తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో దర్శనం, ఉచితంగా టికెట్ బుక్ చేసుకోండిలా - Senior Citizen Darshan at Tirumala

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో దర్శనం, ఉచితంగా టికెట్ బుక్ చేసుకోండిలా

తిరుమల వెళ్లే యోచనలో ఉన్నారా.. ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు. అది కూడా కేవలం 30 నిమిషాల్లోనే.. ఎలానో తెలుసుకోండి.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఉచితంగానే శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. కేవలం 30 నిమిషాల్లోనే మీరు స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు రావొచ్చు. అది ఎలా ? అని అనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి.

ఉచిత దర్శనం అనేది అందరికీ అందుబాటులో లేదు. తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌‌‌కు మాత్రమే ఈ వెసులుబాటు ఉటంటుంది. టీటీడీ తాజాగా వీరికి శుభవార్త చెప్పింది.

టీటీడీ వీళ్ల‌కు స్వామి వారి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ కూడా ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

తిరుమల ఆలయం బయట గేట్ వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ వివరించింది. వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తామని పేర్కొంది.

అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపింది. అలాగే స్వామి వారి దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవ‌చ్చ‌ని టీటీడీ పేర్కొంది.

కాగా ఈ ఫెసిలిటీ పొందాలని భావించే వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు పూర్తై ఉండాలి. దివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

అలాగే ఒకవేళ వృద్ధులు న‌డ‌వ‌లేని స్థితిలో ఉంటే వారి వెంట ఓ వ్యక్తికి అనుమతి ఉంటుందని.. అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంద‌న్నారు. అయితే ఇప్పుడు ఈ సేవలు పొందాలని కొన్ని డాక్యుమెంట్లు అవసర అవుతాయి. అవేంటో చూద్దాం.

ఈ సేవలకు ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు.. ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంబంధిత సర్జన్, స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలి.

అలాగే వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్‌ను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్పేజీలో Online Services ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు సీనియర్ సిటిజన్ దర్శనం లేదా డిఫరెంట్‌లీ ఏబుల్డ్ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి.

ఇప్పుడు కేటగిరి ఆప్షన్లో సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మీరు ఏ రోజు స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నారో.. ఆ తేదీని ఎంచుకోవాలి. తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. ఇలా సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

Tags: Senior Citizen Darshan at Tirumala, Tirumala, TTD, Tirumala Darshnam, Tirumala Tickets, Srivari Seva, Senior Citizen Tirumala Darshnam, Senior Citizen Tickets online

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS