హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. మనం తిరుమల ఆర్జిత సేవల గురించి తెలుసుకుంటున్నాం ఇప్పటివరకు కళ్యాణం , ఉంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సహస్ర దీపాలంకర సేవ గురించి తెలుసుకుందాం.
తిరుమల ఆర్జిత సేవల్లో టికెట్ లేకపోయినా అందరూ చూసే ఏకైక సేవ ఏదైనా ఉందంటే అది సహస్ర దీపాలంకర సేవ ఒకటే. ఈ సేవ ప్రతి రోజు సాయంత్రం 5:30 pm -6:30 pm వరకు స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న దీపాలంకర మండపం లో ఈ సేవ జరుగుతుంది. సహస్ర దీపాలంకరణ సేవ గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ ఎలా బుక్ చెయ్యాలి ?
ఈ టికెట్స్ మూడు నెలల ముందే విడుదల చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు లో మనం బుక్ చేసుకోవాలి. కొండపైన అప్పటికప్పుడు ఇవ్వరు
ఈ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చా ? దంపతులే చేసుకోవాలా ?
ఈ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు , దంపతులే బుక్ చేసుకోవాలనే రూల్ లేదు
సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ ఒక్కరైనా బుక్ చేసుకోవచ్చా ?
మీరు సింగల్ గా కూడా బుక్ చేసుకోవచ్చు
ఈ సేవలకు పిల్లలను పంపిస్తారా ?
పిల్లలను కూడా తీసుకుని వెళ్ళవచ్చు , 12 సంవత్సరాల లోపు వారికి టికెట్స్ అవసరం లేదు
ఈ సేవ బుక్ చేసుకుంటే మొదటి గడప దర్శనం ఇస్తారా ?
మొదటి గడప దర్శనం ఉండదు .
ఈ సేవ బుక్ చేస్తే దర్శనం త్వరగా అవుతుందా ?
సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేస్తే మీరు సేవ అయినతరువాత సేవ అనగా దీపాల మండపం లో దీపాలన్నీ వెలిగించి స్వామి వారిని ఉయ్యాలా ఊపుతూ కీర్తనలు , పాటలు పాడి హారతి ఇస్తారు. ఆ తరువాత టికెట్ తీసుకున్న వారి సుపథం నుంచి దర్శనానికి పంపిస్తారు. దర్శనం త్వరగా అవుతుంది. 300/- లైన్ కంటే ఈ దర్శనం 1-2 గంటల లోపే దర్శనం అవుతుంది.
మేము సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసాము ? తరువాత రోజు కానీ ముందు రోజు కానీ 300/- దర్శనం టికెట్ బుక్ చేయవచ్చా ?
మీరు బుక్ చేసుకోవచ్చు , అదే విధంగా కొండపైన cro ఆఫీస్ లో ఇచ్చే లక్కీ డ్రా టికెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు .
సహస్ర దీపాలంకరణ సేవ కు ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా ?
ఉంటుంది మీరు సాంప్రదాయ దుస్తులను ధరించాలి.
ఈ టికెట్ బుక్ చేసుకుంటే రూమ్ ఇస్తారా ?
మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు , కాకపోతే ఈ సేవకంటూ ప్రత్యేక కోట ఏమి ఉండదు.
మాకు సేవ టికెట్స్ ఉన్నాయి మా పిల్లలకు దొరకలేదు , 300/- టికెట్స్ బుక్ చేసాము అందరిని సుపథం నుంచి పంపిస్తారా ?
సేవ టికెట్స్ ఉన్నవారిని మాత్రమే పంపిస్తారు . మీరు కూడా సుపథం దగ్గర అడిగి చూడండి.
Tirumala Arjitha Sevas Information
తిరుమల ఆర్జిత సేవల వివరాలు |
---|
కళ్యాణం టికెట్స్ వివరాలు |
ఉంజల్ సేవ వివరాలు |
ఆర్జిత బ్రహ్మోత్సవం |
సహస్ర దీపాలంకర సేవ |
ఆన్ లైన్ ఆర్జిత సేవ లు |
Tirumala Srivari Seva Information
తిరుమల సేవ (డ్యూటీ ) లు |
---|
శ్రీవారి సేవ బుకింగ్ కొత్త రూల్స్ |
నవనీత సేవ బుకింగ్ కొత్త రూల్స్ |
పరకామణి సేవ బుకింగ్ కొత్త రూల్స్ |
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.
#tirumala sahasra deepalamkara seva ticket darshan full details. hindu temples guide tirumala information.