తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ 24న విడుదల | Tirumala Vaikunta Ekadashi Ticket Relase Date and Time

tirumala vaikunta ekadashi tickets


👉వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష

👉23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల

👉24న ఎస్ఈడీ టికెట్లు విడుదల

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

- 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.

- 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల‌‌.

- జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్ డి టోకెన్లు కేటాయింపు.

- తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.

- టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం.

- టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు.

- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం.

- వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు.

- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం.

- వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.

- గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.

- వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.

- ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం.

- టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ.

- లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం.

keywords : tirumala, tirumala updates, tirumala news, tirumala

1 Comments

  1. ఈ రోజు 18-12-2024వ తేదీన లక్కీ డిప్ ద్వారా బుక్ చేస్తే మరలా వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన టిక్కెట్స్ కు అలవ్ చేస్తారా దయచేసి తెలుపగలరు

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS