నిర్జల ఏకాదశి వేళ ఇలా పూజిస్తే శ్రీహరి అనుగ్రహం పొందొచ్చు..!
నిర్జల ఏకాదశి 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు. హిందూ మతంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇది శ్రీ హరికి అంకితం ఇవ్వబడింది. ఈ ఏకాదశి వేళ ఉపవాస దీక్ష ఆచరించే వారు కనీసం నీరు కూడా తాగకుండా ఉంటారు. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటించే వారికి ఏడాది పొడవునా 24 ఏకాదశులు పూజ చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వదినాన శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయి. అంతేకాదు తెలిసి, తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సందర్భంగా నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి ఏయే పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నిర్జల ఏకాదశి శుభ ముహుర్తం..
జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి తేదీ జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం 4:45 గంటలకు నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం కానుంది. ఆ తర్వాత మరుసటి రోజు జూన్ 18న ఉదయం 6:20 గంటలకు ఈ వ్రతం ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 18వ తేదీ మంగళవారం నాడు జరుపుకుంటారు.
పూజా విధానం..
నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి.
* ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది.
* ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు.
* అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది.
* నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో, తులసి మాలతో అలకరించి పూజించాలి.
* పూజా సమయంలో పండ్లు సమర్పించి, తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి.
విష్ణువును స్మరించుకుంటూ..
తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి కథను హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మముహుర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్మకం.
Tags: నిర్జల ఏకాదశి, nirjala ekadashi, nirjala ekadashi 2024, nirjala ekadashi telugu, nirjala ekadashi 2024 date and time, nirjala ekadashi 2024 what to do, nirjala ekadashi 2024 time, nirjala ekadashi 2024 fasting time, nirjala ekadashi 2024 timings