త్వరలోనే మూఢం మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - ఏ శుభకార్యాలు చేయాలి? ఏ శుభకార్యాలు చేయకూడదు? Moodami 2024 Dates

మూఢం ప్రారంభం.. ఏ పనులు చేయాలి.. ఏం చేయకూడదంటే

ఏప్రిల్ 26 తర్వాత నుంచి శుభకార్యాలు చేయడానికి మంచి ముహుర్తాలు లేవు. అందుకు కారణం.. మూఢం. హిందూ పురణాల ప్రకారం.. ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. త్వరలోనే మూఢాలు ప్రారంభం కాబోతుండటంతో.. పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరందుకున్నాయి. ఆ తర్వాత మూడు నెలల వరకు శుభ ముహుర్తాలు లేవు.

మరి ఇంతకు మూఢం అంటే ఏంటి.. ఎందుకు ఈ సమయంలో శుభకార్యాలు చేయవద్దు అంటారు.. మౌఢ్యంలో ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు అంటే..

2024 లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగష్టు 8 వరకూ దాదాపు మూడు నెలల కాలం మూఢం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.

ఇంతకు మూఢం అంటే ఏంటి..

మన పురణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. సైన్స్ ప్రకారం చూసుకున్న నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ క్రమంలో భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. ఇక మూఢాలు రెండు రకాలు. గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం ఏర్పడతాయి.

సూర్యునికి దగ్గరగా గురు, శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు వాటి శక్తులు తగ్గి బలహీనమై, నీరసపడతాయి. అంటే గ్రహాల స్థితి బలహీనంగా మారుతుందన్నమాట. గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు బలహీనంగా మారుతాయి. ఆ సమయాన్ని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. శుభకార్యాలకు గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం. అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు అంటారు పండితులు.

మూఢంలో ఏ పనులు చేయకూడదంటే..

  • మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదు.
  • లగ్నపత్రిక రాసుకోకూడదు.
  • కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు.
  • అలానే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు.
  • ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన వంటి పనులు చేయకూడదు.

మూఢంలో ఏ పనులు చేయవచ్చంటే..

  • అన్న ప్రాసన చేసుకోవచ్చు
  • ప్రయాణాలు చేయవచ్చు
  • ఇంటికి మరమ్మత్తులు చేసుకోవచ్చు
  • భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు
  • నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు
  • నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు.
  • కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు.

మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుంది..

జ్యోతిష్య శాస్త్ర పండితులు, హిందూ పురణాల్లో చెప్పిన దాని ప్రకారం.. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది కలిసి రాదని.. చెడు వార్తలు వినాల్సి రావొచ్చని.. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు అంటారు.

Tags: మూఢం, Moodami, Sukra moodami, guru moodami, moodami 2024, moodami 2024 dates, moodami telugu, moodami starting dates 2024, mudam, moodam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS