తిరుమల ఒంటరిగా వెళ్లేవారికి దేవస్థానం వారు రూమ్స్ ఇవ్వరు, మీరు మీ కుటుంబం తో తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు మీకు CRO ఆఫీస్ వద్ద రూమ్ దొరకకపోతే
మీరు దేవస్థానం వారు ఉచితంగా ఇస్తున్న లాకర్లు ను వాడుకోవచ్చు, కేవలం మీ సామాన్లు పెట్టుకోవడానికే కాకుండా మీరు విశ్రాంతి తీసుకోవడానికి , స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి.
కొండపైన CRO ఆఫీస్ దగ్గర పెద్ద LED స్క్రీన్ కనిపిస్తుంది , ఆ వెనకాల సందులా ఉంటుంది అక్కడే యాత్రి నివాస్ ఉంటుంది దీనినే PAC 1 గా పిలుస్తారు. మీకు అక్కడ లాకర్లు ఇస్తారు , గుండు గీయించుకోవడానికి స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ బిజీ గా ఉండి మీకు దొరకకపోతే అదే దారిలో కాస్త ముందుకు నడిస్తే మరో యాత్రి నివాస్ వస్తుంది PAC 3 అని పిలుస్తాము.
బాలాజీ బస్సు స్టాండ్ దగ్గర పద్మనాభ నిలయం కలదు, ఇక్కడ కూడా ఉచిత లాకర్లు కలవు.
మాధవ నిలయం , ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా GNC టోల్ గేట్ దాటిన తరువాత మాధవ నిలయం ఉంటుంది.
మొదటి సారిగా వెళ్లేవారికి ఈ పేర్లు , అడ్రస్ లు తెలియకపోవచ్చు కానీ మీరు కంగారు పడవద్దు. కొండపైన ఉచిత బస్సు లు ఉంటాయి మీరు ఫలానా చోటుకు వెళ్లాలని చెప్పినా , లేదా అడ్రస్ చెప్పిన వారు దించుతారు. కొండపైన పోలీస్ వారు ఉంటారు వారిని కూడా అడిగితే చెబుతారు. డబ్బులు ఇస్తే రూమ్ ఇప్పిస్తాం , టికెట్స్ ఇప్పిస్తాం అని ఎవరైనా మీ దగ్గరకు వస్తే నమ్మకండి.
తిరుమల అంటే కొండపైన , తిరుపతి అంటే కొండ క్రింద, మీకు తిరుపతి లో రూమ్ కావాలంటే విష్ణు నివాసం లో ఆన్ లైన్ లో బుక్ చేయకపోయినా అక్కడ ఇస్తారు. విష్ణు నివాసం లో ఉచిత లాకర్లు మరియు స్నానములు చేయడానికి సదుపాయంగా ఉంటుంది, ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. రైల్వే స్టేషన్ కు ఎదురుగా విష్ణు నివాసం ఉంటుంది. ఇక్కడ నుంచి కొండపైకి బస్సు లు ఉంటాయి. విష్ణు నివాసం తెల్లవారుజామున 2 గంటల నుంచి సర్వదర్శనం టికెట్స్ ఇస్తున్నారు.
keywords : tirumala free lokers locations, tirumala latest information