Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం.. విశిష్టత గురించి తెలుసుకోండి..

హిందూ మతంలో గురు పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. గురు పూర్ణిమ ఎప్పుడు? ఈ రోజు ప్రాముఖ్యత, పూజా విధానం, స్నానం, దానం చేసే శుభ సమయం తెలుసుకోండి.

ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు. నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించారని నమ్ముతారు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.

మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు. దాని కారణంగా అతనికి మొదటి గురువు బిరుదు లభించింది. పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ హరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు. ఈ నేపథ్యంలో గురు పూజకు శుభ ముహుర్తం ఎప్పుడు.. గురు పూర్ణిమ కథ, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి..

ఈ ఏడాది జూలై 20వ తేదీ అంటే శనివారం సాయంత్రం 5:59 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 గంటలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, జూలై 21న ఆదివారం నాడు గురు పూర్ణిమ జరుపుకోనున్నారు. గురు పూర్ణిమ రోజున శుభ ముహుర్తం ఉదయం 9:01 గంటల నుంచి ఉదయం 10:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రెండో ముహుర్తం 10:44 నుంచి మధ్యాహ్నం 12:27 గంటల వరకు ఉంటుంది. అనంతరం చివరగా మధ్యాహ్నం 2:09 గంటల నుంచి మధ్యాహ్నం 3:52 గంటల వరకు ఉంటుంది.

ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. మరోవైపు పురాణాల ప్రకారం, మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు. వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ణానాన్ని అందించడం వల్ల, తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేద వ్యాస మహర్షిని పూజిస్తారు. ఈరోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే గురు స్థానం బలంగా ఉండదో వారు కూడు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. 

గురు పూర్ణిమ పూజా విధానం

ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి. పవిత్ర పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి. విష్ణువుకు ఆహారం సమర్పించండి. గురు పూర్ణిమ రోజున మహర్షి వేదవ్యాసుడిని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున మీ గురువులను ధ్యానించండి. పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

Tags: గురు పూర్ణిమ, Guru purnima 2024, Guru Purnima, Guru Purnima, Gurupurnima, Guru Purnima Telugu, Guru Purnima pooja Vidhanam, Vyasa Purnima, Guru Purnima Date

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS