తిరుమల టికెట్స్ లేకుండా వెళ్లేవారికి తిరుపతి లో అనగా కొండ క్రింద టికెట్స్ ఇస్తున్నారు.
1. రైల్వే స్టేషన్ కు ఎదురుగా గల విష్ణు నివాసం లో ఇస్తున్నారు . విష్ణు నివాసం లో మీరు ఆన్ లైన్ లో రూమ్స్ బుక్ చేయకపోయినా ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారు, ఇక్కడ ఉచిత లాకర్ లు ఉంటాయి మరియు మీరు ఫ్రెష్ అవ్వడానికి బాత్రూం లు కూడా ఉంటాయి. విష్ణు నివాసం నుంచి కొండపైకి బస్సు లు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉంటాయి. విష్ణు నివాసం లో భోజనాలు కూడా పెడుతున్నారు.
2. విష్ణు నివాసమే కాకుండా RTC బస్సు స్టాండ్ కు ఎదురుగా ఉన్న శ్రీనివాసం లో కూడా టోకెన్ లు ఇస్తున్నారు. ఇక్కడ ఆన్ లైన్ లో రూమ్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ ఇస్తారు.
3. గోవిందరాజుల సత్రాల్లో రూమ్స్ ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వడం లేదు.
సర్వదర్శనం టోకెన్స్ రూల్స్ :
👉టోకెన్ తీసుకోవడానికి అందరూ ఆధార్ కార్డు తో లైన్ లో నిలబడాలి.
👉12 సంవత్సరాల లోపు పిల్లలు అవసరం లేదు.
👉 తెల్లవారు జామున 2 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు.
👉టికెట్స్ ఎప్పటివరకు ఉంటాయని ఎవరు చెప్పలేరు , టికెట్స్ ఉన్నంత వరకు ఇచ్చి కౌంటర్ మూసి వేస్తారు.
👉 మీరు తీసుకున్న టికెట్ పైన దర్శనం టైం రాసి ఉంటుంది , ఆ సమాయానైకి లైన్ లోకి వెళ్తే సరిపోతుంది.
👉 సర్వదర్శనం టోకెన్స్ ప్రతి రోజు ఇస్తారు.
👉 సాధారణంగా ఈ రోజు టికెట్ తీసుకుంటే ... ఉదాహరణకు మీరు శుక్రవారం తెల్లవారు జామున టికెట్ తీసుకుంటే శనివారం ఉదయం లోగా దర్శనం అవుతుంది.
👉 మీకు కావాల్సిన తేదికి , మీకు కావాల్సిన సమయానికి టికెట్ ఇవ్వమంటే ఇవ్వరు.
మీకు తిరుపతి లో ఇచ్చే దర్శనం టికెట్స్ దొరకకపోయినా లేదా మెట్లమార్గం లో టికెట్స్ కూడా లేకపోతే మీరు కొండపైన ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా వెళ్లి ఆ లైన్ లోకి దర్శనం చేసుకోవచ్చు
keywords : Tirumala sarvadarshan tickets updates, tirumala darshan tickets, tirumala information.
Srinivasamalo darshanam tokens a time nundi eastaru
ReplyDelete