తిరుమల NRI దర్శనం కొత్త రూల్స్ | Tirumala NRI Darshan Latest Updates | Hindu Temples Guide

 ఓం నమో వేంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు మన హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. మీరు మన హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


మనం ఇప్పుడు
NRI దర్శనం గురించి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు NRI లకు ప్రత్యేక దర్శనం కేటాయిస్తున్నారు. వీటికి సంబంధించి సాధారణంగా అడిగే ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

NRI దర్శనం టికెట్స్ ఆన్ లైన్ లో ఎప్పుడు బుక్ చేసుకోవాలి ?

మీరు ఆన్ లైన్ లో బుక్ చేసుకొనవసరం లేదు. 

తిరుపతి లో కానీ తిరుమల లో కానీ టికెట్స్ ఎక్కడ ఇస్తారు ?

300/- దర్శనం లైన్ లో టికెట్ చెకింగ్ కౌంటర్ దగ్గర NRI కౌంటర్ ఉంటుంది. 

NRI లకు టికెట్ ధర ఎంత ఉంటుంది ?

NRI లకు కూడా 300/- టికెట్ నే ఇస్తారు , ఎక్కువ ఛార్జ్ చెయ్యరు. 

NRI దర్శనం ఎక్కడ నుంచి ఉంటుంది ?

మీరు 300/- దర్శనం టికెట్ తీసుకున్నారు కాబట్టి 300/- దర్శనం ఎలాగా ఉంటుందో మీకు కూడా అలానే ఇస్తారు. అంటే జయవిజయుల దగ్గర నుంచి ఇస్తారు. 

NRI దర్శనం వారికి మొదటి గడప దర్శనం ఉండదా ?

NRI వాళ్లకు అంటూ ప్రత్యేకంగా మొదటి గడప దర్శనం ఉండదు. 

మొదటి గడప దర్శనం చేసుకోవాలంటే ఏమి చెయ్యాలి ?

మొదటి గడపకు 4మార్గాలు ఉన్నాయి . 1) ఆర్జిత సేవ ల లక్కీ డిప్ వేయడం 2) కొండపైన cro ఆఫీస్ దగ్గర offline lucky dip వేయడం 3) recommendation letter ద్వారా.  4) Srivani Tickets

NRI దర్శనం టైమింగ్స్ ఏమిటి ?

మీరు 300/- దర్శనం లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళవచ్చు , 12pm-7pm ఈ సమయాలలో వెళ్లే ప్రయత్నం చేయండి. 

NRI వాళ్లతో పాటు లోకల్ వారిని అనగా బంధువులను ఎవరినైనా తీసుకుని వెళ్లవచ్చా ?

ఆ అవకాశం లేదు. మీరు మాత్రమే వెళ్ళాలి . 

తిరుమలలో NRI దర్శనం లైన్ ఎక్కడ ఉంటుంది ?

ATC Circle లో మీరు రిపోర్టింగ్ ఇవ్వాలి . 

దర్శనం కొరకు ఏమేమి డాక్యూమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ?

Original Passport , Visa. Xerox Copy లను కూడా తీసుకుని వెళ్ళండి. 

పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలా ?

12 సంవత్సరాల లోపు వారికి అవసరం లేదు . 

దర్శనం కోసం అర్ధమైంది రూమ్ పరిస్థితి ఏమిటి ?

రూమ్ కంటూ ప్రత్యేకంగా కోట ఏమిలేదు , మీరు Cro Office దగ్గర లైన్ లో నిలబడి రూమ్ తీసుకోవాలి. 

ఇంకా ఏమైనా దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ?

మీరు కొండపైన CRO Office దగ్గర లక్కీ డ్రా లో పాల్గొనవచ్చు 

ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 

Tirumala NRI Darshan New Rules, Tirumala Latest Information

2 Comments

  1. NRI's need to go for darshan within one month from date of arrival.

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS