పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్! ఆగస్టు నెలలో అదిరే ముహూర్తాలు ఇవే..Muhurtham Dates in August 2024

పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్! ఆగస్టు నెలలో అదిరే ముహూర్తాలు ఇవే..

గత కొన్ని నెలలుగా చాలా మంది మూఢం కారణంగా శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేదు.

గత కొన్ని నెలలుగా చాలా మంది మూఢం కారణంగా శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేదు. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం శ్రావణ మాసంలోకి అడుగు పెట్టేశాం. కాబట్టి ఏం చక్కా శుభకార్యాలు చేసుకోవచ్చు.

బేసిక్‌గా చాలా మంది ఏదైనా మంచి పనిని చేసే ముందు మంచి ముహూర్తం చూస్తారు. మంచి ముహూర్తం లేకపోతే మాత్రం.. అప్పుడు కార్యక్రమాన్ని వెనక్కి వేసుకుంటారు తప్ప, దాన్ని నిర్వహించరు. చాలా మంది కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు.

ఇంటి నిర్మాణం నుంచి, పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్, దూర ప్రయాణాలు, పిల్లలకు నిర్వహించే కార్యక్రమాలు వరకు ఇలా ఏ మంచి పని స్టార్ట్ చేయాలన్నా మంచి ముహూర్తం ఉండాల్సిందే. లేదంటే మాత్రం ఆ పనిని ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకుంటారు.

శ్రావణ మాసం రావడంతో గత 3 నెలలుగా ఉన్న మూఢానికి బై బై చెప్పేసి శుభ కార్యాలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

ఆగస్టు నెలలో చాలానే శుభ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు స్టార్ చేయవచ్చు. ఆగస్టు నెలలోని శుభ ముహూర్తాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

*ఆగస్టు 7 నుంచి 28 వరకు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు.

*ఆగస్టు 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలలో శుభకార్యాలు చేపట్టుకోవచ్చని సూచిస్తున్నారు.

*అంతేకాకుండా ఆగస్టు నెలలో 17, 18 తేదీలు అత్యంత శుభ ముహూర్తాలని పండితులు వెల్లడించారు. అందువల్ల మీరు మీ ఇంట్లో పెళ్లి చేయడం లేదంటే ఇంటి ప్రవేశం, లేదంటే ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ డేట్స్‌లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

కాగా పెళ్లిళ్లు, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయడం వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే మీకు సంబంధించిన లేదంటే తెలిసిన పండితుడిని సంప్రదించి మీకు అనువైన తేదీని ఎంచుకోవచ్చు.

Tags: Muhurtham Dates in August 2024, 2024 Muhurtham dates Telugu, Muhurtham Dates August 2024, 2024 Hindu Marriage Dates, Subha Muhurtham Dates 2024, August Pelli Muhurtham

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS