108 శ్రీవైష్ణవ దివ్యదేశము | 3వ దివ్యదేశము | 108 Divya Desam Temples Thanjamamanikkoil, Thanjavur Information

 తంజమామణిక్కోయిల్,తంజావూరు


@ ప్రధానదైవం: శ్రీ నీలమేఘ పెరుమాళ్

@ అమ్మవారు: శ్రీ శెంగమలవల్లి తాయార్

@ పుష్కరిణి:  కాళికా పుష్కరిణి

@ గర్భగుడి: సుందర  విమానము


👉 ఇక్కడ స్వామివారు "ఆసన"మూర్తి గా అనగా కూర్చున్న భంగిమలో దర్శనమిస్తున్నారు.

ఈ రెండు క్షేత్రములు తంజావూరునకు ఉత్తరమున (తిరువైయార్ పోవుమార్గమున) 3 కి.మీ దూరములో దక్షిణ పెన్నానదీ తీరమున "విణ్ణాత్తుంకరై" అనుచోట ఉన్నాయి. ఈ రెండు దివ్య దేశములను చేర్చి ఒకే దివ్య దేశముగా భావించు చున్నారు.

🛎 స్థల పురాణం :

👉వ్యాస భగవానుడి తండ్రి అయిన పరాశర మహర్షి మరియు ఎందరో ఋషులు తమ తమ శిష్యులతో ఈ ప్రదేశమున నివసించి తమ తపస్సులను కొనసాగించున్నారు.

 ఆ సమయమున చాలా రాక్షసులు వారి తపస్సులకు భంగము వాటిల్లు రీతిని ప్రవర్తించుచూ హింసలు కూడ చేయు చుండిరి .

👉ఆ రాక్షసులలో " తరగన్ .. తడగన్ , తంజగన్ " అను ముగ్గురు ఎక్కువ బలవంతులు . 

ఆ ఋషులు కాళికాదేవిని ప్రార్థించగా ఆ దేవి ప్రత్యక్షమై ఆ రాక్షసులను అందరినీ చంపి వేసెను . 

తరగన్ " , " తడగన్ " కూడ చంపబడ్డారు.

కాని , తంజగన్ ఎట్లో తప్పించుకొని పారిపోయాడు.. . 

👉ఆ రాక్షసుడు మరల కొద్ది రోజుల తరువాత ఋషులను ఇబ్బందులకు గురి చేయుట ప్రారంభించెను . 

ఋషులు అప్పుడు శ్రీ మహావిష్ణువును ధ్యానించిరి . 

శ్రీ మహావిష్ణువు, తన నాలుగవ అవతారమైన నరసింహ రూపమున ఆవిర్భవించి "తంజగన్ " అనే రాక్షసుని వధించెను . 

👉తంజగన్ రాక్షసుడు వధింపబడిన ప్రదేశము కావున ఈ స్థలమునకు తంజావూర్ అని పేరు వచ్చినది .

👉 పరాశరాది రుషులు ఎంతో భక్తితో ప్రార్థించగా శ్రీమహావిష్ణువు " వెళ్లర్" నది ఒడ్డున ఆసీనమూర్తిగా దర్శనమిచ్చి అనుగ్రహించెను.

👉ఈ నదిని ప్రస్తుతము " వెన్నారు " నదిగా పిలుచుచున్నారు . 

ఈ పుణ్య నదిలో విష్ణు లోకమున ఉండు అమృతము ప్రవహించుచుండును , విష్ణులోకము సందలి విరజా నదియే " వెళ్లారు " గా ఇచ్చటకు వచ్చినది అని పురాణము .

👉ఈ స్థలమున “తంజైమామణిక్కోయిల్ "

 " తంజై మణికుఱ్ఱ పెరుమాళ్ కోవిల్ "

 " తంజైయళినగర్ పెరుమాళ్ కోవిల్ " 

అను మూడు ఆలయములను కలిపి ఒకే దివ్యదేశముగా పిలుస్తారు. .

👉మూడు ఆలయములలో శ్రీమన్నారాయణుడు ..

" నీలమేఘ పెరుమాళ్ "," మణికుణ పెరుమాళ్ " ," యళినగర్ నరసింహ పెరుమాళ్ " నామములతో ఆసీన మూర్తియై దర్శన మిచ్చును . 

👉మూడు ఆలయములలో ఉత్సవ మూర్తులు " శ్రీమన్నారాయణన్ " నామముననే యుండును.


👉ఇతర విషయములు : 

👉 1.గర్భగుడి బయట లక్ష్మీదేవిని కుడి తొడపై కూర్చుండ బెట్టుకొని ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి , ఆండాళ్ , విష్వక్సేనులు దర్శన మిచ్చుచున్నారు . 

👉 2. తాయార్ సన్నిధి బయట ఉన్న స్తంభములలో ఒక స్తంభమునకు ఒక ప్రక్కన యోగ నరసింహ స్వామి , రెండవ ప్రక్క శ్రీ ఆంజనేయ స్వామి ల శిల్పములు చెక్కబడి యున్నవి .  

🙏 జై శ్రీమన్నారాయణ 🙏




keywords:108 Divya Desam Temples,Thanjamamanikkoil information,Thanjamamanikkoil information in telugu,Thanjamamanikkoil,thanjavur information

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS