ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. తిరుమల దర్శనాలలో సిపార్సు లేఖల దర్శనాలు గురించి అందరికి తెలిసిందే. ఈ లేఖలు తీసుకుని వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం అనగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఎవరైతే లెటర్ తీసుకుని వెళ్తారో వారు ఒకరోజు ముందుగా JEO ఆఫీస్ లో 11 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెటర్ ను పరిశీలించిన తరువాత సదరు భక్తుని మొబైల్ కు లెటర్ ద్వారా దర్శనం కల్పిస్తున్నారా లేదా అనేది సాయంత్రం 4 గంటల తరువాత మెసేజ్ పంపిస్తారు. దర్శనం ఒకే అవితే ఆ తరువాత టికెట్స్ కు అమౌంట్ కట్టి దర్శనం బుక్ చేసుకోవాలి. వీరికి మరుసటి రోజు ఉదయం బ్రేక్ దర్శనం కల్పిస్తారు . స్వామి వారిని దగ్గరగా వెళ్లి చూసే అవకాశం కల్పిస్తారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటం తో భక్తులకు కొంతకాలంగా ఒక సందేహం కలుగుతుంది ఎలక్షన్ కోడ్ అమలు అవితే ఆ సమయం లో ఈ లెటర్ లు పనిచేస్తాయా లేదా అని . తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి వారు ఈ రోజు వీటిపై ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడిన రోజు నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తూ సోమవారం (11.3.24) నాడు టీటీడీ పాలకమండలి నిర్ణయం. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 14న నోటిపికేషన్ విడుదలయ్యే అవకాశం. దీంతో 14వ తేది నుంచి నిలిచిపోనున్న సిఫార్సు లేఖల స్వీకరణ
On Monday (11.3.24) TTD trust board decided to cancel the acceptance of letters of recommendation from the day of publication of the election notification.
Break darshan will be provided only if protocol vips come themselves.
The notification is likely to be released on the 14th. Hence the acceptance of letters of recommendation will be stopped from 14th.
tirumala VIP Break Darshanam updates, tirumala breaking news, tirumala information.