కార్తీక మాసం లో శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులకు శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు కొన్ని సూచనలు చేసారు.
శ్రీశైల దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగం, కార్తీక మాసం లో శ్రీశైలం లో కొలువైయున్న మల్లికార్జున స్వామి వారిని అష్టాదశ శక్తి పీఠాలలో 6వ శక్తిపీఠమైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని దర్శించడానికి భక్తులు వేలల్లో చేరుకుంటారు. శ్రీశైలం లో నవంబరు 2వ తేదీ నుంచి డిసెంబరు 1వరకు కార్తిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయా అధికారులు ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆలయ సేవ టికెట్స్ లను ఆన్ లైన్ ద్వారా ఇస్తున్నారు. శ్రీశైలం లో ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా సరే గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారిని తాకవచ్చు, దీనినే స్పర్శ దర్శనం అని పిలుస్తారు. మంగళవారం నుంచి శనివారం వరకు మూడు సార్లు సర్పదర్శనం ఉంటుంది. ఉదయం 7:30 కు , మధ్యాహ్నం 12:30 కు , రాత్రి 9:30 కు ఉంటుంది. ఆన్ లైన్ లో మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి 500/- టికెట్ ధర.
కార్తీక మాసం లో సర్పదర్శనం రద్దు చేసిన రోజులు
2.11.2024 : కార్తిక మొదటి శనివారం
3.11.2024 : కార్తిక మొదటి ఆదివారం
4.11.2024 : కార్తిక మొదటి సోమవారం
9.11.2024 : కార్తిక రెండవ శనివారం
10.11.2024 : కార్తిక రెండవ ఆదివారం
11.11.2024 : కార్తిక రెండవ సోమవారం
12.11.2024 : కార్తిక ఏకాదశి
15.11.2024 : కార్తిక పౌర్ణమి
16.11.2024 : కార్తిక మూడవ శనివారం
17.11.2024 : కార్తిక మూడవ ఆదివారం
18.11.2024 : కార్తిక మూడవ సోమవారం
23.11.2024 : కార్తిక నాల్గవ శనివారం
24.11.2024 : కార్తిక నాల్గవ ఆదివారం
25.11.2024 : కార్తిక నాల్గవ సోమవారం
2.11.2024 : కార్తిక 5వ శనివారం
2.11.2024 : కార్తిక 5వ ఆదివారం
👉కార్తీక మాసం లో గర్భాలయ అభిషేకాలు కూడా రద్దు చేశారు.
👉అదే విధంగా సామూహిక అభిషేకాలు నిలుపుదల చేసారు.
గమనిక : యాత్రికుల భద్రత దృష్ట్యా ఏపీ నుంచి వెళ్లే వారి కోసం దోర్నాల, శిఖరం వద్ద, తెలంగాణ నుంచి వెళ్లే వారి కోసం మన్ననూర్, దోమలపెంట వద్ద ప్రతిరోజూ రాత్రి 09:00 నుండి ఉదయం 06:00 వరకు గేట్లు మూసివేయబడతాయి. కావున, భక్తులు నిర్ణీత వ్యవధిలోగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని మనవి.
రోడ్ మార్గం : శ్రీశైలం కర్నూలు నుండి 180 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 220 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 530 కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి 272 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ట్రైన్ మార్గం : శ్రీశైలానికి సమీప రైల్వే స్టేషన్ మార్కాపూర్. మార్కాపూర్ దక్షిణ మధ్య రైల్వేలో గుంటూరు-హుబ్లీ లైన్ మధ్య ఉంది. శ్రీశైలం నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపూర్ నుండి శ్రీశైలం చేరుకోవడానికి బస్సు లు ఉంటాయి.
keywords : srisailam updates, srisailam sparsha darshanam timings, kartika masam srisailam updates. hindu temples guide
Sprsha dharshanam tickets january lo dorukuthaya
ReplyDelete