తిరుమల ఊంజల్ సేవ | Tirumala Unjal Seva Darshan Rules Tickets Booking

ఓం నమో వేంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఇప్పుడు మనం తిరుమల ఆర్జిత సేవ ల్లో ఒకటైన ఊంజల్ సేవ గురించి తెలుసుకుందాం.


తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ మనం ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు . ఇవి లక్కీ డ్రా టికెట్స్ కాదు ,
300/- స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఎలా అయితే బుక్ చేస్తామో ఇవి కూడా ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వారికి బుక్ అవుతాయి.

తిరుమల ఆర్జిత సేవల వివరాలు
కళ్యాణం టికెట్స్ వివరాలు
ఉంజల్ సేవ వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం
సహస్ర దీపాలంకర సేవ
ఆన్ లైన్ ఆర్జిత సేవ లు 
తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవము తర్వాత గృహస్తుల కోరికపై అద్దాల మహలుకు వేంచేస్తారు. ఈ మండపం మద్యలో వున్న డోల (డోల అనగా ఉయ్యాల) లో స్వామి వారికి ఉభయ దేవేరులతో డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మండపంలో అన్ని వైపుల వున్న అద్దాలలో స్వామి వారు కనిపిస్తూ భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తారు. అనంతరము కర్పూర నీరాజనము, ప్రసాదా వితరణ జరుగుతుంది.

ఊంజల్ సేవ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ?

ఈ టికెట్స్ 3 నెలల ముందే మనం టీటీడీ వెబ్సైటు లో బుక్ చేసుకోవాలి , ప్రస్తుతం ప్రతి నెల 21వ తేదీన విడుదల చేస్తున్నారు.  సెలవు రోజులు వస్తే ఒక రోజు అటు ఇటు అవుతుంది గమనించగలరు. 

ఊంజల్ సేవ టికెట్ మీద ఎంత మందిని పంపిస్తారు ?

మనం ఒక లాగిన్ లేదా ఒక మొబైల్ నెంబర్ పైన 2 టికెట్స్ అనగా ఇద్దరికీ బుక్ చేసుకోవచ్చు. 

ఊంజల్ సేవ కు చిన్నపిల్లలను పంపిస్తారా ?

చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళవచ్చు. 

తల్లిదండ్రులు టికెట్ తీసుకుంటే పిల్లలను పంపిస్తారా టికెట్ లేకుండా ?

12 సంవత్సరాల లోపు వారిని టికెట్ లేకుండా తీసుకుని వెళ్ళవచ్చు , 12 దాటినా అందరికి టికెట్స్ ఉండాలి . 

ఊంజల్ సేవ టికెట్ ఎంత ?

ఊంజల్ సేవ టికెట్ ధర ఒక్కరికి 500/-

ఊంజల్ సేవ టికెట్ ఉన్నవారికి దర్శనం ఎక్కడ నుంచి ఇస్తారు ?

ఈ టికెట్ తీసుకున్న వారికి సుపథం నుంచి ప్రవేశం ఉంటుంది , జయ విజయుల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది. 

ఊంజల్ సేవ టికెట్ ఉంటె మొదటి గడప దర్శనం ఇవ్వరా ?

లేదండి , జయ విజయుల దగ్గర నుంచి అంటే అర్ధం 300/- టికెట్ అలానే అందరికి ఇచ్చే చోట నుంచే ఉంటుంది. 

ఊంజల్ సేవ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ?

ఈ సేవ టికెట్ ఉన్న వారిని 11 గంటలకు లైన్ లోకి పంపించి ముందుగా దర్శనం చేయిస్తారు , దర్శనం అయ్యాక అద్దాలమండపం దగ్గర సేవ కు కూర్చోబెడతారు. ఈ సేవ 1:50 -2PM మధ్యలో మొదలు అవుతుంది ,  15-20 నిముషాలు  ఉంటుంది. 

సేవ చూడకుండా దర్శనం చేసుకుని వెళ్లవచ్చా ?

అది మీ ఇష్టం , వెళ్ళవచ్చు 

ఊంజల్ సేవ కు ఏ బట్టలు వేసుకోవాలి ?

సాంప్రదాయ దుస్తులు ధరించాలి 

ఊంజల్ సేవ టికెట్ తీసుకున్న మరుసటి రోజు లేదా ముందు రోజు 300/- టికెట్ తీసుకోవచ్చా ?

తీసుకోవచ్చు , మరియు కొండపైన లక్కీ డ్రా  లో కూడా పాల్గొనవచ్చు . 

ఊంజల్ సేవ తీసుకున్న తరువాత కళ్యాణం టికెట్ కూడా తీసుకోవచ్చా ?

తీసుకోకూడదు , ఇవి ఆర్జిత సేవలు కాబట్టి ఆర్జిత సేవలు ఏవైనా సరే 90 రోజుల వరకు బుక్ చేయడానికి వీలు లేదు . 

unjal seva tirumala ticket darshan rules, unjal seva latest rules

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS