ఓం నమో వేంకటేశాయ .. వైకుంఠ ఏకాదశి కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు జనవరి 10 నుంచి 19వ తేదీవరకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. వీటికి సంబంధించి ఆన్ లైన్ లో టికెట్స్ విడుదల చేయడం తో పాటు ఆఫ్ లైన్ లో తిరుపతి లో 91 కౌంటర్ లలో జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనం టికెట్స్ ఇలా ..
జనవరి 9వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల వరకు గల టికెట్స్ ను అనగా జనవరి 10 , 11,12 వ తేదీ గల టికెట్స్ ను తిరుపతి లో ఏర్పాటు చేసిన కౌంటర్ లలో నిరంతరాయంగా ఇవ్వనున్నారు. 1 లక్ష 20 వేల టికెట్స్ ను ఈ మూడు రోజులుగాను ఇవ్వనున్నారు.
జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు టికెట్స్ ఇవ్వడం మొదలు పెడతారు, మొదటి రోజుకు అనగా 10వ తేదికి సంబందించిన 40,000 టికెట్స్ అయిపోగానే 11వ తేదికి గల టికెట్స్ ను కౌంటర్ లో ఇవ్వడం మొదలు పెడతారు. ఆ విధంగా 12వ తేదీ టికెట్స్ అయిపోయేవరకు టికెట్స్ ఇస్తారు. 12వ తేదీ టికెట్స్ కూడా అయిపోయగానే కౌంటర్ మూసివేస్తారు.
వైకుంఠ ఏకాదశి టికెట్స్ తిరుపతి లో ఎక్కడ ఇస్తున్నారంటే ..
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు . తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు..
టికెట్స్ పొందడం ఎలా ?
భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలి , టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేయబోతున్నారు .
13వ తేదీనుంచి 19వ తేదీవరకు టికెట్స్ ఇలా ..
మొదటి మూడు రోజుల గల టికెట్స్ 8 కేంద్రాల్లో జారీచేసి , 13వ తేదీ నుంచి గల టికెట్స్ మూడు కేంద్రాలలో మాత్రమే ఇవ్వనున్నారు. శ్రీనివాసం , విష్ణు నివాసం , భూదేవి కాంప్లెక్స్ లో ఈ టికెట్స్ ఇస్తారు .
ఏ రోజు టికెట్స్ ఆ రోజు ఇస్తారా ?
ఒకరోజు ముందుగా ఈ టికెట్స్ ఇస్తారు అనగా 14వ తేదీ టికెట్స్ కావాలంటే 13వ తేదీన మనం తీసుకోవాలి .
రూమ్స్ ఎలా ?
ఆన్ లైన్ లో విడదల చేయడం లేదు. కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఉదయం 6 గంటల నుంచి రూమ్స్ ఇస్తారు.
శ్రీవారి మెట్టు మార్గం లో టికెట్స్ ఇస్తారా ?
శ్రీవారి మెట్టు మార్గం లో టికెట్స్ ఇవ్వరు .
టికెట్ లేకుండా కొండపైకి వెళ్తే దర్శనం ఇస్తారా ?
టికెట్ లేని భక్తులకు దర్శనం ఉండదు వీరు కొండపైకి వెళ్ళవచ్చు తలనీలాలు సమర్పించవచ్చు.
Keywords : Vaikunta Ekadashi Latest updates, Tirumala News, Hindu Temples Guide.