తిరుమల కొండపై ఆగస్టు నెలలో నిర్వహించే విశేష ఉత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆగస్టు నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలపై ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు నెలలో 9వ తేదీన శ్రీవారి గరుడ సేవను నిర్వహిస్తారు. అలాగే ఆగస్టు 15 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇక ఆగస్ట్ 19న పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తారు. ఆగస్ట్ 27న శ్రీవారి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే నెలలో 2 సార్లు గరుడ సేవ..
ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు
• ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.
• ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
• ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.
• ఆగస్టు 10న కల్కి జయంతి.
• ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
• ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
• ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి.
• ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
• ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.
• ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి. పౌర్ణమి గరుడ సేవ. రాఖీ పండుగ. హయగ్రీవ జయంతి. విఖనస మహాముని జయంతి.
• ఆగస్టు 20నతిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు. గాయత్రీ జపం.
• ఆగస్టు 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.
• ఆగస్టు 28న శ్రీవారి శిక్యోత్సవం.
ఆగస్టు నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించినున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఈ కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
TAGS: TTD, TIRUMALA NEWS, TIRUMALA, TIRUMALA UPDATES, TIRUMALA TICKETS, TIRUMALA FESTIVALS AUGUST, TIRUMALA FESTIVALS, TTD TEMPLE, SPECIAL FESTIVALS TIRUMALA, TTD TICKETS, GARUDA SEVA TIRUMALA