ ప్రదేశమున కదంబ ఋషి తపము చేసి శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యమును పొందెను . యోగి పుంగవులు ,విష్ణు భక్తాగ్రేసరులు అయిన సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాతులు అను బ్రహ్మ మానస పుత్రులకు , మార్కండేయ మహర్షికి కూడ  శ్రీమన్నారాయణుని ప్రత్యక్షము అయినాడు. . 

👉 ఈ స్థలపురాణము ప్రకారం ఇచ్చట పరమేశ్వర , బ్రహ్మదేవుల సన్నిధిలు కూడ కలవు . అందుచేత ఈ ఆలయము త్రిమూర్తులతో అతిశోభాయమానముగా ఉండును.

👉కదంబ మహర్షి తపస్సు చేసిన కారణంగా దీనిని " కదంబ క్షేత్రము " అని కూడా అంటారు.


🙏 జై శ్రీమన్నారాయణ 🙏




Keywords:108 Divya Desam Temples,Karambanoor (Uttamar Koil) Information,Karambanoor (Uttamar Koil) Information in telugu,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS