కుమారధార తీర్థ ముక్కోటి :
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి 24-2-2024 ఘనంగా జరిగింది.ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.
ప్రాశస్త్యం
వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు.శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది.
పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థ్లంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందడు. సాక్షత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.
ఏ తీర్థ ముక్కోటి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి వాటిపైన క్లిక్ చేయండి అవి ఓపెన్ అవుతాయి .
>>శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala kumaradhara teerdha mukkoti, tirumala vishesalu, tirumala latest information, tirumala guide in telugu, tirumala latest information.