ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . తిరుమల శ్రీవారి సేవకు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది.
ప్రస్తుత విధానం ప్రకారం శ్రీవారి సేవ చేయడానికి వెళ్లే భక్తులు కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవ కోటా ఆగష్టు వరకు బుక్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు విడుదల చేస్తున్నారు.
శ్రీవారి సేవ ఎప్పుడు విడుదల చేసిన మూడు రకాల సేవల కోటా విడుదల చేస్తారు. జూన్ 27వ తేదీ న సెప్టెంబర్ నెలకు విడుదల చేస్తున్నారు ఏ సేవ ఎన్ని గంటలకు విడుదల చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1) శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు
2) నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు
3 ) పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తున్నారు.
ఏ సేవకు ఎంత వయస్సు ఉండాలి ?
శ్రీవారి సేవ చేయడానికి 18-60 సంవత్సరాల వయస్సు వరకు సేవ చేయవచ్చు .
నవనీత సేవ చేయడానికి 50 సంవత్సరాలు లోపు ఉండాలి , ఈ సేవ ఆడవారికి మాత్రమే ఉంటుంది .
పరకామణి సేవ చేయడానికి 25-65 సంవత్సరాలు ఉండాలి . ఈ సేవ మగ వారికీ మాత్రమే ఉంటుంది .
ఎన్ని రోజులు సేవ చెయ్యాలి ?
శ్రీవారి సేవ మరియు నవనీత సేవ 7 రోజులు చేయాల్సి ఉంటుంది , పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజులు చేయవచ్చు .
గుడిలో సేవ అందరికి ఉంటుందా ?
శ్రీవారి సేవ మరియు నవనీత సేవ చేసేవారికి మాత్రమే గుడి లో సేవ వేస్తారు, పరకామణి సేవ వారికి ఈ అవకాశం ఉండదు. ప్రస్తుత విధానం ప్రకారం సేవకు వచ్చిన సేవకులను లక్కీ డ్రా ద్వారా గుడి లో సేవ కు అవకాశం ఇస్తున్నారు . 90% అందరికి అవకాశం వస్తుంది .
సేవ ఏ విధంగా బుక్ చెయ్యాలి ?
మీరు ఈ వీడియో చుడండి శ్రీవారి సేవ పైసా ఖర్చు లేకుండా సులువుగా మీరే చేసుకోవచ్చు .
Keywords : Tirumala, tirumala updates, tirumala news, Tirumala Sreevari Seva, Parakamani seva, navaneetha seva rules.
ఆ వీడియో ప్రక్కన చంద్ర బాబు ఫోటో ఎందుకు .. ఈ గుడి వారి సొంతమా (ప్రస్తుతానికి) ..???
ReplyDelete