లక్ష్మిని పోగొట్టే / రాకుండా చేసే సప్త వ్యసనాలు - Sapta Vyasanalu

లక్ష్మిని పోగొట్టే / రాకుండా చేసే సప్త వ్యసనాలు

వ్యసనం అంటే  మితిమీరిన అలవాటు/ఇష్టం అని, అందువలన దుఃఖాన్ని  కష్టాన్ని తెచ్చిపెట్టేది అని  వాడుకలో అర్థం. ఇలాంటివి ఏడు వ్యసనాలు మానవులకి అధోగతిని కలిగిస్తాయని పెద్దలమాట.

అవి జూదం, వ్యభిచారం, వేట, పరుషవాక్కు అంటే బాధాకరమైన, కఠినమైన మాటల ధోరణి, ఇతరుల వస్తువులను/ధనమును అనుభవించడం, ఇతరులను వారి పనులను - నిష్కారణంగా విమర్శించడం మద్యపానం ఇవి మానవుల జీవితాల్లో ప్రవేశిస్తే వదలవు.

మానవుని సర్వనాశనం చేస్తాయి. వీటివలన ఉన్న లక్ష్మి / సంపద నశిస్తుంది లేదా - రావలసిన లక్ష్మి కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ సప్తవ్యసనాలకి మానవులు దూరంగా వుండాలి. అప్పుడే సంపద ఉంటుంది. వస్తుంది.

అష్టసంపదలు

సంపద అంటే మనం ధనం లేదా వెండి బంగారాలు రత్నమాణిక్యాలు యివే అని అనుకొంటాము. కాని అవి మాత్రమే సంపదలు కావు. పనివారు, స్నేహితులు, సంతానము, బంధువులు, వాహనములు, ధనము నిలవ, వస్తువుల నిలవ, శిష్యులు, ఇళ్ళూ, పొలాలు, గోవులు మొదలైనవి వస్తువుల్లో చెప్పుకోవచ్చును.

పనివారు :- వుండడం చేత  యజమాని తనకు అసాధ్యమైన పనులు చేయించు కోవచ్చును. ఉపచారాలు చేయించుకోచ్చును. తనను తన సంపదను రక్షించుకోవచ్చును. కాబట్టి  పనివారుకూడా సంపదకి ఒక గుర్తు.

స్నేహితులు :- మనల్ని ఉపయోగించుకోడానికీ మనకు ఉపయోగపడడానికి మిత్రులు పనికి వస్తారు. మనల్ని ఉపయోగించుకొనేవారు- మన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని చూసి వాటిని  తమకు అనుకూలంగా వినియోగించుకోడానికి, సంపన్నుని ఆశ్రయిస్తారు.

వీళ్లు తమ అవసరాలనిబట్టి సంపన్నులకి ఉపయోగ పడతారు. సంపన్నుల అధికారానికి  ధనానికి లోబడి మనఃపూర్వకంగా వాళ్లకి ఉపయోగపడేవారు రెండోరకం స్నేహితులు. ఇట్టి స్నేహితులు వుండడం కూడా ఒక రకమైన సంపదే.

సంతానం : - సంతానం వల్ల మనఃశ్శాంతి సంపదకి రక్షణా అధిక సంపాదనకి వంశవృద్ధికి  వీలు అవుతుంది. ఆ సంతానం ఈ విధంగా సంపద అవుతోంది.

బంధువులు : - మనకుగల సంపదని బట్టి, అధికారాన్ని బట్టి, గుణశీలతను బట్టి వారి వారి అవసరార్ధం మనచుట్టూ చేరతారు. బంధబలగం అని పెద్దలమాట.

వాహనాలు : - మన అధికారం సంపద వీటిని బట్టి మన వాహనాల సంపద వుంటుంది కదా. ఇవి వుండడం కూడా సంపదే.

ధనసంపత్తి :- ధనం బాగా నిలవవుంటే అదీ సంపదే కదా.

వస్తువులు : - పొలాలూ, ఇళ్ళూ వగైరాలు - ఇవీ సంపదే.

శిష్యులు : -అంటే మన దగ్గర చదువుకున్న వాళ్లూ - మనల్ని ఆదర్శంగా పెట్టుకొన్నవాళ్లూ వీళ్లూ - మనల్ని కీర్తిమంతుల్ని ఆదర్శప్రాయుల్ని చేస్తారు. వీళ్లూ సంపదే కదా.

కాబట్టి మనం ఈ అష్టసంపదల్నీ సంపాదించుకోవాలి. వాటిని సంపాదింప ప్రయత్నించాలి. ఉన్న వాటిని రక్షించుకోవాలి.

Tags: Lakshmi, Lakshmi devi, Dhanam, Money, Dhana Lakshmi, Devotional Storys, Bhakthi Samacharam Telugu, Sapta vyasanalu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS