తిరుమల గురించి ఎప్పటికప్పుడు మీకు హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా తెలియచేస్తాము. ఇప్పుడే మీరు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ పూర్తీ ఉచితం చాల తక్కువ సైజు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఫోటో పై క్లిక్ చేయండి
తిరుమలలో స్వామి వారికి జరిగే అద్భుతమైన సేవల్లో మెల్చట్ వస్త్రం ఒకటి, ఈ సేవ టికెట్ పొందినవారు 45 ని|| ల పాటు స్వామి వారి ఆలయం లో ఉండి స్వామి వారిని తనివితీరా చూసే అవకాశం ఉంటుంది. ఆ సేవ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ;
మెయిల్ చాట్ వస్త్రం సేవ అంటే ఏమిటి ?
మెల్ చాట్ వస్త్రం అనేది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం నాడు జరిగే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొన్న భక్తులు ఆలయ మేళతాళాలతో స్వామివారికి నివేదించే పట్టు వస్త్రాలను శిరస్సు పైన ఉంచి స్వామివారి గుడి ముందు ప్రదక్షిణ చేసి ఆ పట్టు వస్త్రాలను అర్చక స్వాములకు సమర్పిస్తారు . ఆ సమర్పించిన వస్త్రాలను అభిషేక సేవ తరువాత స్వామివారికి అలంకరిస్తారు ఈ అభిషేక సేవ అనేది సుమారు గంటసేపు చాల అద్భుతంగా జరుగుతుంది.
ఈ సేవ తగిలిన భక్తులు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మాత్రమే ఈ సేవకి తగిలే అవకాశం ఉంటుంది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అభిషేక సేవ సుమారు గంటసేపు శుక్రవారం నాడు జరుగుతుంది .
అర్చకులు శ్రీ సూక్తం, భూ సూక్తం పాడుతూ ఉండగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకిస్తారు పాలు ఆకాశగంగా జలాలు వంటి పచ్చ కర్పూరము చందనము పునుగు తైలం కస్తూరి కుంకుమపువ్వు వంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు .
స్వామివారికి పచ్చ కర్పూరము చందనము సమర్పిస్తారు. శుక్రవారం నాడు మాత్రమే స్వామి ఎద మీద కొలువున్న మహాలక్ష్మి అమ్మవారిని చూసే అవకాశం మనకు లభిస్తుంది, స్వామివారి ఆభరణాలన్నీ తొలగించి నిజరూప దర్శనం లో కనిపిస్తారు ఒక వస్త్రం మాత్రమే స్వామి వారి ముందు కప్పబడి ఉంటుంది అభిషేకం పూర్తయిన తర్వాత స్వామి నిజరూపంలో మనకు దర్శనమిస్తారు పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు
ఈ సేవ టికెట్ ఖరీదు వచ్చి దంపతులకి 12,250
ఈ టికెట్స్ టికెట్ లు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు , టికెట్స్ కావాలంటే గురువారం నాడు కొండ పైన cro ఆఫీస్ దగ్గర లక్కీ డ్రా లో పాల్గొనాలి , రెండు లేదా మూడు టికెట్స్ మాత్రమే ఉంటాయి, ఒక్కోసారి ఒకటి కూడా లేకపోవచ్చు. ఈ టికెట్స్ దంపతులకు మాత్రమే ఇస్తారు. సింగిల్ గా తీసుకోవడానికి అవకాశం లేదు.
అభిషేకానికి వచ్చి 5 లేదా 6 టికెట్స్ మాత్రమే ఉంటాయి
అభిషేక సేవా టికెట్ ఖరీదు వచ్చి మనిషికి 750 రూపాయలు
ఈ టికెట్స్ కూడా 2050వ సంవత్సరం వరకు అడ్వాన్స్ బుకింగ్ మెథడ్ లో బుక్ అయిపోయినవి.
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala latest information tirumala melchat vastram complete details tirumala information in telugu. tirumala seva information.
Ticket cost 12,500 anukunta
ReplyDeleteAbhishekam ticket eppinchagalara
ReplyDeletevery lucky people. good information. Gastroenterologist in Hyderabad
ReplyDeleteమెయిల్ చాట్ టికెట్ డ్రా ఎప్పుడైనా ట్రై చేయవచ్చా?
ReplyDelete