కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి | Nettikanti Hamuna Temple Kasapuram Information

శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలవారు ఏకకాలంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే మూడు ఊళ్లల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారని చెబుతారు. 

kasapuram temple

కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ మూడు ఊళ్ళల్లోని ఆంజనేయస్వామివార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేషఫలప్రదం అని చెబుతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణమాసం శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా గుంతకల్లు నుండి నడుపుతారు. లేదా స్వంత వాహనాల్లో గానీ, ఆటోల్లో గానీ కూడా అనేకమంది యాత్రికులు ఈమూడు క్షేత్రాలలోని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. 

ఆ క్షేత్రాల్లో ఒకటైన కసాపురం వివరాలను తెలుసుకొందాం.

kasapuram temple


నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉంది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది. 



నేరుగా చూసే స్వామి కనుక నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు.భక్తులకు ఈయనే "కల్పతరువు", "వరప్రదాత". ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.



kasapuram




స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకీ పెద్దది.

మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీరు వారికి కాల్ చేసే ముందుగా వాట్స్ యాప్ లో మెసేజ్ చేసి కాల్ చేయగలరు. 

S.ఉమహేశ్వరావు గారు :  8309418262



కసాపురం గురించి వివిధ పత్రికలో వచ్చిన వార్త కథనాలు ఇక్కడ చూడవచ్చు . 















ఏ విధంగా చేరుకోవాలి ?
గుంతకల్లు పత్తికొండ మార్గంలో గుంతకల్లు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కసాపురం గ్రామం ఉంది గుత్తికి 33 కిలోమీటర్లు అనంతపురం 115 కిలోమీటర్లు కర్నూలు 74 కిలోమీటర్లు బెంగళూరు 298 కిలోమీటర్లు హైదరాబాద్కు 334 కిలోమీటర్ల దూరంలో కసాపురం ఉంది రైల్లో ప్రయాణించి గుంతకల్ జంక్షన్కు చేరుకునే భక్తులు ఏడు కిలోమీటర్ల దూరంలోనే కసాపురం చేరుకోవడానికి ఆటోల సౌకర్యం ఉంది భక్తులు గుంతకల్లు నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు ఆటోలో ఉన్నాయి

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS