హిందూ సంప్రదాయంలో ధన త్రయోదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వెలుగుల పండగ దీపావళికి ముందు వచ్చే ఈ పర్వదినాన్ని 'ధంతేరాస్' అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి రోజున.. ధన త్రయోదశి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి అక్టోబర్ 29వ తేదీ మంగళవారం రోజున వచ్చింది.
ధన త్రయోదశి ఎప్పుడంటే..
హిందూ పంచాంగం ప్రకారం, 2024 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబర్ 29న ఉదయం 12:01 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 30న తెల్లవారుజామున 2:45 గంటలకు ముగుస్తుంది.
అక్టోబర్ 29న రాత్రి 7:27 నుండి 9:16 వరకు ధన్తేరస్ పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది. ప్రదోష కాలము 6:37 PM నుండి 9:16 PM వరకు జరుగుతుంది.
ఉదయం తిథి ప్రకారం, మంగళవారం 29 అక్టోబర్ 2024 న ధన త్రయోదశి పండుగ జరుపుకుంటారు.
ప్రదోష కాలంలో ధన్వంతరిని పూజించడంతో పాటు దీపాలను వెలిగిస్తారు. అలాగే తమ సామర్థ్యం ప్రకారం దానధర్మాలు చేస్తారు.
ధన త్రయోదశి వేళ ఈ పనులు చేయడం మరచిపోవద్దు..
ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరి జయంతి రోజునే ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, వినాయకుడు, కుభేరుడిని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో మీ ఇంట్లో మట్టితో తయారు చేసిన లక్ష్మీ గణపతి విగ్రహాలను తీసుకెళ్లి ఆరాధించాలి. అలాగే వెండి విగ్రహాలను కూడా కొనుగోలు చేయొచ్చు. మీ ఇంటికి ఆ విగ్రహాలను తీసుకెళ్లాక ఆ విగ్రహాలను ఎర్రని లేదా పసుపు రంగులో ఉండే వస్త్రంపై ఉంచాలి.
ఆ తర్వాత కుంకుమ తిలకం పెట్టి పూజను ప్రారంభించాలి. పూజ చేసే సమయంలో ఆ విగ్రహాల ముందు నాణెలను ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత వాటిని భద్రంగా మీ అల్మారాలో లేదా లాకర్ లో ఉంచుకుంటే సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
Tags: ధన త్రయోదశి, Dhanteras 2024, Dhanteras 2024 date, Dhanteras 2024 time, Dhanteras 2024 Tithi, 2024 Dhantrayodashi