నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం
పరమేశ్వరుని ఆలయాల్లో నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటారు . నందీశ్వరుని అనుమతి లేకుండా పరమేశ్వరుని దర్శించడం ఫలితాన్నివ్వదని పెద్దలు చెబుతూంటారు . నంది కొమ్ముల మధ్య నుండీ శివలింగ దర్శనం చేసుకోవడం పద్ధతిని చెబుతారు . ఏమిటి ఇందులోని పరమార్థం? అలా దర్శం చేసుకొనేప్పుడు నందీశ్వరునికి ఒక చిన్న ప్రార్థన కూడా చెప్పుకోవాలి . కనుక వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు.
నందీశ్వరునికి కొమ్ముల మీద ఎడమ చేతిని ఉంచి, ఆయన వెనక భాగంలో కుడి చేతితో స్పృశిస్తూ ఈశ్వర దర్శనం చేసుకోవాలి . ఇలా దర్శనం చేసుకొనేప్పుడు భక్తుడు తన శిరస్సుని వంచుతాడు. ఆ విధంగా పరమేశ్వరునికి సర్వస్య శరణాగతి చేస్తూ, అహాన్ని , ఇహాన్ని వదిలి ఈశ్వరుని కోరడం ఒక భావన.
ఈ విధంగా నంది కొమ్ముల మధ్య నుండీ మహేశ్వరుని దర్శనం చేసుకొనేప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇదీ:
నందీశ్వర నమస్తుభ్యం
శాంతానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్ధం
అనుజ్ఞామ్ దాతు మర్హసి
ఈ శ్లోకాన్ని పఠిస్తూ హరహర శివ, అంటూ శివ నామాన్ని పలుకుతూ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి.
ఇలా చేసినట్లయితే వేద పఠనం చేసినటువంటి ఫలితము, సప్తకోటి మహామంత్ర జప ఫలితము లభిస్తాయని, పాప పరిహారం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.
సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.
పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి.
అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.
అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.
కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.
గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.
అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.
రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది.
Tags: నంది కొమ్ముల, నంది, Shiva Nandi photos, Nandi bull significance, Lord Shiva and Nandi story, How did Nandi become Shiva's vehicle, Nandiswarudu, Nandi Darshnam, Nandiswarudu Temple, Shiva Temple