సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలే శక్తి పీఠ క్షేత్రాలు. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే ప్రధానమైనవి అష్టాదశ శక్తి పీఠాలు అవి వరుసగా :
1. శాంకరి దేవి శక్తి పీఠం - శ్రీలంక లో ఉంది
2. కామాక్షి అమ్మవారు - కాంచీపురం
3. శృంఖల దేవి శక్తి పీఠం - పశ్చిమ బెంగాల్
4. చాముండేశ్వరి అమ్మవారు - మైసూరు
5. జోగులాంబ అమ్మవారు - ఆలంపూర్, తెలంగాణ
6. భ్రమరాంబిక అమ్మవారు - శ్రీశైలం
7. మహాలక్ష్మి అమ్మవారు - కొల్హాపూర్
8. ఏకవీరిక (రేణుకా మాత) - మహారాష్ట్ర
9. మహాకాళి - ఉజ్జయిని
10.పురుహూతిక అమ్మవారు - పిఠాపురం పాదగయ క్షేత్రం
11.గిరిజ దేవి - జాజ్‌పూర్
12. మాణిక్యాంబ అమ్మవారు - ద్రాక్షారామం
13. కామరూప - గౌహతి నుండి 18 కిలోమీటర్లు
14. మాధవేశ్వరి - ప్రయాగ
15. వైష్ణవి దేవి - కాట్రా
16. మంగళ గౌరి - గయ
17. విశాలాక్షి - కాశీ క్షేత్రం
18. సరస్వతి - జమ్మూకాశ్మీర్
రాష్ట్రాల వారీగా చూస్తే
ఆంధ్ర ప్రదేశ్ లో - 3 శక్తి పీఠాలు కలవు. శ్రీశైలం లో భ్రమరాంబిక అమ్మవారు , పిఠాపురం లో పురుహూతికా అమ్మవారు , ద్రాక్షారామం లో మాణిక్యాంబ అమ్మవారు ఉన్నారు
మహారాష్ట్ర లో - 2 శక్తి పీఠాలు కలవు , కొల్హాపూర్ లో మహాలక్ష్మీ అమ్మవారు , షిర్డీ కి దగ్గర్లో ఏకవీర శక్తి పీఠం.
ఉత్తరప్రదేశ్ లో- 2 శక్తి పీఠాలు కలవు, ప్రయాగ లో మాధవేశ్వరి అమ్మవారు , కాశీ లో విశాలాక్షి అమ్మవారు
తెలంగాణ - 1 , జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం ఆలంపూర్ లో కలదు.
తమిళనాడు - 1 కాంచీపురం లో కామాక్షి అమ్మవారు
కర్ణాటక - 1 మైసూర్ లో చాముండేశ్వరి శక్తి పీఠం
పశ్చిమ బెంగాల్-1, శృంఖలా దేవి శక్తి పీఠం
మధ్యప్రదేశ్- 1: మహాకాళి శక్తి పీఠం ఉజ్జయిని క్షేత్రం లో కలదు
ఒడిషా - 1: లో జాజిపూర్ లో గిరిజ దేవిశక్తి పీఠం
అసోం - 1 : కామరూప శక్తి పీఠం గౌహతి నుంచి 18 కిమీ దూరం లో కలదు.
హిమాచల్ ప్రదేశ్ 1 : కాట్రా లో కొండపైన వైష్ణవి దేవి శక్తి పీఠం కలదు
బీహారు 1 : మంగళ గౌరి శక్తి పీఠం గయ క్షేత్రం లో ఉంది
జమ్మూకాశ్మీర్ 1 : లో సరస్వతి శక్తి పీఠం ఉండేది
శ్రీలంక :లో శాంకరి దేవి శక్తి పీఠం కలదు
శక్తి పీఠాల కోసం వివరంగా తెలుసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి
keywords : Shakti Peethas Information, 18 shakti peethas list , Hindu Temples Guide Tour Guide,
We want only letter writing only Tamil no Telugu I don't understand
ReplyDelete