ఆషాఢమాసము
(06-07-2024 శనివారంనుండి
04-08-2024 ఆదివారం వరకు)
ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల.
పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెల ఆషాఢమాసంగా చెప్పబడింది.
ఆషాఢమాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు.
ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో *దక్షిణాయనం* మొదలవుతుంది. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.
"దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది."
"ఆషాఢ శుద్ధ ఏకాదశి" నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని "తొలిఏకాదశి" గా పరిగణిస్తారు.
*ఆషాఢ శుద్ధ పౌర్ణమి* ని రోజును "గురుపౌర్ణమి"గా వ్యవహరిస్తారు.
మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజును "వ్యాసపౌర్ణమి" అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.
అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని, *"నవకళేబర ఉత్సవం" అంటారు.
విశేషాలు
ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.
ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.
శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే "ప్రథమైకాదశి" అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి. పేలపిండి తింటారు.
ఈ మాసంలో ఇంద్రియనిగ్రహంతో ఆహారవిహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.
ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.
హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢమాసంలో బోనాలు పండుగ జరుపుకోబడుతుంది.
పండుగలు
👉 ఆషాఢ శుద్ధ విదియ - పూరీ జగన్నాధ రధయాత్ర.
👉 ఆషాఢ శుద్ధ పంచమి స్కందపంచమి గా చెప్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రధ్ధలతో పూజిస్తారు.
👉 ఆషాఢ శుధ్ధ షష్ఠి - కుమార షష్ఠి గా పిలుస్తారు.
👉 ఆషాఢ శుధ్ధ సప్తమి - భాను సప్తమి. ఉత్తరం నుండి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు, మూడు మాసాల తరువాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు-రాత్రి నిమిషం-ఘడియ-విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి.
👉 ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలిఏకాదశి/శయన ఏకాదశి. ఈరోజు నుండి "చాతుర్మాస్య వ్రతం" ప్రారంభం అవుతుంది.
👉 ఆషాఢ శుద్ధ చతుర్దశి - గోదాదేవి జననం.
👉 ఆషాఢ శుద్ధ పూర్ణిమ - గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి.
👉 ఆషాఢ బహుళ చవితి - సంకట హర చతుర్ధి.
👉 ఆషాఢ బహుళ ఏకాదశి - కామేకాదశి
👉 ఆషాఢ బహుళ చతుర్దశి -- మాసశివరాత్రి
Tags: Ashada Masam 2024, Ashada masam 2024 Telugu calendar
Ashada masam 2024 Andhra Pradesh, Ashada Masam in Telugu, Ashada masam, Ashada Masam 2024 Start Date and end Date Telugu, Ashada masam 2024 gold rate, Ashada Masam festivals, Ashada Shukravara