తిరుమల హోమం టికెట్స్ దర్శనం రూల్స్ | Tirumala Homam Tickets Darshan Rules

tirumala homam tickets

హోమం టికెట్స్ తీసుకుంటే దర్శనం ఉంటుందా ?

హోమం అయ్యాక మీ టికెట్ పై స్టాంప్ వేసి ఇస్తారు , మీరు 3pm కు కొండపైన 300/- టికెట్ లైన్ అనగా atc వద్దకు వెళ్లి లైన్ లోకి దర్శనం చేసుకోవచ్చు . 

హోమం టికెట్స్ తో పాటు మరల 300/- టికెట్ తీసుకొవాల ?

అవసరం లేదు , హోమం టికెట్ చూపిస్తే సరిపోతుంది

హోమం టికెట్స్ భార్య భర్తలే తీసుకోవాలా ?

ఎవరైనా తీసుకోవచ్చు 

హోమం టికెట్ ధర ఎంత ?

ఇద్దరికీ కలిపి 1600

హోమం ఎన్ని గంటలకు చేస్తారు ?

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ వేశేషా హోమం. అలిపిరి వద్దగల గోశాల వద్ద  సప్తగౌ ప్రదక్షిణ శాల లో  చేస్తారు.  ఉదయం 9 గంటల నుంచి 11-12 వరకు జరుగుతుంది. 

బ్యాగ్ లను తీసుకుని వెళ్లవచ్చా ? లాకర్ లో పెట్టాలా ?

అక్కడ లాకర్లు లేవు , మీరు మీ లగ్గేజ్ ని తీసుకుని వెళ్ళవచ్చు. 

మేము సీనియర్ సిటిజన్ లము ఎక్కువ సేపు కూర్చుని ఉండలేము ఎలా ?

క్రింద కూర్చోలేని వారిని అక్కడ గట్టు పై కుర్చోనిస్తున్నారు ఇబ్బంది ఉండదు. 

హోమం లో పాల్గొనకుండా దర్శనానికి వెళ్లవచ్చా ?

తప్పకుండా హోమం లో పాల్గొనాలి

డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా ?

సాంప్రదాయ దుస్తులు వేసుకుని వెళ్ళాలి 

హోమం లోకి మేము ఏమైనా తీసుకుని వెళ్లాలా ?

అన్నీ టీటీడీ వారే సమకూర్చుతారు మీరు హోమం చూస్తే చాలు , ఏమి చేయనసరం లేదు. 

మేము రావడం కాస్త ఆలస్యం అవుతుంది 9 గంటలకే ఉండాలా ?

మేము హోమం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కొందరు 10 -11 మధ్యలో వచ్చారు వారిని కూడా రానిచ్చారు . 

హోమం టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ?

ఈ టికెట్స్ నెల రోజులు ముందు విడుదల చేస్తున్నారు , ప్రతి రోజు ఒక 50 టికెట్స్ అక్కడే ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు. 

హోమం టికెట్స్ ఏ వెబ్ సైట్ లో బుక్ చెయ్యాలి ?

టీటీడీ వెబ్సైటు లోనే బుక్ చెయ్యాలి : https://ttdevasthanams.ap.gov.in/home/dashboard

keywords : tirumala homam tickets udpates, tirupathi homam tickes rules, tirupati dashan, offline tickets, tirumala ruels, hindu temples guide . 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS