ఓం నమో వేంకటేశాయ .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెల విడుదల చేస్తున్న మొదటి గడప దర్శనం టికెట్స్ అనగా ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ 18వ తేదీ లేదా (19వ తేదీ) ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత ఫలితాలను ప్రకటిస్తున్నారు.
బుకింగ్ చేయడం ఎలానో ఈ వీడియో లో చూడండి :
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి టీటీడీ వారు మెసేజ్ లు పంపించడం జరుగుతుంది . మీరు డిప్ కి రిజిస్టర్ చేసుకుని ఉంటె టీటీడీ నుంచి మీకు మెసేజ్ వచ్చిందో లేదో చూసుకోండి. ఒక వేళా మెసేజ్ రాకపోతే మీరు టీటీడీ వెబ్సైటు ఓపెన్ చేసి లేదా టీటీడీ యాప్ ఓపెన్ చేసి , బుకింగ్ హిస్టరీ లోకి వెళ్లి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలుస్తుంది.
సేవ లో సెలెక్ట్ అయినవారు అమౌంట్ కట్టాలి , అమౌంట్ కట్టకపోతే టికెట్ రద్దు అవుతుంది. మీరు సెలెక్ట్ అవి మీకు డబ్బులు కట్టడం రాకపోతే హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 7382679767 కు మీరు సెలెక్ట్ అయినా మెసేజ్ పెట్టండి మీరు ఏ సేవ కు బుక్ అయ్యారో చూసి నేను మీకు అమౌంట్ చెప్తాను , డబ్బులు కట్టి మీకు టికెట్ పిడిఎఫ్ పంపిస్తాను. నాకు మీరు మీ ఆధార్ కార్డు లను పంపించాల్సి ఉంటుంది.
TIRUMALA LATEST NEWS, TIRUMALA ARJITHA SEVA BOOKING, TIRUMALA ARJIJTHA SEVA PAYMENT, HINDU TEMPLES GUIDE,