108 శ్రీవైష్ణవ దివ్యదేశము | 4వ దివ్యదేశము | 108 Divya Desam Temples Thiruanbil (Banapuram), Tiruchurapalli Information |

  తిరుఅన్బిల్ (బాణాపురం ),తిరుచురాపల్లి



👉అన్బిల్ లేదా తిరు అన్బిల్ అనేది  108 వైష్ణవ దివ్యదేశాలులో నాల్గవది.

@ ప్రధాన దైవం: సుందరరాజ పెరుమాళ్

@ ప్రధాన దేవత:   సుందరవల్లి

@ పుష్కరిణి: మండూక పుష్కరిణి

@ గర్భగుడి విమానం:  తారక విమానము


👉ఈ క్షేత్రము తిరుచ్చి - కుంభకోణం బస్ మార్గములో కలదు తిరుచ్చి నుండి బస్ సౌకర్యం మితంగా ఉంది. అందువలన "నటరాజపురం" బస్సులో పోయి అక్కడ నుండి 1 కి.మీ. నడచి సన్నిధికి చేరుట సులభము. ఇచట ఏ విధమైన వసతులు లేవు. శ్రీరంగము నుండి పోయి దర్శించాలి. శ్రీరంగమునకు 20 కి.మీ.


🛎 స్థలపురాణం :

👉బ్రహ్మదేవుడు సృష్టి కర్తగా తనకు అప్పగించిన గొప్ప బాధ్యతని శ్రద్ధగా నిర్వహిస్తు... శ్రీ మహావిష్ణువుని అవాంతరములు , చిక్కులు , సందేహములు కలిగినచో లేదా పితృ ప్రేమతో భక్తి కలిగి దర్శనము కోరుకొనిన వాడై తండ్రి అయిన శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకొని సందర్శనమైన తరువాత క్లేశము వీడిపోయి తృపుడై తిరిగి తన సృష్టి కార్యమును ప్రారంభించి నిర్వహించు మహాకుశలుడు . పితృ భక్తుడు .

 ఆవిధముగా ఒక సమయమున ఇచ్చట శ్రీ మహావిష్ణువును ప్రార్థించి దర్శించుకొనెను . 

👉 శ్రీ వాల్మీకి మహర్షియు ...శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణ గుణములను , భక్త వాత్సల్యమును , దివ్య సౌందర్యమును సదా హృదయమున సంతరించుకొని యుండి ఎల్లవేళలా సర్వజనులకు మంగళ అనుగ్రహములే చేయుచూ , సర్వప్రాణుల శాంతి సుఖములకై తపస్సు చేయుచూ గడిపిన మహా మనిషి ,గొప్ప జ్ఞాన సంపన్నుడు,  అయినను కించిత్తు అహంభావము కూడ లేని , నిరంతర భగవధ్యాన తత్పరుడు . 

👉ఇచ్చట పెరుమాళ్ ను ప్రార్థించి ప్రత్యక్షము గావించుకొని , సర్వజనుల , భక్తుల వేడుకోలులను మన్నించి కష్టదూరులను గావించి భవసాగరమును తరించుటకై అనుగ్రహించునదిగా కోరుకొనెను . అతి సుందర స్వరూపమున , సౌందర్యమునకు ఉపమానము అను విధముగా ఈ దివ్యదేశమున వెలసిన పెరుమాళ్ ను

 " వడివళగీయ నమ్బి " ( సుందర మూర్తి) అందురు .

 తాయార్ కూడ ఆప్రకారముగానే అతిశ్రేష్ఠ సౌందర్య రాశి అనురీతిలో " అళగీయవల్లి " (సౌందర్య మూర్తి) నాచియార్‌గా దర్శన మిచ్చును . 

👉ఇచ్చట పెరుమాళ్ ను దర్శించు నప్పుడు ఆణ్బేకాదవుల్ . ఆణ్ బేఅళఘు , ఆణ్ బే ఉళగమ్ , ఆణి జ్ఞానమ్ , ఆణ్ బే పదెప్పు అందురు . అనగా భగవంతుడే ప్రేమ , సౌందర్యము , ప్రకృతి , జ్ఞానము మరియు సృష్టి అని అర్ధము.


🙏జై శ్రీమన్నారాయణ🙏


Keywords:108 Divya Desam Temples,Tiruchurapalli Information,Tiruchurapalli Information in Telugu,
Thiruanbil (Banapuram), Tiruchurapalli Information

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS