తిరుఉఱైయూరు ( తిరుక్కోలి)
🌷ఈ క్షేత్రమునకు "కోళి" యని "నాచ్చియార్ కోయిల్" అని తిరునామములు గలవు ). తమిళనాడు.
తిరుఉరయూరు, ఉఱైయూరు లేదా ఉరైయూరు (ఆంగ్లం:Urayur or Uraiyur;)
(ప్రస్తుతం తిరుచ్చినాపల్లిలో భాగం)
8వ శతాబ్దం వరకు పూర్వ చోళుల (early Cholas) రాజధాని.
ఉరయూర్ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చినాపల్లి పట్టణానికి 3km దగ్గరలో ఉంది. ( తిరుచునాపల్లి పరిధిలో వస్తుంది).
ప్రధాన దైవం: అళగియ మణవాళ పెరుమాల్
ప్రధాన దేవత: నాచ్చియార్
ఇక్కడి స్వామి పుష్కరిణి పేరు : కళ్యాణ పుష్కరిణి
స్వామి వారి గర్భగుడి విమానం: కళ్యాణ విమానము
12 ఆళ్వార్లులో ఒకరైన తిరుప్పని ఆళ్వార్ జన్మస్థలం ఇది.
ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించి వాసలక్ష్మి అనే పేరుతో శ్రీ రంగనాథుని పరిణయమాడిన స్థలమిది.
శ్రీరంగములో జరుగు ఆది బ్రహ్మోత్సవమున మూడవనాడు శ్రీ రంగనాథుడు ఉరైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటిని అనుగ్రహిస్తారు.
🌷స్థల పురాణం :
చోళనాడులో కుంభకోణమును రాజధానిగా ధర్మవర్మన్ అను రాజు పాలించు రోజులలో ఒక రోజు ఆ రాజు వేట నిమిత్తమై అడవికి పోగా కొందరు రాక్షసులు , ఆశ్రమములలో అక్కడ మునులను ఇబ్బందులు పెట్టడం చూసాడు. ఆ మునులు తమను ఆ రాక్షసుల బారి నుండి రక్షించమని రాజును కోరారు. .
ధర్మవర్మన్ అరణ్యములో కొంత కాలము ఉండి ఆ రాక్షసులను తన సైన్యముతో చంపేశాడు .
మునులు ఆనందించారు,, అప్పుడు ఆ రాజు మునులను ప్రార్థించి తనకు సంతానము లేదని చెప్పి సంతానము కలిగేలా ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. .
రాజు సంతానమునకై శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించవలె అని , అట్లు చేసిన శ్రీ మహాలక్ష్మియే స్వయముగా రాజునకు కూతురుగా జన్మించును అని మునులు చెప్పారు. .
ధర్మవర్మన్ తన సతీసమేతముగా శ్రీమహాలక్ష్మిని పూజించి అమిత భక్తితో ప్రార్థించెను .
రాణి గర్భవతి అయి ఆడ శిశువును ప్రసవించింది.
ఆ శిశువునకు వాసలక్ష్మి అని పేరు పెట్టిరి . ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే !
యుక్త వయస్సు రాగానే వాసలక్ష్మికి రాజు స్వయంవరము ఏర్పాటు చేసెను . ఎందరో రాజకుమారులు వచ్చినా... ఆ స్వయంవరమునకు శ్రీమన్నారాయణుడు కూడ వచ్చి పాల్గొనారు .
వాసలక్ష్మి నేరుగా పోయి శ్రీమన్నారాయణుని చూచి వరించింది ,
ఆ విధముగా అచ్చట వెలసి , శ్రీమహాలక్ష్మీ సమేతముగా తిరిగి వైకుంఠమును చేరుకొనిన పెరుమాళ్ కు ధర్మవర్మన్ శ్రీరంగనాథునిగా ప్రతిష్ఠించి గొప్ప ఆలయమును నిర్మించి తరించాడు.. ఆ స్థలం లో ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించి, దివ్య దేశం గా గుర్తింపు తెచ్చారు.
ఆ విధముగా ఇచ్చట పెరుమాళ్ భక్తుల ప్రార్థలను మన్నించి అనుగ్రహించు చున్నాడు . ఈ విధముగా ఇచ్చటి స్థల పురాణము ...
జై శ్రీమన్నారాయణ!..